For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వయసుని 5 ఏళ్లు తగ్గించి, యంగ్ లుక్ అందించే అమేజింగ్ ప్యాక్..!

ఫ్లాక్స్ సీడ్ మాస్క్ ముడతలు తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఎలాస్టిసిటటీని మెరుగుపరుస్తాయి. ఫైన్ లైన్స్ రాకుండా అడ్డుకుంటుంది.

By Swathi
|

మీ చర్మం లూజ్ గా మారిందని ఫీలవుతున్నారా ? కళ్ల చివర్లలో ఏవైనా ఫైన్ లైన్స్ కనిపిస్తున్నాయా ? లేదా ఇంతకు ముందు కనిపించని డార్క్ స్పాట్స్ కనిపిస్తున్నాయా ? అయితే మీకో సింపుల్ సొల్యూషన్ అందుబాటులో ఉంది. అది ఫ్లాక్స్ సీడ్ ఫేస్ ప్యాక్.

Look 5 Years Younger With This Purifying Flaxseed Face Mask Recipe!

ఇది మీ చర్మాన్ని ట్రాన్స్ ఫాం చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా త్రీ, సిక్స్, నైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ యాసిడ్స్ చర్మం లోపలి లేయర్స్ లోకి వెళ్లి.. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీంతో చర్మం షైనీగా, స్మూత్ గా మారుతుంది.

ఫ్లాక్స్ సీడ్స్ లో విటమిన్ ఏ, బి, ఈ ఉంటాయి. అలాగే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి డెడ్ స్కిన్ లేయర్స్ ని తగ్గిస్తాయి, రంధ్రాలను మాయం చేస్తాయి. ఆయిలీనెస్ ని తగ్గిస్తాయి. చర్మాన్ని గ్లోయింగ్ గా, యంగ్ గా మారుస్తాయి.

ఫ్లాక్స్ సీడ్ మాస్క్ ముడతలు తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఎలాస్టిసిటటీని మెరుగుపరుస్తాయి. ఫైన్ లైన్స్ రాకుండా అడ్డుకుంటుంది. అయితే ఫ్లాక్స్ సీడ్స్ ని పొడి చేయకుండా డైరెక్ట్ గా అప్లై చేయకూడదని గుర్తుంచుకోండి. మరి మీ వయసుని 5 ఏళ్లు తగ్గించే ఫ్లాక్ సీడ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో, అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

స్టెప్ 1

స్టెప్ 1

అర కప్పు నీటిని ఒక గిన్నెలో వేడి చేయాలి. బాగా ఉడికేంతవరకు వేడి చేయాలి. మంట తక్కువగా పెట్టి వేడిచేయడం మంచిది.

స్టెప్ 2

స్టెప్ 2

1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ని నీటిలో కలపాలి. మరో 10 నుంచి 15 నిమిషాల పాటు సన్నని మంటపై వేడిచేయాలి. స్పూన్ తో కలుపుతూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ గిన్నెను తెల్లటి వస్త్రంతో కవర్ చేయాలి. గంట లేదా రెండుగంటలు అలాగే వదిలేయాలి.

స్టెప్ 3

స్టెప్ 3

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఫ్లాక్స్ సీడ్స్ ని మిక్సీలో వేసి.. మెత్తటి పేస్ట్ లా చేయాలి. ఏమాత్రం బరకగా లేకుండా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మిశ్రమం మరీ రఫ్ గా ఉంటే.. మిక్సీలో వేసేటప్పుడు కాస్త పాలు కలిపితే మెత్తటి పేస్ట్ తయారవుతుంది.

స్టెప్ 4

స్టెప్ 4

1 టీస్పూన్ ముల్తానీ మట్టిని ఈ ప్యాక్ లో కలపాలి. ముల్తానీ మట్టి చర్మంలో మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బ్యాక్టీరియాని తొలగిస్తుంది. చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తుంది.

స్టెప్ 5

స్టెప్ 5

ఒక టేబుల్ స్పూన్ తేనెను ఈ మిశ్రమంలో కలపాలి. అన్ని బాగా కలిసేవరకు మెత్తటి పేస్ట్ లా కలుపుకోవాలి. తేనెలో ఉండే ఎమినో యాసిడ్ చర్మం మాయిశ్చరైజింగ్ తో ఉండటానికి సహాయపడుతుంది. విటమిన్ ఈ, సిలు చర్మాన్ని బ్రైట్ గా మారుస్తాయి.

స్టెప్ 6

స్టెప్ 6

ముందుగా ముఖాన్ని క్లెన్స్ చేసుకోవాలి. ఇది ముఖంలో పేరుకున్న దుమ్ముని తొలగిస్తుంది. ఒకవేళ ముఖంలో మేకప్ ఉంటే.. మైల్డ్ క్లెన్సర్ తో తొలగించుకోవాలి.

స్టెప్ 7

స్టెప్ 7

బ్రష్ ఉపయోగించి.. ఈ ఫ్లాక్స్ సీడ్ ఫేస్ ప్యాక్ ని ఫోర్ హెడ్ నుంచి నెక్ వరకు కిందకు అప్లై చేయాలి. కళ్లు, పెదాల చుట్టూ చర్మాన్ని వదిలేయాలి. పెదాలు, కళ్ల చుట్టూ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇక్కడ ఈ ప్యాక్ అప్లై చేస్తే చర్మం డ్రైగా మారడమే కాదు.. ముడతలు ఏర్పడానికి కారణమవుతుంది.

స్టెప్ 8

స్టెప్ 8

ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆరిన తర్వాత కొన్ని నీటిని ముఖంపై చిలకరించాలి. తర్వాత ప్యాక్ కాస్త లూజ్ అయితే.. అప్పుడు గుండ్రంగా స్క్రబ్ చేసుకోవాలి. చేతివేళ్లతోనే స్క్రబ్ చేసుకోవాలి. అలా 2 నిమిషాలు స్క్రబ్ చేయాలి.

స్టెప్ 9

స్టెప్ 9

ఇప్పుడు ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. టిష్యూ ఉపయోగించి.. అదనపు మాయిశ్చరైజర్ ని తొలగించాలి. టవల్ తో రుద్దుకోకపోవడం మంచిది.

స్టెప్ 10

స్టెప్ 10

ఇప్పుడు ఆయిల్ లేకుండా ఉండే మాయిశ్చరైజర్ తో మసాజ్ చేసుకోవాలి. నుదురుపై కొన్నిసార్లు కాస్త సున్నితంగా స్లాప్ చేస్తూ మసాజ్ చేయాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ ని పైకి అప్లై చేయాలి. తర్వాత బుగ్గలకు అప్లై చేయాలి. ఈ మాయిశ్చరైజర్ లో చర్మం నానితే.. గ్లోయింగ్ గా మారుతుంది.

English summary

Look 5 Years Younger With This Purifying Flaxseed Face Mask Recipe!

Look 5 Years Younger With This Purifying Flaxseed Face Mask Recipe! For skin that is baby soft to touch with enviable radiance, try this flax seed face mask!
Story first published: Friday, December 9, 2016, 11:56 [IST]
Desktop Bottom Promotion