For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రకాల చర్మ సమస్యలను నివారించే టాప్ 10 బెస్ట్ ఫుడ్స్

|

మీరు చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? మీ చర్మం మరీ డ్రైగా మరియు రఫ్ గా మరీ ఆయిల్ గా ఉన్నదా? చర్మ సమస్యల వల్ల వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . అంతే కాదు, ఈసమస్యల వల్ల మనలో నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి . మరి అలా జరగకుండా మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ..చర్మ సమస్యల నుండి ఎలా బయటపడాలి అని తెలుసుకోవాలి.

అందుకు ఏరకమైన స్కిన్ ప్రాబ్లెమ్స్ అయినా,కొన్ని రకాల ఆహారాల తోటి నివారించుకోవచ్చు . మరి మీరు ఎలాంటి చర్మ సమస్య ఉన్నా..ఈ క్రింది ఆహారాలను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.

బ్లూబెర్రీస్:

బ్లూబెర్రీస్:

బ్లూ బెర్రీస్ లో విటమిన్ సి, పవర్ ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి తినడానికి రుచికరంగానే కాదు, మీరు అసౌకర్యాన్ని కలిగించే చర్మ సమస్యల నుండి పిగ్మెంటేషన్ వరకూ అన్ని రకాల సమస్యలను నివారించుకోవచ్చు . ఈ యాంటీ యాక్సిడెంట్స్ డ్యామేజ్ స్కిన్ ను మరియు ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది . ఇంకా వీటితో పాటు, గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్స్, రెడ్ వైన్ తీసుకోవచ్చు.

 ఫ్యాటీ ఫిష్ :

ఫ్యాటీ ఫిష్ :

ఫ్యాటీ ఫిష్ సాల్మన్, సారిడెన్స్ చర్మ ఆరోగ్యానికి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉండటం వల్ల ఇవి, మన చర్మానికి అవసరం అయ్యే సరైన ఆయిల్స్ ను అందిస్తాయి . అంతే కాదు ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగించి ఆయిల్ స్కిన్ నివాిరస్తుంది. కాబట్టి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫ్యాట్ కూడా మన శరీరానికి అందించి చర్మం మెరిసేలా చేస్తుంది.

ధాన్యాలు:

ధాన్యాలు:

వైట్ బ్రెడ్, పాస్తా వంటివి త్రుణ ధాన్యాలతో తయారుచేయడం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇవి ఇన్సులిన్ లెవల్స్ ను పెంచుతాయి . కాబట్టి హోల్ వైట్ మల్టీ గ్రెయిన్ బ్రెడ్ లేదా పౌడర్ ను రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవాలి . వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను నివారించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

వాటర్ :

వాటర్ :

చర్మం ఆరోగ్యంగా...అందంగా...హైడ్రేషన్ తో ఉండాలంటే రోజుకు సరిపడా నీరు త్రాగాలి. చర్మం తరచూ డ్రైగా మరియు డల్ గా మారుతుంటే తగినంత వాటర్ త్రాగడం వల్ల మరింత గ్లోయింగ్ చర్మాన్ని అందివ్వడానికి నీళ్ళు గ్రేట్ గా సహాయపడుతాయి . ఎనర్జీ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి .

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

చర్మ సమస్యలను నివారించడంలో గ్రీన్ టీ గ్రేట్. గ్రీన్ టీలో ఏజ్ ఫైటింగ్ మరియు ఫ్రీరాడికల్స్ నివారించే యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను మరియు పిగ్మెంటేషన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

పెరుగు:

పెరుగు:

పెరుగులో హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రోబయోటిక్ . ఇదిజీర్ణక్రియను మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు ఇతర స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ ను నివారిస్తుంది . మంచి చర్మ సౌందర్యానికి మరియు హెల్తీ స్కిన్ పొందడానికి పెరుగు చాలా బెస్ట్.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

ఆరోగ్యకరమైన చర్మానికి విటమిన్ ఎ గ్రేట్ గా సహాయపడుతుంది. స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది . ఇది ముడుతలను మరియు ఏజింగ్ ఎఫెక్ట్స్ ను నివారిస్తుంది. ఇది ముడుతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . కొన్ని రకాల క్రీములలో దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇది ముడుతలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ లో బ్రొకోలి ఒక హెల్తీ ఫుడ్. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ మరియు జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఇ గ్రేట్ గా సహాయపడుతుంది . విటమిన్ ఇ చర్మాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. బ్రొకోలీలో విటమిన్ ఎ మరియు సిలు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్, ఏజింగ్ సమస్యలను నివారిస్తాయి.

అవొకాడో:

అవొకాడో:

అవొకాడోలో హెల్తీ ఫ్యాట్స్ మరియు న్యూట్రీషియన్స్, విటమిన్స్, మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల స్కిన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది పిగ్మెంటేషన్ నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. అందుకే దీన్ని వివిధ రకాల ఫేస్ మాస్క్ లలో ఉపయోగిస్తుంటారు. మొటమలు, చర్మ రంద్రాలను శుభ్ర పరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 విటమిన్ డి:

విటమిన్ డి:

శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఇది డైట్ నుండి మన శరీరానికి చేరదు. కానీ, సూర్య రశ్మి నుండి కొంత పొందవచ్చు. విటమిన్ డి సరిపడా ఉన్నట్లైతే ఇది ఏజింగ్ లైన్స్ మరియు ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. విటమిన్ సప్లిమెంట్ ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చు.

English summary

Top 10 Best Foods To Treat Skin Problems

Having skin problems? Is it too dry, too rough or just too oily? Skin problems can lead to many issues; they can even result in loss of confidence and self-esteem.
Story first published: Saturday, February 20, 2016, 11:23 [IST]
Desktop Bottom Promotion