For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షకాలంలో చర్మ సంరక్షణకు సింపుల్ హోం రెమెడీస్

|

వాతావరణం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. కాలాన్ని బట్టి వాతావరణం కూడా మారుతూ ఉంటుంది. వాతావరణాన్ని బట్టి మన శరీరంలో, చర్మంలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. వేసవి వచ్చిందంటే చాలు శరీవేడి తాపానికి గురవుతుంది. వర్షాలకాలంలో చర్మం ఇన్ఫెక్షన్. చలికాలంలో చర్మం పొడిబారడం, రాషెష్, గీతలు పడటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి ఆయా కాలానికి అనుగుణంగా మన చర్మాన్ని రక్షించుకోవడం మన బాధ్యత.

తొలకరి జల్లులు... చర్మం మీద వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ కు తగిన విధంగా తలెత్తే ఇబ్బందులను తట్టుకోవడానికి ఒక సమగ్రమైన ఆల్ రౌండ్ స్కిన్ కేర్ రొటీన్ అవసరం మండే ఎండల నుండి వర్షాలు ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే... అదే సమయంలో చర్మ సంరక్షణ అనేది కూడా ఈ సీజన్‌లో అంతే ప్రధానం.

ఈ సీజన్ లో క్లీనింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌ వంటి వాటికి న్యూట్రోజెనా డీప్‌ క్లీన్‌ ఫేషియల్‌ ఆయిలీ స్కిన్‌ కైనా, డల్‌ స్కిన్‌ కైనా ఇవి నప్పుతాయి. చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మం కాంతి వంతంగా, మృదువుగా మారేలా చేస్తాయి. అంతే కాదు వీటితో పాటు మాన్ సూన్ లో పాటించాల్సిన మరికొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా...

చలికాలంలో శనగపిండిని వాడితే ప్రయోజనాలు:

చలికాలంలో శనగపిండిని వాడితే ప్రయోజనాలు:

ప్రధానంగా మన చర్మం పాడవ్వదు. సబ్బుల వాడకం, తద్వారా ఆయా పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే కాలుష్యం తగ్గిపోతాయి. పగిలిన చర్మ కోసం వాడే క్రీముల వంటి వాటి వాడకం తగ్గిపోతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటమే గాక డబ్బులు కూడా ఆదా అవుతాయి. పర్యావరణానికి అనుకూలంగా ఉండే శనగపిండితో స్నానం విధానాన్ని అసహ్యించుకోకూడదు. అలాగే చలికాలంలో దొరికే అన్ని రకాల పళ్లను, కాయగూరలను తినడం ద్వారా కూడా చర్మాన్ని చక్కగా ఉంచుకోవచ్చు మరి.

 తేనె, రోజ్‌ వాటర్‌,

తేనె, రోజ్‌ వాటర్‌,

మాస్క్ వేసుకునేటప్పుడు... పొడిచర్మం వారు తేనె, రోజ్‌ వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా... అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.

 పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌

పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌

పొడిచర్మం కలవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు.. పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ ను వేసి బాగా కలిపి కాటన్‌ తో చర్మంపై రుద్దుకోవాలి. మృదువైన చర్మం కలిగినవారైతే, ఆరెంజ్ జ్యూస్‌ లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇంకో పద్ధతిలో... పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 గంధం

గంధం

మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే... చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

తరచూ ఫేస్ వాష్:

తరచూ ఫేస్ వాష్:

చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి వర్షాకాలంలో చర్మాన్ని మూడు నాలుగు సార్లు శుభ్రం చేసుకోవాలి. సోపు కాకుండా ఫేస్ వాష్ లిక్విడ్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి . ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన .జిడ్డు, దుమ్ము, ధూళిని నిర్మూలిస్తుంది.

మాయిశ్చరైజ్

మాయిశ్చరైజ్

డ్రైస్కిన్ మాయిశ్చరైజ్ (తేమ)గా ఉంచాలి వర్షాకాలంలో మీ చర్మం మరీ పొడిబారినట్లు కనిబడుతుంటే, మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ తో పాటు, రోజ్ వాటర్, గ్లిజరిన్ లేదా బాదం ఆయిల్ మిక్స్ చేసి నిద్రించే ముందు అప్లై చేయాలి.

సన్ స్క్రీన్ తప్పనిసరి:

సన్ స్క్రీన్ తప్పనిసరి:

వర్షాలు, మోడం ఉండటం వల్ల, చర్మం కేవలం సూర్యుని నుండి మాత్రమే రక్షించడం కాదు, వర్షకాలంలో మేగం మద్యనుండి మన మీద పడే సూర్యుని యొక్క హానికరమైన యూవీ కిరణాల నుండి కూడా మన చర్మాన్ని రక్షించుకోవాలి. అందుకు సన్ స్క్రీన్ లోషన్ (యస్ పిఎప్)తప్పనిసరిగా అప్లై చేయాలి.

ఎక్సఫ్లోయేట్:

ఎక్సఫ్లోయేట్:

వర్షకాలంలో ప్రతి రోజూ డెడ్ స్కిన్ ను తొలగించాలి. అందుకు స్కిన్ స్ర్కబ్ ను ఉపయోగించి డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించి మీ చర్మం కాంతివంతంగా మరియు మెరుస్తుండేలా చేసుకోవాలి.

ఆహారం:

ఆహారం:

మంచినీళ్ళు ఎక్కువ తాగటం కూడా వర్షాకాలంలో చర్మాన్ని రక్షిస్తుంది. ఈ కాలంలో దాహం లేకపోవటం వలని నీళ్ళు తాగాలని ఉండదు, అందువల్ల శరీరానికి సరిపడా నీరు అందక, శరీర కణాలు వాటి రక్షణకి ఉన్నకొద్ది నీరు ఉపయోగించటం వల్ల చర్మానికి తేమ తగ్గి దురద ,చర్మ రంగులో మార్పులు గోచరిస్తాయి. అందువల్ల రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్ళు తప్పక తాగాలి. పళ్ళ రసాలు కూడా తీసుకోవటం మంచిది.

English summary

Monsoon skincare home remedies

Monsoon skincare home remedies, Here is a monsoon skincare routine for different skin types. Quick home remedies that you can help keep your skin healthy and glowing:
Story first published: Saturday, July 9, 2016, 17:18 [IST]
Desktop Bottom Promotion