For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో పండిన అరటిపండ్లు ఉంటే చాలు..చర్మ సౌందర్యం రెట్టింపు...

|

బాగా పండిన అరటిపండ్లను పడేస్తున్నారా? అయితే మీరు పొరపాటు చేస్తున్నట్లే, మరి అయితే ఈ సారి బాగా మగ్గినా కూడా పడేయకండి. ఇలా పండిన అరటిపండ్లతోటే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఓవర్ గా పండిన అరిటిపండ్లను బ్యూటీకి ఉపయోగించుకుంటే, దాదాపు అన్ని రకాల బ్యూటీ సమస్యలను నివారించుకోవచ్చు . అంతే కాదు చర్మం చూడటానికి యంగ్ గా మరియు ప్రకాశవంతంగా కనబడుతుంది.

తొక్కే కదా అని పారేయకు,అందులోని లాభాలు చూడు

చర్మఆరోగ్యాన్ని, మరియు అందాన్ని కాపాడుటలో అరటిపండ్లు గ్రేట్ గా సహాయపడుతాయి . డార్క్ సర్కిల్స్ నుండి జుట్టు సమస్యల వరకూ ఒక అద్భుత ట్రీట్మెంట్ ను అందిస్తుంది. అందువల్ల బాగా పండిన అరటిపండ్లను పడేయకండి, మొత్తం బనానా ఉపయోగించి బ్యూటీ ప్రాబ్లెమ్స్ ను నివారించుకోవచ్చు . చర్మానికి అరటి ప్యాక్ ను ఉపయోగించడం వల్ల కెమికల్ క్రీమ్స్ అవసరం ఉండదు .

అరటిపండులో దాగిఉండే సౌందర్య రహస్యాలు...

అరటిపండ్లు నేచురల్ గానే ముఖంలో కాంతిని నింపుతుంది, అంతే కాదు ఇందులో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ స్కిన్ రీజనరేషన్ మరియు రిపేర్ చేస్తుంది. ముఖం మీద అరటిపండ్లను ముఖానికి నేరుగా అప్లై చేయడం వల్ల చర్మం లోపలి నుండి మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు

బాగా పండిన పండ్లు చర్మానికి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి , మరియు ఇది ప్రతి ఒక్క స్కిన్ లేయర్ ను లోపలి నుండి శుభ్రం చేసుకొని వస్తుంది. ఇది అన్ని రకాల ముడుతలు మరియు ఫైన్ లైన్స్ నివారిస్తుంది మరియు చర్మ రంద్రాలు తగ్గుముఖం పడుతాయి. మరి ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలన్నా, చర్మ కాంతి పెంచాలన్నా..పండిన అరటి పండును ఎలా ఉపయోగించాలో చూద్దాం...

జిడ్డు చర్మానికి అరటి:

జిడ్డు చర్మానికి అరటి:

ఒక అరటిపండుగుజ్జులో 3 చెంచాలా నిమ్మరసం మిక్స్ చేసి, దీన్ని చర్మానికి అప్లై చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మంలోని ఎక్సెస్ ఆయిల్, జిడ్డును నివారించి మరి డ్రైగా మారకుండా నివారిస్తుంది.

డ్రై అండ్ చిక్కుబడిన జుట్టుకు అరటి:

డ్రై అండ్ చిక్కుబడిన జుట్టుకు అరటి:

ఒక అరటి పండును మెత్తగా పేస్ట్ చేసి అందులో అరకప్పు పెరుగు మరియుఅ వొకాడో పేస్ట్ మిక్స్ చేసి ఈ మాస్క్ ను తలకు వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు గ్లాసీగా మరియు సాప్ట్ గా మారుతుంది

నేచురల్ మాయిశ్చరైజర్:

నేచురల్ మాయిశ్చరైజర్:

అరటిపండు బెస్ట్ నేచురల్ మాయిశ్చరైజర్ . కెమికల్ బేస్డ్ క్రీమ్స్ ను వాడటం వల్ల ముందు ముందు స్కిన్ డ్యామేజ్ అవుతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా బాగా పండిన అరటిపండును మ్యాష్ చేసి చర్మానికి అప్లై చేయాలి. 10నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే బేబీ సాప్ట్ స్కిన్ పొందవచ్చు.

 ముఖంలో ముడతలను నివారించడానికి :

ముఖంలో ముడతలను నివారించడానికి :

అరటిపండు గుజ్జులో 3టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత మసాజ్ చేయాలి 15నిముషాల తర్వాత తిరిగి రెండో సారి అప్లై చేసి పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ముడుతలు మాయం అవుతాయి.

డెడ్ స్కిన్ సెల్స్ తొలగించే బనానా:

డెడ్ స్కిన్ సెల్స్ తొలగించే బనానా:

బాగా పండిన అరటిపండు గుజ్జులో 3చెంచాల ఓట్స్, 3చెంచాల కోకపౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. దీన్ని ఫేషియల్ మాస్క్ లా వేసుకోవాలి. సర్కులర్ మోషన్లో మసాజ్ చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

డార్క్ సర్కిల్స్:

డార్క్ సర్కిల్స్:

బాగా పండిన అరటిపండును మెత్తగా గుజ్జు చేసి ముఖానికి అప్లై చేయాలి. దీన్ని రెగ్యలర్ గా ఉపయోగిస్తుంటే ముఖంలో డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. బాగా పండిన అరటిపండులో ఉండే క్యాల్షియం డార్క్ సర్కిల్స్ కు వ్యతిరేఖంగా పనిచేస్తుంది. డార్క్ సర్కిల్స్ తొలగించుకోవడానికి ఇది ఒక సులభ మార్గం.

పాదాల పగుళ్ళు:

పాదాల పగుళ్ళు:

బాగా పండిన అరిటిపండ్లను మెత్గగా చేసి పాదాల మీద అప్లై చేయాలి. తర్వాత కాళ్ళను సిల్వర్ ఫోయల్ తో చుట్టి ఒక గంట అలాగే ఉంచాలి . లేదా రాత్రి నిద్రించే ముందు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

How To Solve Your Beauty Problems With A Ripe Banana

Banana can be a saviour for your skin, as it can treat all your skin-related issues from dark circles to frizzy hair. Hence, do not throw away an overripe banana, as you can make full use out of it to fix your beauty problems. You don't need any chemical creams too, if you use a banana for your face problems.
Desktop Bottom Promotion