For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిమ్మల్ని అందంగా, చర్మ రంగు తెల్లగా మార్చే బొప్పాయి ఫేస్ మాస్క్ ..

|

బొప్పాయి అందరికీ సుపరిచితమైన ఫ్రూట్. ఇందులో అనేక హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, స్కిన్ బ్యూటీ బెనిఫిట్స్ కూడా దాగున్నాయి . అంతే కాదు దీన్ని స్కిన్ లైటనింగ్ ఏజెంట్ గా కూడా సూచిస్తారు. బొప్పాయి చర్మాన్ని చాలా అందంగా తీర్చిదిద్దడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో నేచురల్ పవర్స్ దాగున్నాయి.

ఇందులో ఉండే విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ చర్మంలో కొన్ని అద్భుతాలను కలిగిస్తాయి . ఈ ఫ్రూట్ లో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ ఉండటం వల్ల ఇది చర్మానికి తగిన పోషణను అంధిస్తుంది.

బొప్పాయి ఒక యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. మరియు ఈ ఫ్రూట్ లో ుండే న్యూట్రీషియన్స్ , చర్మంలో ముడుతలను మరియు సన్నని లైన్స్ ను పోగొట్టుటలో గ్రేట్ గా పనిచేస్తుంది .

ఇంకా బొప్పాయి ఎక్స్ ఫ్లోయేట్ గా కూడా పనిచేస్తుంది. ఇది చర్మ రంగును మార్చుతుంది. ఇది చర్మాన్ని సాఫ్ట్ గా మరియు హైడ్రేషన్ తో ఉంచుతుంది. అందుకే ఈ బొప్పాయి ఫ్రూట్ ను చర్మ సౌందర్య సాధనాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు .

బొప్పాయితో పాటు మరికొన్ని ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల బ్యూటీ బెనిఫిట్స్ డబుల్ అవుతాయి . బొప్పాయిని, తేనె, పసుపు, నిమ్మరసం వంటి మొదలగు వాటితో కలిపి ఉపయోగించడం వల్ల ఎఫెక్టివ్ గా ప్రయోజనాలను పొందవచ్చు.

చర్మ రంగులో మెరుగైన ఫలితాలను చూడాలంటే బొప్పాయి ప్యాక్ ను వారానికొకసారి ఉపయోగించుకోవచ్చు. మంచి చర్మం రంగు పొందడానికి బొప్పాయి ప్యాక్స్ ను ఈ క్రింది విధంగా..

బొప్పాయి మరియు నిమ్మరసం:

బొప్పాయి మరియు నిమ్మరసం:

బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖం మొత్తం అప్లై చేయాలి. కొద్ది సేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వల్ల చర్మం రంగు మారడం మాత్రమే కాదు, చర్మంలో మంచి కాంతి రూపుదిద్దుకొంటుంది. స్కిన్ టోన్ లైట్ చేసి, స్కార్ మార్క్స్ ను తగ్గిస్తుంది.

బొప్పాయి మరియు టమోటో:

బొప్పాయి మరియు టమోటో:

ఈ మాస్క్ స్కిన్ టోన్ మార్చుతుంది మరియు డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది . బొప్పాయి జ్యూస్ ను టమోటో జ్యూస్ తో మిక్స్ చేసి ముఖం మొత్తం అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేయడం వల్ల గ్లోయింగ్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు.

బొప్పాయి మరియు అవొకాడో:

బొప్పాయి మరియు అవొకాడో:

బొప్పాయి గుజ్జులో అవొకాడో పేస్ట్ చేర్చి ముఖానికి అప్లై చేయాలి. దీన్ని అప్లైచేయడంవల్ల చర్మానికి తగిన పోషణను అందిస్తుంది. చర్మం తేమగా ఉంటుంది. దాంతో చర్మం చూడటానికి మంచిగా ఉంటుంది . బొప్పాయి, అవొకాడోను మిక్స్ లో వేసి బ్లెడ్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి కొద్ది సేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి మరియు బనానా:

బొప్పాయి మరియు బనానా:

బొప్పాయి మరియు అరటి పండు మరో ఎఫెక్టివ్ హోం రెమెడి. ఈ హోం రెమెడీ వల్ల అందమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు . బొప్పాయి, మరియు బనానాను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఈమిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి మరియు సాండిల్ వుడ్ పౌడర్:

బొప్పాయి మరియు సాండిల్ వుడ్ పౌడర్:

బొప్పాయిని, చందనంతో మిక్స్ చేసి ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ టాన్ తగ్గిస్తుంది. ఇది స్కిన్ లైట్ గా చేస్తుంది మరియు చర్మంలో కాంతిని తగ్గిస్తుంది . బొప్పాయిని చందనం పౌడర్ తో మిక్స్ చేయాలి . దీన్ని ముఖం మొత్తం అప్లై చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి మరియు తేనె:

బొప్పాయి మరియు తేనె:

ఈ కాంబినేషన్ ఫేస్ మాస్క్ చర్మానికి పోషణను అందిస్తుంది. మరియు నేచురల్ గ్లో అందిస్తుంది . ఇది పర్ఫెక్ట్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . మరియు ఇది డార్క్ స్పాట్స్ మరియు మచ్చలను నివారిస్తుంది . కొన్ని బొప్పాయి ముక్కలు తీసుకొని అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి మరియు వెనిగర్:

బొప్పాయి మరియు వెనిగర్:

పచ్చిబొప్పాయి చెక్కు తీసి చిన్న ముక్కను తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో నాలుగు చుక్కల వెనిగర్, కొద్దిగా నీళ్లు కలిపి ముఖానికి మర్దన చేసుకొని కడిగేస్తే చర్మం శుభ్రపడుతుంది. ఇది చక్కని క్లెన్సర్ లా పనిచేస్తుంది.

బొప్పాయి, యాపిల్

బొప్పాయి, యాపిల్

బొప్పాయి, యాపిల్ పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి, వేప, ముల్తాన్ మట్టి,

బొప్పాయి, వేప, ముల్తాన్ మట్టి,

జిడ్డు చర్మం వాళ్లు.. బొప్పాయి, వేప, ముల్తాన్ మట్టి, కచ్చుర్ సుగంధీ పౌడర్‌ను రోజువాటర్‌తో మిక్స్ చేసి ముఖానికి అపె్లై చేయాలి. 20నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు తగ్గడమే కాదు, మొటిమలు తగ్గుతాయి.

బొప్పాయి

బొప్పాయి

కొంత మందికి చర్మం గరుకుగా ఉంటుంది. ఇటువంటి వారి చర్మాన్ని కూడా మృదువుగా మార్చ గల గుణం బొప్పాయిలో ఉంది. బొప్పాయి తొక్కను తీసి ఓ గిన్నెలో వేసి ఉడికించి దానిని మెత్తగా నూరి ముఖానికి రాసి పదిహేను నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా ముఖం కోమలత్వాన్ని సంతరించుకుంటుంది.

English summary

Tip To Use Papaya For A Flawless Skin

Papaya is a wonder fruit that has numerous benefits for the skin. It is referred to as a skin-lightening agent. Papaya has the ability to make the skin look fabulous by its natural powers.
Desktop Bottom Promotion