For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో వేధించే పొడిచర్మాన్నికి గుడ్ బై చెప్పండిలా..

By Swathi
|

చలికాలం వచ్చిందంటే.. చలితో వణికిపోవడం మాత్రమే కాదు.. చర్మం కూడా పొడిబారిపోయి చికాకు తెప్పిస్తుంటుంది. మాయిశ్చరైజర్ రాసుకున్నా.. ఏమాత్రం ఫలితం కనిపించదు. ముఖంపై చర్మం మరీ పొడిబారుతుంది. అలాగే పెదాల చుట్టూ చర్మం తెల్లగా మారిపోయి.. అసహ్యంగా కనిపిస్తుంది. ఈ సమస్య ఏ ఒక్కరికో పరిమితం కావడం లేదు. చలికాలం వచ్చిందంటే.. అందరినీ వెంటాడే సమస్య ఇది.

చర్మం స్మూత్ గా, నిగారిస్తూ ఉండాలంటే.. తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే చలికాలంలో ఇది అసాధ్యమని చాలా మంది ఫీలవుతూ ఉంటారు. ఎందుకంటే.. చర్మం పొడిబారి నిర్జీవంగా మారిపోతుంది కాబట్టి. కానీ.. ఇంట్లోనే చక్కటి రెమిడీస్ ఫాలో అవడం వల్ల ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

milk

పాలు
చర్మానికి పాలు చక్కటి మాయిశ్చరైజర్ లా పనిచేస్తాయి. పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ డెడ్ స్కిన్ సెల్స్ ని నాశనం చేసి.. చర్మంలో తేమ శాతం పెరిగేలా చేస్తుంది. శుభ్రమైన క్లాత్ ని చల్లటి పాలలో ముంచాలి. చిరాకుగా, పొడిబారిన చర్మం ఉన్న ప్రాంతంలో ఈ క్లాత్ ని పెట్టాలి. 5 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మీ చర్మానికి సహజ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

అలోవెరా జెల్
పొడిబారిన చర్మానికి త్వరిత ఉపశమనం కలిగించడానికి అలోవెరా జెల్ చక్కటి పరిష్కారం. అలోవెరా జెల్ లో ఉండే యాసిడ్స్ డెడ్ స్కిన్ సెల్స్ ని నాశనం చేస్తాయి. కాబట్టి న్యాచురల్ గా లభించే ఆలోవెరా మొక్క తీసుకుని దాన్ని కట్ చేస్తే జెల్ వస్తుంది. దాన్ని ముఖానికి పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

coconut oil

కొబ్బరినూనె
స్నానానికి వెళ్లే ముందు బకెట్ నీటిలో కొన్ని చుక్కల కొబ్బరినూనె కలపాలి. కొబ్బరినూనె మీ చర్మాన్ని స్మూత్ గా మార్చేస్తుంది. అయితే ఈ నీటిని కేవలం శరీరానికి మాత్రమే ఉపయోగించాలి. తలకు వాడకూడదని మర్చిపోకండి.

స్నానం
చలికాలంలో ఎక్కువసేపు స్నానం చేయకూడదు. 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం స్నానాల గదిలో ఉండకూడదు. ఎక్కువ సమయం స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు తగ్గిపోతాయి. అలాగే స్నానానికి కేవలం గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. వేడి నీళ్లు ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారుతుంది.

English summary

Home remedies for dry skin in winters

Dry and flaky skin is a common complaint in the winter time. Cold, dry winter air sucks the life out of silky, smooth skin. Other factors that contribute to dry skin include aging, nutritional deficiencies, and a genetic predisposition.
Story first published: Tuesday, January 5, 2016, 9:56 [IST]
Desktop Bottom Promotion