For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోళ్ళు చుట్టూ బాధకరమైన క్యూటికల్స్ నొప్పిని తగ్గించే 10 నేచురల్ రెమెడీస్ ..!

బట్టలు ఉతుకుతూ, అంట్లు తోముతూ నీళ్లలో ఎక్కువసేపు నానడం వల్ల కూడా గోళ్లు ఆరోగ్యంగా వుండవు. డ్రైస్కిన్, సన్ బర్న్, చలి, డ్రై వెదర్, అలర్జీలు, విటమిన్ డిఫిషెన్స్సీ క్యూటికల్స్ సమస్య ఏర్పడుతుంది. గోళ్లని

By Super Admin
|

సహజంగా ఎదుటి వారి దృష్టి వెంటనే ఆకర్షించే వాటిల్లో చేతి గోళ్లు ఒకటి. నాజూకైన చేతికి అందాన్ని ఇచ్చేది అందమైన గోళ్లే. అందుకే వాటి సంరక్షణను నిర్లక్ష్యం చేసుకోరాదు. గోళ్లని అందంగా, ఆరోగ్యంగా. ఉంచుకోవడానికి చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు.. అందమైన గోళ్లు సొంతమవుతాయి.

చేతి వేళ్ల చిగుళ్ల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిం చాలి. వాటి సంరక్షణకు యాయి శ్చరైజర్లను ఉపయోగించలి. గోళ్లలో బాక్టీరియా చేరకుండా క్యూటికల్స్‌ సంరక్షిస్తాయి. అందుకే వాటిని కత్తిరించకుండా క్యుటికల్‌ రిమూరవ్‌తో మృదువుగా ఉండేట్టు చూసుకోవాలి. కృత్రిమ గోళ్లు పెట్టుకునేట్టయితే మృదువైన ఆకారంలో ఉండే వాటినే వాడాలి. గోళ్లు గులాబీ రంగులో ఉంటే రక్తం తగిన స్థాయిలో వేళ్లకి సరఫరా అవుతున్నట్లు, ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అలా కాకుండా ఆకుపచ్చ రంగులో ఉంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని అర్థం. కొందరి గోళ్లు పాలిపోయినట్లు ఉంటాయి.

అతినీలలోహిత కిరణాల ప్రభావం, హెయిర్‌ డైస్‌ వాడకం వంటి వాటి వల్ల కూడా గోళ్లు పాలిపోయినట్లు అవుతాయి. గోళ్ల ఉపరితలంపై కొందరికి తెల్లమచ్చలు కనిపిస్తాయి. దీనికి కాల్షియం లోపం కారణమని అంటుంటారు. కాని గోడలాంటి గట్టి ఉపరితలానికి వేళ్లు గట్టిగా కొట్టుకున్నప్పుడు గోరుపై ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల పోషకాహార లోపం, ఐరన్‌ లోపం వల్ల గోళ్ల అంచులు చిట్లుతుంటాయి. చలికాలంలో గోళ్లు పొడిబారతాయి. బలహీనమై ఊడిపోతుంటాయి. ఇది చర్మానికి సంబంధించిన అనారోగ్యాన్ని సూచిస్తుంది.

బట్టలు ఉతుకుతూ, అంట్లు తోముతూ నీళ్లలో ఎక్కువసేపు నానడం వల్ల కూడా గోళ్లు ఆరోగ్యంగా వుండవు. డ్రైస్కిన్, సన్ బర్న్, చలి, డ్రై వెదర్, అలర్జీలు, విటమిన్ డిఫిషెన్స్సీ క్యూటికల్స్ సమస్య ఏర్పడుతుంది. గోళ్లని ఫ్యాషన్‌గా మలచుకునే విధానాలు ఎన్నో ఉన్నాయి. డయకోట్‌ ట్రీట్‌మెంట్‌ వీటిల్లో ఒకటి.ఇలా గోళ్ళ చుట్టూ గోళ్ళ చుట్టూ చర్మం తొలగిపోవడం, తాత్కాలికమే, కొన్ని రోజులకు అక్కడ కొత్త చర్మం ఏర్పడుతుంది. పగిలిపోయి, పాలిపోయినట్లు ఉన్న గోళ్ల ఆరోగ్యం కోసం రకరకాల కాస్మొటిక్‌ ఉత్పత్తులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అయితే వీటి కంటే నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

అలోవెర జెల్ ను చేతులకు , గోళ్ళకు, వేళ్ళకు అప్లై చేయడం వల్ల డ్రైగా మారిన, నొప్పి కలిగించే క్యూటికల్స్ ను నుండి ఉపశమనం కలిగిస్తుంది. గోళ్ళకు మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది . ఇతర ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

అరటి పండు:

అరటి పండు:

బాగా పండిని అరిపండు గుజ్జును క్యూటికల్స్ రాలిపోయిన వేళ్ళకు అప్లై చేయడం వల్ల ఇది చర్మానికి మాయిశ్చరైజింగ్ లక్షణాలనుఅ అందిస్తుంది. ఇందులో కొద్దిగా క్రీమ్, షుగర్, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి చేతులకు అప్లై చేయడం వల్ల క్యూటికల్స్ సమస్య తగ్గించుకోవచ్చు.

