For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెరిసే చర్మం పొందడానికి న్యాచురల్ ఫేస్ వాష్ ఇంగ్రిడియంట్స్

తెల్లగా మెరిసిపోయే చర్మం పొందాలంటే.. సరైన ఫేస్ వాష్ ముఖ్యం. చర్మాన్ని బ్రైట్ గా మార్చడానికి మొదటి స్టెప్ ఫేస్ వాష్ చేసుకోవడం. టోనర్స్, మేకప్ రిమూవర్స్ ఉపయోగించి.. చర్మంపై దుమ్ము, ధూళిని తొలగించుకుంటాం

By Swathi
|

తెల్లగా మెరిసిపోయే చర్మం పొందాలంటే.. సరైన ఫేస్ వాష్ ముఖ్యం. చర్మాన్ని బ్రైట్ గా మార్చడానికి మొదటి స్టెప్ ఫేస్ వాష్ చేసుకోవడం. టోనర్స్, మేకప్ రిమూవర్స్ ఉపయోగించి.. చర్మంపై దుమ్ము, ధూళిని తొలగించుకుంటాం. అయితే ఈ టోనర్స్, మేకప్స్ కేవలం దుమ్ము, ధూళిని మాత్రమే తొలగిస్తాయి. కానీ మొటిమలకు కారణమయ్యే వాటిని తొలగించలేవు.

కాబట్టి.. ఈ టోనర్స్ ని పక్కనపెట్టి.. కొన్ని న్యాచురల్ ఇంగ్రిడియంట్స్ ఉపయోగించి.. ఫేస్ వాష్ చేసుకోవడం మంచిది. న్యాచురల్ ఫేస్ వాష్ లు మెరిసే చర్మం పొందడానికి చాలా ఎఫెక్టివ్ గా ఉపయోగపడతాయి. మరి ఆ న్యాచురల్ ఇంగ్రిడియంట్స్ ఏంటో చూద్దాం..

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు

కొబ్బరినీళ్లు శరీరానికి, చర్మానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తుంది. కొబ్బరినీళ్లలో ముఖ్యమైన ప్రొటీన్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి.. ముఖాన్ని తాజా కొబ్బరినీళ్లతో శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టండి.. మెరిసే చర్మం పొందండి.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

రోజ్ వాటర్ న్యాచురల్ ఫేస్ వాష్. ఇది అద్భుతమైన లుక్ అందిస్తుంది. ముఖంపై ఇంప్యూరిటీస్ తొలగించడంలో.. రోజ్ వాటర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ మ్యాజికల్ వాటర్ డార్క్ స్పాట్స్ తొలగించి.. న్యాచురల్ బ్లష్ లా వర్క్ అవుతుంది.

రైస్ వాటర్

రైస్ వాటర్

తరచుగా యాక్నె, పెద్ద పెద్ద చర్మ రంధ్రాలు మీ చర్మంపై ఏర్పడి ఉంటే.. రోజూ అన్నం గంజితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టండి. రోజుకి రెండుసార్లు రైస్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. చర్మంలో ట్యాన్, మొటిమలు తొలగిపోతాయి.

చల్లటి నీళ్లు

చల్లటి నీళ్లు

చర్మాన్ని శుభ్రం చేసి.. రక్త ప్రసరణ మెరుగుపరిచే పదార్థాల్లో చల్లటి నీళ్లు ఒకటి. ఇది చర్మాన్ని ఎఫెక్టివ్ గా గ్లోయింగ్ గా మారుస్తుంది. రోజుకి మూడు సార్లు చల్లటినీళ్లతో శుభ్రం చేసుకుంటే.. మొటిమలు తొలగిపోయి.. చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.

దోసకాయ వాటర్

దోసకాయ వాటర్

దోసకాయలో చాలా బ్యూటి బెన్ఫిట్స్ దాగుంటాయి. ఇది చర్మాన్ని గ్లోయింగ్ గా మార్చడంలో సహాయపడుతుంది. కొన్ని ముక్కల దోసకాయల ముక్కలను కొన్ని నీటిలో కలపాలి. కాసేపు ఆ నీటిని వేడి చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ తీసి.. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సమ్మర్ లో ఇది ఎఫెక్టివ్ ఫలితాన్నిస్తుంది.

పుదీనా వాటర్

పుదీనా వాటర్

పుదీనా వాటర్ చర్మానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పుదీనా ఆకులను నీటిలో కలపి కాసేపు ఉడికించి.. వడకట్టాలి. తర్వాత చర్మాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే.. చర్మం స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుతుంది. మొటిమలు తొలగిపోతాయి.

English summary

Natural Ingredients To Wash Your Face For Brighter Complexion!

Natural Ingredients To Wash Your Face For Brighter Complexion! Listed here are natural ingredients you could use to wash your face with for a brighter and more fresher feel, check it out.
Story first published: Monday, November 14, 2016, 12:13 [IST]
Desktop Bottom Promotion