For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ పొందడానికి సింపుల్ హోం రెమిడీస్..

By Swathi
|

చాలామంది డ్రై స్కిన్ అనేది సీజన్ తో సంబంధం లేకుండా వేధిస్తుంటుంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా.. అన్ని సీజన్స్ లో సమస్యలు తీసుకొస్తుంది. డ్రై స్కిన్ ఉంటే.. దురద, ఇన్ల్ఫమేషన్, ఇరిటేషన్ వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు.

డ్రై స్కిన్ సమస్య మరీ ఎక్కువైనప్పుడు ఎగ్జిమా, సోరియాసిస్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. పొడి చర్మాన్ని సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే.. చర్మం నిర్జీవంగా, అనారోగ్యంగా కనిపిస్తుంది. కాబట్టి డ్రై స్కిన్ ని సాఫ్ట్ గా మార్చే రెమిడీస్ మీ వంటింట్లోనే ఉన్నాయి. వాటిని ఒక్కసారి ప్రయత్నిస్తే.. మీ చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా మారుతుంది. ఈ తేడా గమనిస్తే.. మీరే ఆశ్చర్యపోతారు.

soft skin with lemon

నిమ్మరసం
నిమ్మలోని యాస్ట్రిజెంట్ గుణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఒకవేళ మచ్చలు ఉంటే అవి చర్మంలో కలిసిపోయేలా చేస్తుంది. సిట్రస్‌ అధికంగా కలిగిన నిమ్మలో క్లెన్సింగ్‌ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ని వేగంగా తొలగించి.. చర్మాన్ని సాఫ్ట్ గా మారుస్తుంది. కాబట్టి సగం నిమ్మకాయ రసం, తెల్ల సొన కలిపి ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

honey

తేనె
తేనెలోని ఔషధ గుణాలు.. చర్మానికి అమేజింగ్ లుక్ అందిస్తాయి. ముఖానికి, మెడకు తేనె రాసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ సింపుల్‌ రెమెడీ మీ చర్మాన్ని అందంగా మారుస్తుంది.

tomato

టొమాటొ
సహజసిద్ధమైన స్కిన్‌ టోనర్‌ లా టమోటా పనిచేస్తుంది. మొటిమలు, మచ్చలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. తాజా టమోటా గుజ్జుని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మీ చర్మం స్మూత్ గా మారుతుంది.

English summary

Smooth and Soft Skin with Simple Home Remedies

Smooth and Soft Skin with Simple Home Remedies.
Story first published:Thursday, September 29, 2016, 17:16 [IST]
Desktop Bottom Promotion