లెమన్ జ్యూస్ , తేనె:

లెమన్ జ్యూస్ , తేనె:

పీలింగ్ క్యూటికల్స్ నివారించుకోవడానికి లెమన్ జ్యూస్ లో తేనె మిక్స్ చేసి, చేతి వేళ్ళకు అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకుని, తర్వాత మాయివ్చరైజర్ అప్లై చేయాలి. ఆలివ్ ఆియల్ ను అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

ఫ్రెష్ గా ఉండే కీరదోసకాయను తురిమి, అందునుండి జ్యూస్ ను తీసుకోవాలి. ఈ జ్యూస్ ను క్యూటికల్స్ మీద అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా రిజల్ట్ వచ్చే వరకూ అనుసరించాలి. కీరదోసకాయ యాంటీ ఇన్ఫ్లమేటరీ , హీలింగ్ లక్షణాలున్నాయి. ఇది నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

మింట్ జ్యూస్ :

మింట్ జ్యూస్ :

పుదీనాను మెత్తగా పే్ట్ చేసి, అందులోని రసాన్ని గోళ్ళకు అప్లై చేయాలి. దీన్ని చేతి వేళ్ళకు అప్లై చేయాలి. ఇలా రాత్రుల్లో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా జ్యూస్ లో మెడిసినల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. పీలింగ్ ఫింగర్ టిప్ ను నివారిస్తుంది. స్కిన్ డ్రై నెస్ ను తగ్గిస్తుంది. ఎగ్జిమా మరియు ఇతర స్కిన్ ఆర్డర్స్ ను నివారిస్తుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి, అందులో మూడు చుక్కల ల్యావెండర్ ఆయిల్ ను మిక్స్ చేసి, గోరువెచ్చగా చేతులకు , వేళ్ళకు అప్లై చేయాలి. ఇది గ్రేట్ మాయిశ్చరైజర్ గా పినచేస్తుంది. గోళ్ళకు పోషణ అందుతుంది.విటమిన్ ఇక కూడా స్కిన్ హీలింగ్ ను ప్రోత్సహిస్తుంది.

ఓట్స్ :

ఓట్స్ :

ఒక కప్పు ఓట్స్ ను పొడి చేసి, గోరువెచ్చని నీటితో మిక్స్ చేసి, ఈ మిశ్రంలో చేతులను 10 నుండి 15 నిముషాలు ఉంచాలిజ తర్వాత చేతులను మంచి నీటితో కడిగి, తడిలేకుండా తుడిచుకోవాలి, తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఇది ఎఫెక్టివ్ గా డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది.

శాండిల్ వుడ్ పౌడర్ రోజ్ వాటర్:

శాండిల్ వుడ్ పౌడర్ రోజ్ వాటర్:

ఈ రెండు పదార్థాలను మిక్స్ చేయాలి. అవసరమైతే కొద్దిగా తేనె కూడా మిక్స్ చేసి, చేతి వేళ్ళకు గోళ్ళకు అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె చర్మానికి మాయిశ్చరై.జింగ్ గుణాలను అందిస్తుంది. చేతులను సాప్ట్ గా మార్చుతుంది. స్కిన్ సమస్యలను నివారించడానికి కొబ్బరి నూనె గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి . ఇవి చర్మంలోకి త్వరగా చొచ్చుకు పోయి క్యూటికల్స్ ను నివారిస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది,

పాలు:

పాలు:

పాలలో , తేనె మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి మాసాజ్ చేయాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది, క్యూటికల్ పీలింగ్స్ ను కూడా నివారిస్తుంది.

English summary

Treat Painful Peeling Cuticles Around Nails Naturally

Peeling cuticles is a common issue that is faced by many people at sometime or the other. As the skin around your nails is gentle and sensitive, proper care has to be taken in order to avoid the skin from peeling off.
Story first published: Wednesday, November 9, 2016, 23:12 [IST]
Desktop Bottom Promotion