For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ పిగ్మెంటేషన్ నివారించే స్కిన్ టోన్ మెరుగుపరిచే హోం రెమెడీస్

|

స్కిన్ పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారడం. కొందరికి ఎండలో తిరిగితే వెంటనే చర్మం నల్లబడటం జరుగుతుంటుంది. అంతే కాదు, వాతావరణంలో మార్పుల వల్ల, కాలుష్యం వల్ల కూడా స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది. చర్మం రంగు అంటే స్వతహాగా చర్మం రంగు మారి దీని వలన అసమానమైన చర్మపు రంగుకు దారి తీయడం. ఈ చర్మపు రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి ఇతర కారణాలై ఉండవచ్చు.

చాలామందిని వేధించే చర్మ సమస్యల్లో.. పిగ్మెంటేషన్‌ ఒకటి. చర్మం రంగు ముదురు చాయలోకి మారినా.. లేదా మెరుపు పూర్తిగా తగ్గి మచ్చలు పడినా తేలిగ్గా తీసుకోకూడదు. దాన్ని పిగ్మెంటేషన్‌గా పరిగణించాలి. ఈ సమస్య ప్రధానంగా మూడు రకాలుగా వేధిస్తుంది.
* చర్మం ముదురు రంగులోకి మారడాన్ని హైపర్‌ పిగ్మెంటేషన్‌ అంటారు.
* అక్కడక్కడా తెల్ల మచ్చలు పడితే.. హైపో పిగ్మెంటేషన్‌గా పరిగణిస్తారు.
* పూర్తిగా రంగు తగ్గిపోతే.. అది డీ పిగ్మెంటేషన్‌గా గుర్తించాలి.

Easy Home Remedies To Reduce Pigmentation

స్మిన్ పిగ్మేటేషన్ లక్షణాలు ఏజింగ్ లక్షణాలను తెలుపుతుంది. అంతే కాదు, మొటమలుతాలుకు మచ్చలను ఏర్పరుస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ వల్ల మరియు అసాధారణ స్కిన్ టోన్ వల్ల చర్మంలో మార్పు వస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణమేదైనా కావచ్చు . మార్కెట్లో లభించే ఉత్పత్తులు మరియు హోం మేడ్ రెమెడీస్ తో డీల్ చేయడం కొద్దిగా కష్టమే.

మార్కెట్లో అందుబాటులో ఉండే స్కిన్ క్రీమ్స్ కొద్దిగా ఖరీదైనవి, మరియు రసాయనాలతో తయారుచేయబడని కాబట్టి, వీటికి అంత ప్రాధాన్యం ఇవ్వకపోవడమే మంచిది. కెమికల్స్ చర్మం మీద ఏవిధంగా ప్రభావం చూపుతాయో ఎవ్వరూ ఉంచలేరు. అందువల్ల బెటర్ గా హోం రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది . మరియు ఈ హోం రెమెడీస్ మన వంటగదిలోనే మనకు చౌకగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు సులభంగా, చౌకగా స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలంటే ఈ ఈక్రింది హోం రెమెడీస్ ను ఫాలో అవ్వండి:

Easy Home Remedies To Reduce Pigmentation

నిమ్మ: నిమ్మలో నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ . ఇందులో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్ ప్రొపర్టీస్ ఉన్నాయి .నిమ్మరసానికి కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అప్లై చేసిన 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజూ రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది,.

Easy Home Remedies To Reduce Pigmentation

పసుపు: చర్మాన్ని బ్రైట్ గా మార్చుకోవడం కోసం పసుపును వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపు ఫేస్ ప్యాక్ లో పిగ్మేంటేషన్ నివారించే లక్షణాలు అధికంగా ఉన్నాయి . పసుపులో కొద్దిగా పాలు మరియు నిమ్మరసం మిక్స్ చేయాలి. ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.

Easy Home Remedies To Reduce Pigmentation

అలోవెర: అలోవెర జెల్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల పిగ్మేంటేషన్ సమస్య ఉండదు. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ముకానికి అప్లై చేసి మరుసటి రోజు శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ుంటుంది. ఇది మోస్ట్ ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీ..

Easy Home Remedies To Reduce Pigmentation

గందం ప్యాక్: గంద మరియు రోజ్ వాటర్ మిశ్రమాన్ని ప్యాక్ లా వేసుకోవడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ దూరమవుతుంది, . చర్మం నైస్ గా, గ్లోయింగ్ గా సాప్ట్ గా మారుతుంది.

English summary

Easy Home Remedies To Reduce Pigmentation

It's not easy to achieve perfect skin, as some may find it impossible due to the many problems associated with skin care. Our skin colour is derived from a pigment called melanin.
Story first published: Monday, July 11, 2016, 18:38 [IST]
Desktop Bottom Promotion