For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో పొడి చర్మాన్ని తడిగా, కాంతిగా మార్చే నేచురల్ ఫేస్ మాస్కులు..

|

సంవత్సరంలో అన్ని సీజన్లలో కంటే వింటర్ సీజన్లో చర్మం చాలా బాధించబడుతుంది . చర్మం డ్రైగా మారడం, మరియు ముడుతలు ఏర్పడటం జరిగుతుంది. వయస్సు పెరిగే కొద్ది వెంటనే ముఖంలో ముడుతలలు ఎలా కనబడుతాయయో... అదే విధంగా వింటర్ సీజన్ మన ముఖాన్ని ముడుతలతో నింపేస్తుంది . వింటర్ లో చలి చర్మంలోని తేమనంతా గ్రహించేస్తుంది.

గాలిలో తేమలేకపోవడం వల్ల,వాతావరణ ప్రభావం వల్ల ముఖంలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. దాంతో చర్మం డ్రైగా మారుతుంది. చర్మంలో ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచడానికి అంతగా సరిపోవు . దాంతో చల్లి వాతావరణం వల్ల చర్మం మీద దుష్ప్రభావాన్ని చూపుతుంది.

వింటర్లో పాదాల సంరక్షణ..పాదాలు పగల కుండా డెడ్ స్కిన్ తొలగించే సింపుల్ టిప్స్ ..

ఈ కారణంగా వింటర్లో చాలా మంది డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతుంటారు . డ్రై స్కిన్ వల్ల స్కిన్ రాషెస్ మరియు చర్మ పగుళ్లు ఏర్పడుతుంది. అందుకు బాధపడాల్సి అవసరం లేకుండా, ఏజింగ్ వల్ల మరియు వింటర్లో చలికి డ్రై స్కిన్ వల్ల చర్మంలో వచ్చే చర్మ సమస్యలు మరియు ముడుతలను నివారించడానికి వివిధ రకాల ఫేస్ మాస్కులు అందుబాటులో ఉన్నాయి.

పొడి చర్మం: హోం మేడ్ నేచురల్ ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ మాస్క్ లు చర్మాన్ని యంగ్ గా మరియు ప్రకాశవంతంగా మరియు ఫ్రెష్ గా ఉంచుతాయి . ఈ ఫేస్ మాస్క్ లను ఇంట్లో తయారుచేయడం చాలా సులభం మరియు వీటిని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల కొన్ని వారాల్లోనూ మెరిసేటి చర్మ కాంతిని పొందవచ్చు . మరియు వింటర్లో డ్రై స్కిన్ మరియు ముడుతలను మాయం చేసే హోం మేడ్ ఫేస్ మాస్క్ ఏంటో చూద్దాం...

1.యాంటీఆక్సిడెంట్ మాస్క్:

1.యాంటీఆక్సిడెంట్ మాస్క్:

ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మం బ్రైట్ గా మారుతుంది. మరియు అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది . 1/2బొప్పాయి మరియు 1/4చెంచా నిమ్మరసం, 1/2చెంచా తేనె మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ ఫేస్ మాస్క్ ను ముఖం మెడకు పట్టించి, 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

2.అవొకాడో, తేనె మాస్క్:

2.అవొకాడో, తేనె మాస్క్:

ఒక అవొకాడో పండులోని సగాన్ని మెత్తగా మ్యాష్ చేసి, ఈ పేస్ట్ కు 2 చెంచాల తేనె, మరియు అరచెంచా కొబ్బరి నూనె మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 5నిముషాలు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

3.ఓట్ మీల్ మరియు పెరుగు మాస్క్:

3.ఓట్ మీల్ మరియు పెరుగు మాస్క్:

ఇది చర్మాన్ని స్మూత్ గా మార్చి మొటిమలు, మచ్చలను మాయం చేస్తుంది . ఇది ముడతలను కూడా నివారిస్తుంది . 2 చెంచాల ప్లెయిన్ పెరుగు, 1 చెంచా తేనె, 1/3 కప్పు ఓట్ మీల్ పౌడర్, 1/2 హాట్ వాటర్ మిక్స్ చేసి మెత్తగా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4.స్ట్రాబెర్రీ మరియు లెమన్ షేప్ మాస్క్:

4.స్ట్రాబెర్రీ మరియు లెమన్ షేప్ మాస్క్:

అరకప్పు స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి అందులో 1 చెంచా తేనె, ఒక చెంచా పెరుగు, 2చెంచాలా లెమన్ జ్యూస్ మిక్స్ చేయాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

5.ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు గ్రీన్ టీ మాస్క్:

5.ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు గ్రీన్ టీ మాస్క్:

3చెంచాల గ్రీన్ టీ లో 1 చెంచా ాపిల్ సైడర్ వెనిగర్, 2చెంచాలా పెరుగు, 1 చెంచా ఓట్ మీల్ పౌడర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

6.కీరదోసకాయ మరియు పెరుగు ఫేస్ మాస్క్:

6.కీరదోసకాయ మరియు పెరుగు ఫేస్ మాస్క్:

తొక్క తీసిన కీరదోసకాయను మెత్తగా గ్రైండ్ చేసి అందులో 1చెంచా పెరుగు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10-15నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

7.మిల్క్ క్రీమ్ మరియు తేనె:

7.మిల్క్ క్రీమ్ మరియు తేనె:

మీకు కనుకు డ్రై అండ్ రఫ్ స్కిన్ ఉన్నవారు..ముఖ్యంగా వింటర్లో ఈ ఫేస్ మాస్క్ మీ చర్మానికి బాగా ఉపయోగపడుతుంది . ఒక చెంచా పాలమీగడలో మరియు 1 చెంచా తేనె మిక్స్ చేసి, దీన్ని ముఖానికి అప్లై చేసి 20నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Home-made Hydrating Face Masks For Winter

The skin on our face suffers the most during a winter season. The skin gets dry and wrinkles start to appear on it. The signs of ageing may appear quickly on your faces, as the winters cold may take the moisture away from your face.
Story first published: Friday, January 22, 2016, 18:18 [IST]
Desktop Bottom Promotion