For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి చుట్టూ డ్రై స్కిన్ (పగుళ్ళను)నివారించే ఎఫెక్టివ్ హెర్బల్ రెమెడీస్

|

కొంత మందిని గమనించినట్లైతే ముఖం అంతా క్లియర్ గా, సాప్ట్ గా ఉంటుంది. కానీ, మూతి లేదా నోటి చుట్టి డ్రైస్కిన్ తో రఫ్ గా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని అప్పుడప్పుడు ఎదుర్కుంటుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలోకనిపించే ఈమార్పు వల్ల నోటి చుట్టూ రఫ్ గా , ఫ్లాక్ స్కిన్ తో , స్కిన్ స్ట్రెచ్ అయినట్లు కనబడుతుంది. ఇది వాతావరణంలో మార్పుల వల్ల చలివల్ల పగిలిందని చాలా మంది అనుకుంటారు. ఇది కొన్ని అలర్జీల వల్ల కూడ వస్తుంది.

నోటి చుట్టు డ్రై స్కిన్ కు కారణమేదైనా కావచ్చు, దీన్ని నివారించుకోవడమే మన కర్తవ్యం. అందుకు హెర్బల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. వాటిని ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది.

సహజంగా ఉద్యోగస్తులైతే దాదాపు 8 నుండి 10 గంటల సమయం ఏసి గదుల్లో కూర్చోని పనిచేయడం వల్ల చర్మంలో నేచురల్ ఆయిల్స్ కోల్పోవడం జరుగుతుంది. దాంతో చర్మం డ్రైగా...ప్యాచ్ గా కనబడుతుంది.

ఇవే కాకుండా, కొన్ని అలర్జీలు, మందులు, అసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం లేదా పెదాలను అస్తమానం నాలుకతో తడుపుతుండటం వల్ల నోటి చుట్టు డ్రై రింగ్ ఏర్పడుతుంది.

కొన్ని సందర్భాల్లో క్రోనిక్ మెడికల్ కండీషన్ వల్ల ఇటువంటి మార్పుకు కారణమవుతుంది. దీన్నే ఆంగులార్ స్టొమటైటిస్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఫంగస్ కు కారణమవుతుంది. ఓపెన్ స్కిన్ లో ఫంగస్ ఏర్పడుట వల్ల ఆ ప్రదేశంలో వాపు, రక్త స్రావం కనబడుతుంది. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, పెదాలను అస్తమానం తడం మానేయాలి. పెదాలకు లిప్ బామ్ అప్లై చేయాలి, పెదాలకు స్ట్రాంగ్ కెమికల్స్ వాడిని లిప్ స్టిక్స్ కు దూరంగా ఉండాలి. అసిడిక్ ఫుడ్స్ నివారించాలి, అలర్జీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. వీటితో పాటు మరికొన్ని హెర్బల్ రెమెడీస్, నోటి చుట్టూ ఉన్న డ్రైస్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. అవేంటో తెలుసుకుందాం...

షీబట్టర్:

షీబట్టర్:

ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ ఎక్కువ. ఇవి చర్మంలోపలి వరకూ పోషణను అందిస్తుంది. చర్మానికి మాయిశ్చరైజ్ చేస్తుంది. షీబట్టర్ ను వేళ్లతో తీసుకుని నోటి చుట్టూ అప్లై చేసి, సున్నితంగా మర్ధ చేయాలి.

టీ ట్రీఆయిల్:

టీ ట్రీఆయిల్:

టీట్రీఆయిల్లో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది అలర్జిక్ రియాక్షన్ ను నివారిస్తుంది. కొద్దిగా టీట్రీ ఆయిల్ ను నీళ్ళలో మిక్స్ చేసి, షేక్ చేసి, ముతి చుట్టు అప్లై చేయాలి. అరగంట తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ ఇ ఎక్కువగా ఉన్నాయి.ఈ రెండింటిలో నయం చేసే గుణాలు ఎక్కువ. నోటి చుట్టు డ్రైగా మారిన స్కిన్ ను రిపేర్ చేసే , సాప్ట్గ్ గా ప్రకాశవంతంగా మార్చుతుంది. కొద్దిగా ఆలివ్ ఆయిత్ తీసుకుని, చేతి వేళ్ళతో నోటి చుట్టూ అప్లై చేసి మసాజ్ చేయాలి. ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర:

