For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు చేయకూడని పొరపాట్లు..!

ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ల బాధలు వర్ణించలేం. క్రీముల రాసిన వెంటనే జిడ్డుకారడం, ముఖం కడిగిన మూడు నిమిషాల జిడ్డు తేలడం, బయటకు వెళ్లిన రెండు నిమిషాలకే జిడ్డు కనిపించడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి.

By Swathi
|

ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ల బాధలు వర్ణించలేం. క్రీముల రాసిన వెంటనే జిడ్డుకారడం, ముఖం కడిగిన మూడు నిమిషాల జిడ్డు తేలడం, బయటకు వెళ్లిన రెండు నిమిషాలకే జిడ్డు కనిపించడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. జిడ్డు చర్మానికి స్వస్తి చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.

Things Women With Oily Skin Should Never Do

ఏం చేసినా.. తాత్కాలికంగా ఫలితాలు కనిపించినా.. మళ్లీ షరామామూలే అవుతుంది. ఇలాంటి సమస్య మిమ్మల్ని కూడా ఇబ్బందిపెడుతోందా ? ఐతే డోంట్ వర్రీ.. పార్లర్ కి, క్రీములకు డబ్బు ఖర్చుపెట్టకుండా.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే చాలు... ఆయిల్ ఫ్రీ స్కిన్ మీ సొంతం చేసుకోవచ్చు.

face wash with hot water

ఫేస్ వాష్
జిడ్డు చర్మం ఉన్నవాళ్లు ముఖం కడుక్కున్న వెంటనే చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో ఎక్కువసార్లు ముఖం శుభ్రం చేసుకుంటూ ఉంటాయి. కానీ పదే పదే ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకుంటే చర్మం న్యాచురల్ ఆయిల్స్ ని కోల్పోతుంది. దీంతో నిర్జీవంగా మారుతుంది. కాబట్టి.. ప్రతిసారీ ఫేస్ వాష్ లు ఉపయోగించకూడదు.

వేడి నీళ్లు
ఫేస్ వాష్ కైనా, స్నానానికైనా చాలామంది వేడి వేడి నీటిని ఉపయోగిస్తారు. దీంతో చర్మ గ్రంథులు తెరుచుకుంటాయి. దీంతో దుమ్ము, ధూళి చేరి మరింత జిడ్డుగా మారుతాయి. కాబట్టి.. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వేడినీళ్లు కాకుండా.. గోరువెచ్చటి నీటిని ఉపయోగిస్తే.. మంచిది. జిడ్డు తగ్గడమే కాకుండా.. చర్మం టైట్ గా మారుతుంది.

moisturizer

మాయిశ్చరైజర్
జిడ్డుగా ఉన్న చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మరింత ఎక్కువ ఆయిలీగా మారుతుందని చాలామంది భావిస్తారు. కానీ ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు కంపల్సరీ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. దీనివల్ల ఎక్కువ ఆయిలీగా కనిపించదు. అయితే జిడ్డుని, తేమను బ్యాలెన్స్ చేసే మాయిశ్చరైజర్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది.

English summary

Things Women With Oily Skin Should Never Do

Things Women With Oily Skin Should Never Do. Here are 7 things to avoid when you have oily skin to keep it looking dewy and glowing, instead of shiny and slick.
Story first published: Wednesday, December 14, 2016, 16:40 [IST]
Desktop Bottom Promotion