For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముక్కు, గెడ్డంపై ఇబ్బంది కలిగించే మొటిమలను నివారించే హెర్బల్ రెమెడీస్ ..!!

పింపుల్స్ ను నేచురల్ గా తగ్గించుకోవడానికి, త్వరగా మార్పును పొందడానికి కొన్ని హెర్బల్ రెమెడీస్ ను ఫాలో అవ్వాలి. మరి ముక్కు, గెడ్డం మీద ఉండే మొటిమలను నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క

|

ముఖంలో మొటిమలు ఏ ప్రదేశంలో వచ్చినా ఇబ్బందికరంగానే ఉంటుంది. బుగ్గల మీద, నుదిటి మీద మొటిమలు రావడం సహజం? అయితే ముక్కు, గెడ్డం మీద మొటిమలొస్తే చాలా చిరాకుగా ఉంటుంది. ? ముక్కు, గెడ్డం మీద వచ్చే మొటిమలను నివారించుకోవడానికి కొన్ని హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

చర్మంలోని సెబాస్టియన్ గ్రంథులు బ్యాక్టీరియాతో మూసుకుపోయినప్పుడు, పస్ పైకి ఉబ్బుతాయి. దాంతో పెయిన్ ఫుల్ యాంగ్రీ బంప్స్ పెరుగుతాయి. ఇవి కేవలం ముఖంలో మాత్రమే కాదు, బ్యాక్, నెక్, షోల్డర్ మీద కూడా ఏర్పడుతాయి.

Herbal Remedies To Get Rid Of Pimples On The Chin & Nose!

అందుకు ఏం చేయాలి.? కెమికల్స్ తో తయారుచేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ , ఫేస్ వాస్ ను ఎంపిక చేసుకుని, రోజుకు రెండు సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి. అస్తమానం చేత్తో మొటిమలను టచ్ చేయడం నివారించాలి. స్మోకింగ్ నిలిపేయాలి. ఇంటి నుండి బయటకు రావడానికి 2 గంటల ముందే సన్ స్క్రీన్ లోషన్ బాడీ మొత్తం అప్లై చేసుకోవాలి. రోజుకు సరిపడా 8 గ్లాసుల నీళ్ళను తప్పనిసరిగా తాలి. ఎక్కువనీళ్ళు తాగడం వల్ల బాడీలోని టాక్సిన్స్ బయటకు ఫ్లష్ అవుట్ అవుతాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే డైట్ ను ఫాలో అవ్వాలి. హెల్తీ స్కిన్ కోసం విటమిన్ రిచ్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

అలాగే పింపుల్స్ ను నేచురల్ గా తగ్గించుకోవడానికి, త్వరగా మార్పును పొందడానికి కొన్ని హెర్బల్ రెమెడీస్ ను ఫాలో అవ్వాలి. అయితే హెర్బల్ రెమెడీస్ అప్లై చేయడానికి ముందు స్కిన్ మీద ప్యాచ్ టెస్ట్ ను చేసుకోవడం మంచిది. మరి ముక్కు, గెడ్డం మీద ఉండే మొటిమలను నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. టీట్రీ ఆయిల్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ తీసుకుని అందులో కాటన్ బాల్ ను డిప్ చేసి, మొటిమల మీద అప్లై చేసి 15 నిముషాల తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ అవి తగ్గిపోయే వరకూ ప్రయత్నించాలి.

టూత్ పేస్ట్ :

టూత్ పేస్ట్ :

టూత్ పేస్ట్ లో మెంతోల్ ఉంటుంది. కాబట్టి, తక్షణం మొటిమలను నివారిస్తుంది. మొటిమల మీద పేస్ట్ ను అప్లై చేసి, రాత్రంతా అలాగే ఉండనివచ్చి తర్వాత శుభ్రం చేసుకుంటే వాపు క్రమంగా తగ్గిపోతుంది.

