For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యూటీ కిట్ లో కోకనట్ ఆయిల్ మిస్ చేస్తే...అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్ మీరు కోల్పోయినట్లే....

|

బ్యూటీ ప్రొడక్ట్స్ లో ప్రస్తుతం చెప్పలేనన్ని పదార్థాలు ఉన్నాయి. అందులో ఒకటి కొబ్బరి నూనె ముఖ్యమై బ్యూటీ ప్రొడక్ట్ . ఇది అన్ని రకాల బ్యూటీ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

కొబ్బరి నూనె కేవలం కేశాలకు మాత్రమే కాదు...చర్మం ప్రకాశవంతంగా, యంగ్ అండ్ బ్యూటిఫుల్ లుక్ తో కనబడేలా చేస్తుంది. కొబ్బరినూనెలోని అద్బుతమైన బ్యూటీ సీక్రెట్స్ ను మన బ్యూటీషియన్లు ఎప్పటికీ చెప్పరు . ఎందుకంటే కోకనట్ ఆయిల్ బ్యూటీ సీక్రెట్స్ తెలుసుకొన్నట్లైతే సలూన్స్, స్పాలకు పోయే అవసరం ఉండదు.

మన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వివిధ రకాల నేచురల్ పదార్థాలు మరియు బ్యూటీ ఆయిల్ ను ప్రకృతి మనకు ప్రసాధించినది. అయితే వాటిని బ్యూటీ కోసం మనం ఏవిధంగా ఉపయోగించుకోవాలన్న విషయం తెలుసుకోవాలి.

నూనెలన్నింటిలోకి కోకనట్ ఆయిల్ చాలా గ్రేట్ . ఎందుకంటే ఈ నూనెలో ఎసెన్షియల్ ఫ్యాట్ మరియు ఇతర పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంలోని ముడుతలను నివారించడం నుండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడం వరకు సహాయపడుతుంది. మరి బ్యూటీ విషయంలో కొబ్బరి నూనె ఏవిధంగా సహాయపడుతుందో తెలుసుకుందాం....

షుగర్ స్ర్కబ్:

షుగర్ స్ర్కబ్:

ఒక చెంచా కొబ్బరి నూనెలో ఒక చెంచా పంచదార వేసి మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిముషాలు మర్దన చేయాలి. ఇది అన్ని రకాల డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది.దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్మూత్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది.

సాల్ట్ స్క్రబ్:

సాల్ట్ స్క్రబ్:

మీ ముఖంలో మొటిమలున్నప్పుడు , అది ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతుంది . అందుకు పంచదారకు బదులు, సాల్ట్ ను మిక్స్ చేయాలి. కొబ్బరి నూనెకు సాల్ట్ మిక్స్ చేసి ముఖానికి పట్టించడం వల్ల ఇది యాంటీ ఇన్ఫెక్టివ్ స్ర్కబ్ గా పనిచేస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడానికి ఈ స్క్రబ్ చాలా అవసరం.

సోప్ బార్:

సోప్ బార్:

దీనికోసం : అరకప్పు కొబ్బరి నూనె, 1/4కప్పు బీవాక్స్, 1/4కప్పు షీ బట్టర్, కొన్ని చుక్కల బాదం ఆయిల్ తీసుకోవాలి.

సోప్ బార్ తయారుచేయడం:

సోప్ బార్ తయారుచేయడం:

కొబ్బరి నూనె, బీవ్యాక్స్ మరియు షీబట్టర్ ను బౌల్లో వేసి మీడియం మంట మీద వేడి చేసి అందులో బాదం ఆయిల్ మరియు ఎసెన్స్ వేయాలి. ఈ మిశ్రమాన్ని సోప్ బాక్స్ ల్లో వేయాలి. అది సెట్ అయ్యేవరకూ అలాగే ఉంచాలి. లేదా రిఫ్రిజరేటర్లో పెడితే మరింత త్వరగా తయారవుతుంది.

డ్రై అండ్ ఫ్లాకీ లిప్స్:

డ్రై అండ్ ఫ్లాకీ లిప్స్:

నిద్రించడానికి ముందు కొబ్బరి నూనెను పెదాలకు అప్లై చేయాలి. రాత్రికి రాత్రే పెదాలు సాఫ్ట్ గా ...తేమగా తయారవుతాయి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల పెదాలు పింక్ కలర్లో తేమగా మరియు ఉబ్బుగా ఉంటాయి.

టూత్ పేస్ట్:

టూత్ పేస్ట్:

కొబ్బరి నూనెను నేచురల్ టూత్ పేస్ట్ ల్లో కూడా తయారుచేస్తారు . ఇది కెమికల్ ఫ్రీ టూత్ పేస్ట్ . కొద్దిగా ఉప్పులో కోకనట్ ఆయిల్ వేసి దంతాల మీద రుద్దడం వల్ల దంతాలు, హెల్తీ, దంతక్షయం లేకుండా ....మెరుస్తుంటాయి.

డియోడరెంట్:

డియోడరెంట్:

కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ సోడా మరియు కొన్ని చుక్కల రోజ్ ఆయిల్ మిక్స్ చేసి, బహుమూలల్లో అప్లై చేయాలి . దీన్ని బాటిల్లో కూడా నిల్వచేసుకొని రోజూ ఉపయోగించుకోవచ్చు

సన్ స్క్రీన్:

సన్ స్క్రీన్:

కొబ్బరినూనెలో సన్ ప్రొటెక్షన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కోకనట్ ఆయిల్ సహజంగా ఉపయోగించుకొనే లోషన్ వంటిది. బయట వెళ్లడానికి ముందు కొబ్బరి నూనెను చేతులకు అప్లై చేయాలి.

షేవింగ్ క్రీమ్:

షేవింగ్ క్రీమ్:

కొబ్బరి నూనె, బేకింగ్ సోడ, తేనె మరియు కాస్టిల్ సోప్ ను మిక్స్ చేసి ముఖం లేదా బహుమూలల్లో లేదా కాళ్ళ మీద అప్లై చేసి షేవ్ చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి . దీనివల్ల స్కిన్ కట్ కాకుండా స్మూత్ గా ఉంటుంది.

తెల్లజుట్టును నివారిస్తుంది:

తెల్లజుట్టును నివారిస్తుంది:

కొబ్బరినూనెను మరియు నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే గ్రేహెయిర్ తొలగిపోతుంది .

English summary

Never Miss To Include Coconut Oil In Your Beauty Kit

Coconut oil is an important beauty ingredient that can be used to solve almost all the beauty issues. It is easily available and affordable. You must not only restrict coconut oil to the hair, but make use of it to make your skin glow, feel younger and beautiful.
Story first published: Saturday, February 6, 2016, 15:45 [IST]
Desktop Bottom Promotion