For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 రోజుల్లో మొటిమలు నివారించే సింపుల్ ఫేస్ ప్యాక్..

By Swathi
|

పెళ్లి లేదా ఫంక్షన్ కి వెళ్లాలని చాలా అందమైన శారీనో, డ్రెస్ నో ఎంచుకున్నారు. అందంగా రెడీ అయిపోయారు. కానీ.. ముఖంపై మొటిమలు, మచ్చలు మాత్రం మీరు ఎంత అందంగా కనిపించినా.. ఎట్రాక్టివ్ గా లేకుండా చేస్తున్నాయి. ఆకర్షణను మొత్తం మొటిమలు పాడు చేస్తున్నాయి. అలాంటప్పుడు దిగులు పడకుండా.. సింపుల్ రెమిడీని ప్రయత్నించండి.

యాక్నే అనేది చాలా సాధారణంగా కనిపించే చర్మ సమస్య. పింపుల్స్ ముఖంపై ఏర్పడిన తర్వాత నివారించడం చాలా కష్టమవుతుంది. ఆకర్షణపై దుష్ర్పభావం చూపుతుంది. పింపుల్స్, మచ్చలు చర్మంపై ఉండటం వల్ల.. చాలా అసౌకర్యంగా ఉంటుంది. మిమ్మల్ని అన్ ఎట్రాక్టివ్ గా మార్చడమే కాకుండా.. అనారోగ్యాన్ని సూచిస్తుంది. ఇది మీరు సరిగా ఆహారం తీసుకోవడం లేదని, చర్మ సంరక్షణను సరిగా పట్టించుకోవడం లేదని తెలుపుతుంది.

Try This Simple Natural Face Pack To Reduce Acne In 5 Days

ఒకవేళ యాక్నేను నివారించకపోతే.. ఇది తర్వాత చాలా సమస్యగా మారుతుంది. వాటివల్ల ఏర్పడే మచ్చలు నివారించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి యాక్నే నివారించడానికి హోంమేడ్ ఫేస్ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. మరో మిరాకిల్ ఏంటో తెలుసా.. ఈ ఎఫెక్టివ్ హోం రెమిడీ.. 5 రోజుల్లో మొటిమలను నివారిస్తుంది.

ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
ఆనియన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్

Try This Simple Natural Face Pack To Reduce Acne In 5 Days

న్యాచురల్ గా మొటిమలు నివారించాలి అనుకుంటే.. ఆనియన్ జ్యూస్, ఆలివ్ ఆయిల్ చాలా గ్రేట్ గా సహాయపడతాయి. ఉల్లిరసంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మంలో ఉండే దుమ్ము, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని హెల్తీ, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

డార్క్ స్పాట్స్ ఆనియన్ జ్యూస్ నివారించి, చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మ కణాలను పోషణ అందించి, యాక్నేతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది. మరి ఈ సింపుల్ హోంమేడ్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా..

Try This Simple Natural Face Pack To Reduce Acne In 5 Days

తయారు చేసే విధానం
ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి, గ్రైండ్ చేసి.. రసం తీయాలి.
ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉల్లి రసానికి, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి.
రెండింటినీ బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి.
15 నిమిషాలు ఆరిన తర్వాత మైల్డ్ ఫేస్ వాష్ ఉపయోగించి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ ఫేస్ ప్యాక్ ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల.. మొటిమలు తగ్గిపోవడంతో పాటు, మచ్చలు కనిపించకుండా మాయమవుతాయి.
అలాగే చర్మం గ్లోయింగ్ గా మారి.. మిమ్మల్ని అందంగా మార్చేస్తుంది.

English summary

Try This Simple Natural Face Pack To Reduce Acne In 5 Days!

Try This Simple Natural Face Pack To Reduce Acne In 5 Days! If acne is left untreated for a long time, it can worsen and leave deep acne scars on your skin that are hard to get rid of!
Story first published:Friday, June 17, 2016, 15:34 [IST]
Desktop Bottom Promotion