తేనె :

తేనె :

తేనె లో డిస్ ఇన్ఫెక్ట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది మైక్రోబ్స్ ను నివారిస్తుంది. స్కిన్ హీలింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి, ఒక టేబుల్ స్పూన్ తేనెలో సమంగా దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి, ముఖం మొత్తం అప్లై చేయాలి. 5నిముషాలు ముఖం మొత్తం మర్దన చేసి, ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా కడిగేసుకోవాలి. వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

. గార్లిక్ :

. గార్లిక్ :

వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ మొటిలమను వెంటనే డ్రై చేస్తుంది. అందుకు ఏం చేయాలంటే, ఒక వెల్లుల్లి రెబ్బను స్మూత్ గా పేస్ట్ చేయాలి. ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి, మొటిమల మీద అప్లై చేసి మర్ధన చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం :

నిమ్మరసం :

నిమ్మరసంలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మైక్రోబ్స్ ను నాశనం చేస్తుంది. చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తుంది. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి, అందులో నిమ్మరసం మిక్స్ చేసి, స్మూత్ పేస్ట్ లా చేయాలి. దీన్ని మొటిమల మీద సున్నితంగా మర్ధన చేయాలి. రాత్రుల్లో నిద్రించడానికి ముందు అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తర్వాత ఉదయం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయుర్వేదిక్ మాస్క్ పింపుల్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. సెన్సిటివ్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది.

స్టీమింగ్ :

స్టీమింగ్ :

స్టీమింగ్ వల్ల మూసుకుపోయిన రంద్రాలు తెరచుకునేలా చేసి, టాక్సిన్స్ ను తొలగిస్తుంది. చర్మంలో మలినాలు తొలగిపోతాయి, మొటిమలు తగ్గుతాయి. వారంలో ఒక సారి 10 నుండి 15 నిముషాలు స్టీమ్ చేస్తే చాలా . స్టీమ్ చేసే వాటర్ లో ఎసెన్సియల్ ఆయిల్స్ మిక్స్ చేసి, మరింత చర్మానికి పోషణ అందుతుంది.

 బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా డెడ్ స్కిన్ లేయర్స్ తొలగిస్తుంది. చర్మంలో ఆయిల్ ప్రొడక్షన్ నివారిస్తుంది. దాంతో మొటిమలు దూరం అవుతాయి. ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కు సమయంగా వాటర్ తీసుకుని మిక్స్ చేసి, పేస్ట్ చేసి, మొటిమల మీద అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత రబ్ చేసి ప్లెయిన్ వాటర్ తో శుబ్రం చేసుకోవాలి.

 కీరదోస జ్యూస్ :

కీరదోస జ్యూస్ :

కీరదోసకాయలో పొటాసియం, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మెత్తగా పేస్ట్ చేసి, మొటమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది ఇన్ఫ్లమేషన్, మరియు వాపును తగ్గిస్తుంది. కీరదోసకాయను తొక్క తీసి, స్మూత్ గా పేస్ట్ చేసి అప్లై చేయాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. మొటిమలను క్లియర్ అవుతాయి.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయిలో పెపైన్ మరియు విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలోని మురికిని తొలగించి, చర్మంను స్మూత్ గా మార్చుతుంది. బాగా పండిన బొప్పాయి పండు గుజ్జు తీసుకుని అందులో చిటికెడు పసుపు మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖం మొత్తం అప్లై చేయాలి. ఈ మాస్క్ ను వారానికొకసారి అప్లై చేస్తే అద్భుతంగా ఉంటుంది.

ఐస్ :

ఐస్ :

మొటిమలను నివారించడంలో ఐస్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది. చర్మరంద్రాలను తెరచుకునేలా చేసి శుభ్రం చేస్తుంది. మొటిమలను క్లియర్ చేస్తుంది.

English summary

Herbal Remedies To Get Rid Of Pimples On The Chin & Nose!

Is your nose and chin prone to acne onslaught? Does it feel like grease fest when your touch your nose? Then, here are some herbal remedies for pimples on the nose and chin area, which you will thank us for once you try them!
Story first published: Saturday, December 24, 2016, 15:30 [IST]
Desktop Bottom Promotion