For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీరా జ్యూస్ లో దాగున్న అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్..!!

By Swathi
|

దోసకాయలో విటమిన్ సి, కేతోపాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే.. వీటిని డైట్ లో చేర్చుకోవాలి అని చెబుతుంటారు. కీరాలో కెరోటిన్, మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. కీరా మాత్రమే కాదు.. దాని తొక్కలో కూడా డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాన్ట్సిపేషన్ సమస్యతో బాధపడేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం.

దోసకాయను సలాడ్స్, వంటకాల్లో ఉపయోగిస్తారు. ప్రతి రోజూ వీటిని డైట్ లో చేర్చుకుంటూ ఉంటాం. అయితే.. కీరా.. అనేక చర్మ, జుట్టు సమస్యలను నివారిస్తుందని తెలుసా ? నిజమే.. జీర్ణక్రియ వంటి సమస్యలే కాదు.. జుట్టు, చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను నివారిస్తుంది.

మరి కీరా జ్యూస్ లో దాగున్న అమేజింగ్ బ్యూటీ బెన్ఫిట్స్, కీరా జ్యూస్ ని అందానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. అలాగే.. ఇది ఖర్చు తక్కువ.. ఫలితాలు ఎక్కువ అందిస్తుంది..

తెల్లగా మారడానికి

తెల్లగా మారడానికి

కీరాను బ్లీచింగ్ లా ఉపయోగించడం వల్ల.. చర్మం తెల్లగా మారడానికి సహాయపడుతుంది. దీనికోసం కీరా జ్యూస్ లేదా కీరా ముక్క తీసుకుని.. ముఖంపై రుద్దుకోవచ్చు. ఇది చాలా మైల్డ్ గా ఉంటుంది కాబట్టి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావు.

మొటిమలు, మచ్చలు

మొటిమలు, మచ్చలు

మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు నివారించడంలో కీరా అద్భుతంగా పనిచేస్తుంది. కీరా రసంలో కాటన్ ముంచి.. మచ్చలపై రాసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయడం వల్ల.. ఈ మచ్చలు నెమ్మదిగా తగ్గిపోతాయి.

టోనింగ్

టోనింగ్

చాలా టోనర్ ప్రొడక్ట్స్ దోసకాయ ఉంటుంది. మరి.. అలాంటప్పుడు డైరెక్ట్ గా వీటిని ఎందుకు ఉపయోగించకూడదు. కుకుంబర్ జ్యూస్ ని డైరెక్ట్ గా ముఖానికి పట్టించడం వల్ల.. న్యాచురల్ టోనింగ్ ఇస్తుంది.

సన్ బర్న్

సన్ బర్న్

ఎండ వల్ల కమిలిన చర్మానికి దోసకాయ చాలా ఎఫెక్టివ్ ఫలితాలు అందిస్తుంది. కాటన్ బాల్ ని కీరా జ్యూస్ లో ముంచి అప్లై చేయవచ్చు.. లేదా కీరా ముక్కలతో డైరెక్ట్ గా మసాజ్ చేయవచ్చు. ఈ చల్లటి నేచర్ కలిగిన దోసకా.. సన్ బర్న్ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు.. రెడ్ నెస్ ని తగ్గిస్తుంది.

ట్యాన్

ట్యాన్

మైల్డ్ యాస్ట్రింజెంట్ ఉండే.. దోసకాయలో బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి ట్యాన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి.. దోసకాయ రసంను డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేయాలి. ఇలా.. ప్రతిరోజూ ఎండకు తిరిగి వచ్చిన తర్వాత చేయాలి. కొన్ని రోజుల తర్వాత.. ట్యాన్ మాయమవతుుంది.

రెడ్ నెస్

రెడ్ నెస్

దోసకాయ గుజ్జు, పెరుగు కలిపిన మిశ్రమం ముఖానికి పట్టించడం వల్ల.. రెడ్ నెస్ ని ఎఫెక్టివ్ గా తగ్గించవచ్చు.

కళ్లు

కళ్లు

నిద్రలేవగానే కళ్లు నొప్పిగా, నిర్జీవంగా కనిపిస్తుంటే.. కుకుంబర్ చక్కటి పరిష్కారం. కొన్ని దోసకాయ ముక్కలను రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టి.. ఉదయం.. కళ్లపై పెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు కళ్లపై కీరా ముక్కలు పెట్టుకోవడం వల్ల.. అద్భుతమైన రిలాక్సేషన్ పొందవచ్చు.

కళ్ల కింద ముడతలు

కళ్ల కింద ముడతలు

కళ్ల కింద స్పష్టంగా కనిపించే ఏజింగ్ లక్షణాలను నివారించడంలో.. కీరా ఎఫెక్టివ్ రెమిడీ. చాలా మైల్డ్ గా ఉండే కీరా.. ఫలితాలను మాత్రం ఎఫెక్టివ్ గా ఇస్తుంది. దోసకాయ జ్యూస్ ని కళ్లకింద అప్లై చేసి.. పూర్తీగా ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.

ఆయిలీ స్కిన్

ఆయిలీ స్కిన్

మీరు ఆయిలీ స్కిన్ తో బాధపడుతుంటే.. కొన్ని దోసకాయ ముక్కలు తీసుకుని బాగా ముఖంపై మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల ఆయిలీ నెస్ తగ్గిపోతుంది.

సెల్యులైట్

సెల్యులైట్

దోసకాయ రసం, కాఫీ, తేనె అన్నింటినీ.. బాగా మిక్స్ చేసి.. న్యాచురల్ స్క్రబ్ లా ఉపయోగించాలి. వారానికి రెండుసార్లు స్నానానికి ముందు స్క్రబ్ చేయడం వల్ల.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

English summary

Top 10 Beauty Benefits Of Cucumber Juice

Top 10 Beauty Benefits Of Cucumber Juice. Did you know that a cucumber can also sort out most of your beauty problems? Yes, along with being a great aid to digestion, it can help solve many beauty-related problems of the skin and hair.
Story first published: Wednesday, August 24, 2016, 10:17 [IST]
Desktop Bottom Promotion