For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లవర్ ఫేస్ ప్యాక్స్ లో దాగున్న అమేజింగ్ బ్యూటి సీక్రెట్స్..!

అందం, సువాసనతో ఆకర్షించే ఫ్లవర్స్ మీ అందాన్ని ముగ్ధమనోహరంగా మారుస్తాయి. ఫ్లవర్ ఫేస్ ప్యాక్స్.. చర్మాన్ని స్మూత్ గా, ఎలాస్టిసిటీగా ఉంచుతాయి. అలాగే పూల ఫేస్ ప్యాక్స్.. చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తాయి.

By Swathi
|

అందం, సువాసనతో ఆకర్షించే ఫ్లవర్స్ మీ అందాన్ని ముగ్ధమనోహరంగా మారుస్తాయి. ఫ్లవర్ ఫేస్ ప్యాక్స్.. చర్మాన్ని స్మూత్ గా, ఎలాస్టిసిటీగా ఉంచుతాయి. అలాగే పూల ఫేస్ ప్యాక్స్.. చర్మాన్ని గ్లోయింగ్ గా మార్చడమే కాకుండా.. మచ్చలు, గాయాలు, మొటిమలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

Luxury Flower Face Packs You Can Make At Home

పూలల్లో విలువైన ఆయిల్స్, పోషణ అందించే గుణాలు ఉండటం వల్ల.. చర్మాన్ని స్మూత్ గా ఉంచుతాయి. ఫ్లవర్ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత.. చర్మాన్ని ఎండకు ఎక్స్ పోజ్ అవకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే.. చర్మానికి పూల ద్వారా.. పోషణ పూర్తీగా అందుతుంది. సూర్య కిరణాల వల్ల.. నెగటివ్ రియాక్షన్ ఏర్పడవచ్చు.

క్రీములు, మసాజ్ లు, ఫేస్ వాష్ లు వాడుతుంటారు. అనేక పండ్లు, పౌడర్లతో.. ముఖ వర్చస్సు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కొన్ని సందర్భాల్లో అనుకున్నంత ఫలితం పొందలేకపోవచ్చు. ఈ సారి కొత్తగా పూలతో ఫేస్ ప్యాక్ లను ప్రయత్నించి.. మీ ముఖానికి కొంగొత్త సొగసుని తీసుకురండి.

గులాబీ అందం

గులాబీ అందం

అనేక చర్మ ప్రయోజనాల కోసం గులాబీని ఉపయోగిస్తాం. అద్భుతమైన గ్లోయింగ్ పొందడానికి రోజ్ వాటర్ చాలామంది ఉపయోగిస్తారు. కొన్ని గులాబీ రెక్కలను, పాలను కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే.. గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

బంతిపూలు సౌందర్యం

బంతిపూలు సౌందర్యం

నిర్జీవమైన చర్మాన్ని నివారించడానికి బంతిపూలు సహాయపడతాయి. బంతిపూలు, పెరుగు, తురిమిన క్యారట్ ని కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించుకుంటే.. నిర్జీవమైన చర్మాన్ని గ్లోయింగ్ గా మార్చవచ్చు.

మల్లెపూల సొగసు

మల్లెపూల సొగసు

చాలా డ్రై స్కిన్ తో బాధపడేవాళ్లకు మల్లెపూల ప్యాక్ చక్కటి పరిష్కారం. కొన్ని మల్లెపూలను ఉడికించాలి. ఇది డ్రై స్కిన్ ని నివారించి.. స్మూత్ గా మారుస్తుంది.

మందారం

మందారం

మొటిమలు, మచ్చలు రావడానికి అవకాశం ఉన్న వాళ్లకు మందారం ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మందారం రెక్కలను, రైస్ వాటర్ తో కలిపి.. పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుంటే.. మొటిమలు తగ్గిపోతాయి.

లావెండర్

లావెండర్

క్లియర్ స్కిన్ పొందాలంటే.. లావెండర్ రెక్కలను, ఓట్స్ ని కలిపి పౌడర్ చేసుకోవాలి. ఈ రెండింటినీ గోరువెచ్చని నీటితో కలిపి పట్టించుకుంటే.. చర్మం క్లియర్ గా మారుతుంది.

లిల్లీ

లిల్లీ

లిల్లీ పూల రెక్కలను, తేనెతో కలిపి ముఖానికి పట్టిస్తే.. చర్మానికి మాయిశ్చరైజర్ అంది.. సాఫ్ట్ గా కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా అప్లై చేయండి.

సన్ ఫ్లవర్

సన్ ఫ్లవర్

నిమ్మరసం, పంచదార, సన్ ఫ్లవర్ పెటల్స్ ని కలిపి.. ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని బ్రైట్ గా మారుస్తుంది.

English summary

Luxury Flower Face Packs You Can Make At Home

Luxury Flower Face Packs You Can Make At Home. Flowers are not just pretty gifts, they can be used on your face as well.
Desktop Bottom Promotion