For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెన్స్ స్పెషల్: అబ్బాయిలు పాటించాల్సిన స్కిన్ కేర్ హ్యాబిట్స్

By Swathi
|

ఇండియన్ మెన్స్ చర్మ సంరక్షణపై అస్సలు శ్రద్ధ వహించరు. దీనివల్లే అబ్బాయిల్లో ఎక్కువ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడైతే.. మీరు మీ చర్మంపై కేర్ తీసుకుంటారో.. అప్పుడు మీ చర్మం హెల్తీగా, న్యాచురల్ గా, అందంగా కనిపించడం మొదలుపెడుతుంది.

పురుషుల మెరుగైన ఆరోగ్యానికి ఉత్తమ ఆహారాలు

మగవాళ్లు చర్మ సంరక్షణను నిర్లక్ష్యం చేయడం వల్ల నిర్జీవంగా, ముడతలు పడి అందవిహీనంగా మారుతుంది. కాబట్టి.. సింపుల్ గా ఉంటే కొన్ని స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అయితే.. మీరే స్టార్ లా మెరిసిపోతారు. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయినా.. ఈ హోం రెమిడీస్ తో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. పైగా.. ఫ్యూచర్ లో మీ చర్మం డ్యామేజ్ అవకుండా కాపాడతాయి.

పురుషుల్లో ఆయిల్ స్కిన్ నివారించే హోం మేడ్ ఫేస్ ప్యాక్స్

అన్ని రకాల చర్మ తత్వాలకు పనిచేస్తాయి. ఈ సింపుల్ టిప్స్ కేవలం ఇండియన్ మెన్స్ కి మాత్రమే. హోం రెమిడీస్ ద్వారానే మీ చర్మంలో అనేక మార్పులు తీసుకురావచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా.. చక్కగా ఇంట్లో ఉండే వస్తువులతోనే.. మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

నీళ్లు

నీళ్లు

మీ చర్మంలో అద్భుతమైన మార్పు నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల.. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే శరీరంలోని మలినాలు తొలగించి చర్మానికి కొత్త నిగారింపు తీసుకొస్తుంది.

ఫేస్ స్క్రబ్

ఫేస్ స్క్రబ్

కాలుష్యం కారణంగా మీ చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి.. న్యాచురల్ పదార్థాలతోనే చర్మంలో నిగారింపు తీసుకురావడానికి అబ్బాయిలు ప్రయత్నించాలి. అలోవెరాను ఫేస్ స్క్రబ్ లా ఉపయోగిస్తే.. చర్మంపై మచ్చలు, స్పాట్స్ తొలగిపోయి మంచి నిగారింపు తీసుకొస్తుంది. అయితే వారానికి మూడు సార్లు స్క్రబ్ చేయాలి.

సన్ స్క్రీన్

సన్ స్క్రీన్

మంచి ఎస్ పీ ఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం వల్ల సూర్య రశ్మికి చర్మం పాడవకుండా ఉంటుంది. స్కిన్ క్యాన్సర్ కి కూడా దూరంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

రోజుకి రెండుసార్లు ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా అవసరం. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. పగలు తక్కువ గాఢత కలిగినది.. రాత్రిపూట ఎక్కువ గాఢత కలిగిన మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది.

ఫ్రూట్స్, వెజ్జీస్

ఫ్రూట్స్, వెజ్జీస్

మీ చర్మం గ్లోయింగ్ గా కనిపించాలనుకుంటే.. మీ డైలీ డైట్ లో ఖచ్చితంగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల.. చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఉప్పు

ఉప్పు

ఇండియన్ మెన్ ఎక్కువ ఉప్పు, షుగర్ తీసుకుంటారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి.. ఉప్పు, పంచదార తక్కువగా ఉండేలా కేర్ తీసుకోండి.

యంగ్ లుక్

యంగ్ లుక్

చర్మం యంగ్ లుక్ తో కనిపించాలంటే.. మంచి అలవాట్లు ఫాలో అవ్వడం చాలా అవసరం. రోజుకి 7 గంటల నిద్రపోవడం వల్ల చర్మం ఫ్రెష్ గా కనిపిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చూశారుగా.. ఈ చిన్న చిన్న అలవాట్ల వల్ల మీ చర్మం.. అద్భుతమైన, అందాన్ని సొంతం చేసుకుంటుంది.

English summary

Skin Care Habits For The Indian Man

Skin Care Habits For The Indian Man. Indian men don't pay much attention to their skin which is why most of them have multiple problems.
Story first published:Wednesday, February 17, 2016, 16:54 [IST]
Desktop Bottom Promotion