For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నొప్పి లేకుండా బ్లాక్ హెడ్స్ తొలగించే సింపుల్ హోం ట్రీట్మెంట్..

By Swathi
|

బ్లాక్ హెడ్స్..!! ఇతి ప్రతి అమ్మాయిని ఇబ్బందిపెట్టే సమస్య. ఒకసారి బ్లాక్ హెడ్స్ మొదలయ్యాయంటే... పూర్తీగా పోగొట్టుకోవడం చాలా కష్టం. అలాగే వీటిని తొలగించుకునేటప్పుడు చాలా నొప్పి కూడా బాధిస్తుంది. బ్లాక్ హెడ్స్ లోపలి భాగంలో హెయిర్ తోపాటు పెరుగుతూ బయటివైపు ప్రభావం చూపుతాయి.

ఈ సమస్య మీ చర్మంపై కనిపిస్తూ ఉంటే.. వీటిని వెంటనే తొలగించుకోవాలి. అయితే.. పార్లర్స్ కంటే.. ఇంట్లోనే హోం రెమిడీస్ ద్వారా వీటిని తొలగించుకుంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది. అది ఎలాంటి నొప్పి లేకుండా.. ఈజీగా రిమూవ్ చేసుకునే పద్ధతులు మీ చేతుల్లోనే ఉన్నాయి.

ముఖంలో నుదురు భాగం, ముక్కు, గడ్డం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బ్లాక్ హెడ్స్ వేధిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో కాస్త ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా వస్తాయి. అయితే ఈ పార్ట్స్ అన్నీ.. చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. దీంతో వీటిని తొలగించుకోవాలంటే.. చాలా నొప్పిగా ఉంటుంది. పెయిన్ లేకుండా.. సింపుల్ ట్రీట్మెంట్ హోం రెమిడీస్ తోనే సాధ్యం. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

బేకింగ్ సోడా మాస్క్

బేకింగ్ సోడా మాస్క్

బేకింగ్ సోడా బ్లాక్ హెడ్స్, యాక్నె తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 2టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను నీటిలో మిక్స్ చేసి.. బ్లాక్ హెడ్స్ పై రాసుకుని సున్నితంగా మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి.

ఓట్మీల్, పెరుగు

ఓట్మీల్, పెరుగు

2టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమంలో బాగా స్క్రబ్ చేసి.. 10 నిమిషాలు ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

తేనె, ఎగ్

తేనె, ఎగ్

ఎగ్ వైట్, తేనె రెండింటి మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పంచదార, తేనె

పంచదార, తేనె

2టేబుల్ స్పూన్ల పంచదార, కొద్దిగా తేనె కలిపి.. ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత పీల్ ఆఫ్ చేయాలి. దీనివల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. బ్లాక్ హెడ్స్ తేలికగా తొలగిపోతాయి.

దాల్చిన చెక్క, నిమ్మరసం

దాల్చిన చెక్క, నిమ్మరసం

దాల్చిన చెక్క, నిమ్మరసం పేస్ట్ ని బ్లాక్ హెడ్స్ ని తేలికగా తొలగిస్తాయి. 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి,2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, పసుపు కలిపి బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత.. శుభ్రం చేసుకుంటే.. బ్లాక్ హెడ్స్ తొలగిపోయి.. చర్మం నిగారింపుగా మారుతుంది.

నిమ్మ, పంచదార

నిమ్మ, పంచదార

కొద్దిగా నిమ్మరసం తీసుకుని, 1టేబుల్ స్పూన్ పంచదార కలపాలి. ఈ ప్యాక్ ని ముఖానికి అప్లై చేసి.. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది.. బ్లాక్ హెడ్స్ ని తేలికగా తొలగిస్తుంది.

తేనె, దాల్చిన చెక్క

తేనె, దాల్చిన చెక్క

అర టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి.. ముఖానికి అప్లై చేసి.. 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇవి బ్లాక్ హెడ్స్ ని తేలికగా తొలగిస్తాయి.

English summary

Proven, Natural Ways To Remove Blackheads

Proven, Natural Ways To Remove Blackheads. Blackheads may be a nightmare to many, but one should not be disappointed, as there are several ways how to get rid of it.
Desktop Bottom Promotion