For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పువ్వుల్లో దాగున్న సొగసెంతో అద్భుతం..!!

By Swathi
|

అందం, సువాసన కాకుండా.. ఫ్లవర్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయని తెలుసా ? నిజం. ఫ్లవర్ ఫేస్ ప్యాక్స్.. చర్మాన్ని స్మూత్ గా, ఎలాస్టిసిటీగా ఉంచుతాయి. అలాగే పూల ఫేస్ ప్యాక్స్.. చర్మ నిగారింపుని, టోన్ ని పెంచడమే కాకుండా.. మచ్చలు, గాయాలు, మొటిమలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

పూలల్లో విలువైన ఆయిల్స్, పోషణ అందించే గుణాలు ఉండటం వల్ల.. చర్మాన్ని స్మూత్ గా ఉంచుతాయి. ఫ్లవర్ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత.. చర్మాన్ని ఎండకు ఎక్స్ పోజ్ అవకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే.. చర్మానికి పూల ద్వారా.. పోషణ పూర్తీగా అందుతుంది. సూర్య కిరణాల వల్ల.. నెగటివ్ రియాక్షన్ ఏర్పడవచ్చు.

రోజ్ ప్యాక్

రోజ్ ప్యాక్

ప్రేమకు చిహ్నమైన రోజ్ ఫవర్ చర్మ రంధ్రాలను టైట్ చేస్తుంది. రోజ్ వాటర్ ని.. ఇండియాను బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారని అందరికీ తెలుసు. అయితే గులాబీ రెక్కలను పొడి చేసి.. పాలు కలిపి.. పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది.. డెడ్ సెల్స్ ని తొలగించి.. చర్మానికి మాయిశ్చరైజర్ అందిస్తుంది.

లావెండర్ ప్యాక్

లావెండర్ ప్యాక్

లావెండర్ లో చర్మ కాంతిని పెంచే గుణాలుంటాయి. ఇవి చర్మాన్ని క్లియర్ గా మార్చడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కొన్ని లావెండర్ రెక్కలు తీసుకుని.. కొన్ని నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఆ నీటిని, రెక్కలను సెపరేట్ చేయాలి. ఈ రెక్కలను ఓట్స్ పౌడర్ లో మిక్స్ చేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని చర్మానికి పట్టించి.. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

లోటస్ ప్యాక్

లోటస్ ప్యాక్

లోటస్ లో లినోలీక్ యాసిడ్ ఉంటుంది. అలాగే ఇతర మినరల్స్ కూడా ఉంటాయి. వీటిని.. స్కిన్ వైటనింగ్ కోసం ఉపయోగిస్తారు. కొన్ని లోటస్ రెక్కలను ఉడికించి.. వడకట్టాలి. వాటిలో పాలు, రోజ్ వాటర్ కలిపి.. ఫేస్ కి అప్లై చేయాలి.

మందారం ప్యాక్

మందారం ప్యాక్

మందారం ఫేస్ ప్యాక్ మొటిమలను నివారిస్తాయి. మందారం రెక్కలను, ఉడికించిన బ్రౌన్ రైస్ ని, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ని.. కలపాలి. అలాగే విటమిన్ ఈ లిక్విడ్ కూడా కలుపుకోవచ్చు. అన్నింటినీ మిక్స్ చేసి.. పేస్ట్ చేసి.. ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మల్లెపూల ప్యాక్

మల్లెపూల ప్యాక్

మల్లెపూలు ప్యాక్ డ్రై స్కిన్ కి బాగా ఉపయోగపడుతుంది. కొన్ని మల్లెపూల రెక్కలను ఉడికించి.. వడకట్టాలి. కొంచెం మీగడ కలిపి.. ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత శుభ్ంర చేసుకోవాలి. లేదా మల్లెపూలు, పెరుగు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుని.. ముఖానికి పట్టించినా.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

బంతిపూల ప్యాక్

బంతిపూల ప్యాక్

కొన్ని బంతిపూల రెక్కలను మెత్తటి పేస్ట్ లా చేసి.. పాలు, పెరుగు, తురిమిన క్యారట్ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకుంటే.. చర్మం నిర్జీవంగా లేకుండా.. గ్లోయింగ్ గా మారుతుంది.

చేమంతి ప్యాక్

చేమంతి ప్యాక్

చలికాలంలో ముఖంపై పగుళ్లు, గీతలు కనిపిస్తుంటాయి. ఎన్ని మాయిశ్చరైజర్లు అప్లై చేసినా కొద్దిసేపటికే ఇంకిపోతుంది. రోజంతా ముఖం మృదువుగా ఉండాలంటే చేమంతి ప్యాక్ మంచి ఆప్షన్. రెండు చేమంతి పూలను నీళ్లలో ఉడకపెట్టాలి. ఆ నీటిలో కాస్త తేనె, పాలు పోసి బాగా కలుపుకోవాలి. రోజూ ఉదయం బయటికి వెళ్లేటప్పుడు ఈ మిశ్రమంతో ముఖంపై బాగా మసాజ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే రోజంతా ముఖం తాజాగా, అందంగా ఉంటుంది.

కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు, పాలు కలిస్తే ముఖం లేతగులాబీలా మెరిసిపోవాల్సిందే. పాలను బాగా కాచి అందులో కుంకుమపువ్వు వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

English summary

Flowers Are Great for Your Skin! Here’s How to Use Them

Flowers Are Great for Your Skin! Here’s How to Use Them. Did you know that besides their beauty and scent, flowers also have beauty benefits? Yes, it’s true! Flower face packs also help in making the skin supple, smooth and enhance the elasticity of the skin.
Story first published:Thursday, August 11, 2016, 16:56 [IST]
Desktop Bottom Promotion