అలోవెర:

అలోవెరలో హీలింగ్ లక్షణాలు ఎక్కువ.ఇది కేవలం నొప్పిని తగ్గించడం మాత్రమే కాదు, ఇది నోటి చుట్టు ఫ్లాకీ స్కిన్ తొలగిస్తుంది. బ్రేక్ అయిన స్కిన్ టిష్యులను రిపేర్ చేస్తుంది, లేదా కొత్తకణాలను ఏర్పరుస్తుంది. అలోవెర జెల్ ను మూతి చుట్టూ అప్లై చేసి, మర్దన చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

బాదం నూనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఎక్కువ. బ్రోకెన్ స్కిన్ సెల్స్ ను నయం చేసి, పోషణ అందించి కొత్తగా ఏర్పడేందుకు సహాయపడుతుంది. బాదం ఆయిల్ ను రోజూ రాత్రి పడుకునే ముందు నోటి చుట్టూ అప్లై చేసి మసాజ్ చేయాలి.

పంచదార:

పంచదార:

పంచదార నేచురల్ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది, ఇది ఎలాంటి ఇన్ఫ్లమేషన్ కు గురికాకుండా డ్రై స్కిన్ తొలగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పంచదారలో, ఒకటీస్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, నోటి చుట్టూ అప్లై చేసి, మర్దన చేయాలి. తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే చర్మానికి పోషణ అందుతుంది.

మలై:

మలై:

మిల్క్ క్రీమ్ లో యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, పొటాషియం, మినిరల్స్ ఎక్కువ, ఇది చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మానికి డీప్ గా హైడ్రేషన్ అందిస్తుంది, ప్యాచ్ స్కిన్ నివారిస్తుంది.నోటి చుట్టూ ఫ్రెష్ గా ఉండే మిల్క్ క్రీమ్ ను అప్లై చేసి మర్దన చేసి, 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ, ఇది ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. డ్యామేజ్ అయిన టిష్యులన్ రిపేర్ చేస్తుంది. కొత్త కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. నోటి చుట్టూ డ్రై స్కిన్ తొలగించుకోవడానికి సులువైన మార్గం కొబ్బరి నూనె.

అరటి తొక్క:

అరటి తొక్క:

అరిటి తొక్కలో విటమిన్ బి అధికం,ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అరటి తక్కను డ్రైస్కిన్ ఉన్న ప్రదేశంలో మర్దన చేయాలి. 5 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాల. ఈ నేచురల్ రెమెడీని ప్యాచ్ స్కిన్ తొలగిపోయే వరకూ వారానికి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

గ్లిజరిన్:

గ్లిజరిన్:

నాన్ టాక్సిక్ గ్లిజరిన్ లో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువ, ఇది వాటర్ రిటన్షన్ తగ్గిస్తుంది, చర్మంలో నయం చేసే గుణాలు ఎక్కవ. ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ తీసుకుని, వాటర్ తో మిక్స్ చేసి, కాటన్ తో డిప్ చేసి నోటి చుట్టూ ఉన్న డ్రై స్కిన్ మీద అప్లై చేసి, తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పెరుగు:

పెరుగు:

పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, విటమిన్స్ ను డ్రైస్కిన్ నివారిస్తాయి. డ్రై స్కిన్ కు పోషణను అందిస్తాయి. చేతిలోకి పెరుగు తీసుకుని, నోటి చుట్టూ అప్లై చేయాలి. 2నిముషాలు మసాజ్ చేసి, డ్రై అయిన తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.

నీళ్ళు:

నీళ్ళు:

చాలా సింపుల్ రెమెడీ. ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరానికి సరిపడా నీళ్ళు అందుతుంటే , చర్మంలో డ్రైనెస్ అనేది ఉండదు. కాబట్టి, రోజూ శరీరానికి సరిపడా నీళ్ళు తాగాలి.

English summary

Herbal Ingredients To Treat Dry Skin Around Mouth

Dry skin around mouth, we all have faced the situation at some point or the other in our life. That dry ring around mXouth with stretchy flaky skin hanging out is not just the outcome of cold weather. It can also be triggered due to allergies or dermatitis.
Desktop Bottom Promotion