For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్ బ్రైట్ గా కనిపించాలంటే ఈ నేచురల్ రెమెడీస్ తో ఫేస్ వాష్ చేసుకోండి..!!

ఇప్పుడు ముఖం శుభ్ర పరుచుకోవడానికి ఈ టోనర్లను ఉపయోగించడానికి సమయం ఉంది, తక్షణమే ముఖం శుభ్రపడడానికి కొన్ని సహజ పదార్ధాలను ఎంచుకోండి. ఈ వివిధ రకాల సహజ ఫేస్ వాష్ లు మచ్చలేని చర్మాన్ని పొందడానికి అలాగే అద్

By Lekhaka
|

మీ ముఖం ప్రకాశిస్తూ, కాంతిహీనంగా లేని చర్మాన్ని సాధించడానికి కీలకమైన అడుగు మీ ముఖాన్ని సరైన రీతిలో శుభ్రపరచుకోవడం. మేమందరం ముఖం పై ఉన్న మలినాలను తొలగించడానికి టోనర్లు, మేకప్ రేమూవర్లను ఉపయోగించి విసుగెత్తి పోయాము. అయితే, ఈ టోనర్లు, మేకప్ రిమూవర్లు కొద్దిపాటి మలినాలను తొలగించడానికి మాత్రమే సహాయపడతాయి, మొటిమలు, యాక్నే అలాగే ఉంటాయి.

ఇప్పుడు ముఖం శుభ్ర పరుచుకోవడానికి ఈ టోనర్లను ఉపయోగించడానికి సమయం ఉంది, తక్షణమే ముఖం శుభ్రపడడానికి కొన్ని సహజ పదార్ధాలను ఎంచుకోండి. ఈ వివిధ రకాల సహజ ఫేస్ వాష్ లు మచ్చలేని చర్మాన్ని పొందడానికి అలాగే అద్భుతమైన ప్రభావాన్ని చూపడానికి సహాయపడతాయి.

అందువల్ల, మీ ముఖం శుభ్రపడడానికి సహజ పదార్ధాలు ఏవి, ఎంత మంచివో తెలుసుకోవడానికి కింద జాబితా ఇవ్వబడింది.


 కొబ్బరి నీళ్ళు

కొబ్బరి నీళ్ళు

కొబ్బరి నీళ్ళు అద్భుతమైన నీరు అని కూడా అంటారు, ఇది శరీరానికి అలాగే చర్మానికి కూడా చాలా సహాయపడుతుంది. కొబ్బరి నీళ్ళు అద్భుతమైన ప్రోటీన్లు, ఎలక్ట్రో లైట్స్ కలిగి ఉండడం వల్ల, అన్ని రకాల చర్మ సమస్యలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. తాజా కొబ్బరి నీళ్ళతో మీ ముఖాన్ని కడుక్కోవడం ప్రారంభించండి, దీనివల్ల మచ్చలేని చర్మం మీ సొంతమవుతుంది.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

రోజ్ వాటర్ సహజ ఫేస్ వాష్ రకాలలో ఉత్తమమైనది, దీన్ని ఉపయోగించడం వల్ల మీ ముఖం సహజ గులాబి రంగును పొందుతారు. ఇప్పటివరకు, ముఖంపై ఉన్న మలినాలను తొలగించడానికి కేవలం రోజ్ వాటర్ మాత్రమే శుద్ధమైనది. ఈ అద్భుతమైన నీరు ముఖంపై ఉన్న నల్లని మచ్చలను తొలగించడానికి, చర్మంపై ఉన్న సహజ మలినాలను తొలగించడానికి సహాయపడుతుంది.

 బియ్యం నీరు

బియ్యం నీరు

మీ ముఖంపై పెద్ద గుంటలు ఉండి, తరచుగా యక్నే కి గురవుతుంటే, ప్రతిరోజూ బియ్యం కడిగిన నీటిని వాడడం ప్రారంభించండి. బియ్యం నీటిలో వివిధ రకాల సహజ లక్షణాలు ఉండడం వల్ల, ఇది ఒక అద్భుతమైన ఫేస్ క్లెన్సర్ లాగా పనిచేస్తుంది. బియ్యం ఉడుకుతున్నపుడు, నీరు వార్చి, మీ ముఖాన్ని కడగండి. రోజుకు రెండుసార్లు ఈ నీటితో మీ ముఖాన్ని తుడుచుకోండి. ఈ అన్నం నీటిని ప్రతి రోజూ మీ చర్మంపై రాసినట్లైతే మీ చర్మం పై ఉన్న యాక్నే, టాన్ తొలగిపోతుంది. అలాగే ముఖంపై ఉన్న పెద్ద గుంతలపై కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

చల్లని నీరు

చల్లని నీరు

ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే వివిధ రకాల సహజ పదార్ధాలలో చల్లని నీరు కూడా ఉత్తమమైనదే, ఇది ముఖం పై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చల్లని నీరు ఉపయోగించడం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది, అంతేకాకుండా రంధ్రాల పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. చల్లని నీటితో మీ ముఖాన్ని రోజుకు మూడుసార్లు శుభ్రం చేసుకోండి. పొడి చర్మం, సున్నితమైన, యాక్నే తో బాధపడేవారు ప్రతిరోజూ చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

 కీరదోసకాయ నీరు

కీరదోసకాయ నీరు

కీరదోస వల్ల అనేక అందమైన ఉపయోగాలు ఉన్నాయని మనందరికీ తెలుసు, కీరదోస సాయంతో మచ్చలు లేని చర్మాన్ని పొందడం అందులో ఒకటి. ఒక ప్యాన్ లో కొన్ని కీరదోస ముక్కలను తీసుకుని, కొద్దిగా నీటిని కలపండి. ప్యాన్ కి మూతపెట్టి, కొద్దిసేపు ఆ నీటిని మరిగించండి. ఇప్పుడు, ఆ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి పొట్టు తీసేయండి. నీటిని వడకట్టి, ఆ నీటిని ప్రతిరోజూ మీ ముఖానికి అప్లై చేయండి. కీరదోస నీరు వేసవిలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

పుదీనా నీరు

పుదీనా నీరు

పుదీనా నీరు విశ్వవ్యాప్తమైన నీరు, దీనిని తాజాదనం కోసం డ్రింక్ గా ఉపయోగించవచ్చు, అందానికి వైద్యంగా కూడా ఉపయోగించవచ్చు. కొద్దిగా పుదీనా ఆకులను తీసుకుని, కొద్దిగా నీటిని కలపండి. ఇప్పుడు, నీటిని వేడిచేసి, పుదీనా ఆకులను తీసేయండి. పుదీనాలో చల్లదనాన్ని ఇచ్చే లక్షణం కలిగి ఉండడం వల్ల చర్మాన్ని మృదువుగా చేస్తుంది, అంతేకాకుండా ముఖ వర్చస్సును కూడా పెంచుతుంది.

తాజాగా కనిపించడానికి మీరు ప్రతిరోజూ ఉదయం పుదీనా నీటిని ఉపయోగించడం ప్రారంభించండి. ఇది మీ ముఖంపై ఉన్న యాక్నే ని కూడా తొలగించడానికి సహాయపడుతుంది.

English summary

Natural Ingredients To Wash Your Face For Brighter Complexion!

Proper washing of face is a crucial step to achieve glowing and flawless skin. We all are obsessed with using toners and makeup removers to remove impurities from the face. However, these toners and makeup removers can only help you to get rid of the impurities partially and remain unaffected over pimples and acne.
Desktop Bottom Promotion