For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో మీ చర్మాన్ని గ్లోయింగ్ గా మార్చే ఫేస్ ప్యాక్స్..!

చలికాలంలో ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా.. హెల్తీగా, గ్లోయింగ్ గా ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా.

By Swathi
|

చలికాలం అంటేనే.. చర్మం పొడిబారి, పగిలి, నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి చలికాలంలో చర్మం, శరీర సంరక్షణలో చాలా అలర్ట్ గా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. మీ చర్మం నిర్జీవంగా మారుతుంది.

Secret Winter Face Packs Hiding in Your Kitchen

చలికాలంలో చర్మానికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరిలోనూ చలికాలం.. చర్మాన్ని డ్రైగా మారుస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్లు కూడా.. చలికాలంలో డ్రై స్కిన్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే రకరకాల చర్మతత్వాలు కలిగిన వాళ్లు.. వాళ్లు చర్మాన్ని బట్టి చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

చలికాలంలో చర్మ సంరక్షణకు కాస్త ఓర్పు అవసరం. సమయం కేటాయించడం కూడా ముఖ్యం. కాబట్టి చలికాలంలో ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా.. హెల్తీగా, గ్లోయింగ్ గా ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా. కొన్ని ఫేస్ ప్యాక్ లను చలికాలంలో రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా హెల్తీ స్కిన్ పొందవచ్చు.

lemon and honey

నిమ్మ, తేనె
నిమ్మకాయను రెండుగా కట్ చేసి ఒక నిమ్మ చెక్క నుంచి రసం తీయాలి. అందులో రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో ముఖానికి రాసుకోవాలి. నిమ్మలో ఉండే విటమిన్‌ సి చర్మం పగలకుండా అడ్డుకుంటుంది. తేనెలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దురద, ఎలర్జీ వంటి సమస్యలను తగ్గిస్తాయి.

badam and milk

పాలు, బాదం
ఒక టేబుల్‌ స్పూన్‌ బాదం పౌడర్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల పచ్చిపాలను కలిపి మెత్తటి పేస్టు తయారుచేసుకోవాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. బాదంలో విటమిన్‌ ఈ పుష్కలంగా ఉంటుంది. పాలు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. ఈ ఫేస్‌మాస్క్‌ డ్రై స్కిన్ ని స్మూత్ గా మారుస్తుంది.

English summary

Secret Winter Face Packs Hiding in Your Kitchen

Secret Winter Face Packs Hiding in Your Kitchen. With some simple everyday ingredients from your kitchen, you can rustle up amazing face packs for glowing skin.
Story first published: Wednesday, December 7, 2016, 17:01 [IST]
Desktop Bottom Promotion