For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15రోజుల్లో ముఖంలో మెరుపులు తీసుకొచ్చే కిచెన్ హెర్బ్స్

|

సహజ చర్మ సంరక్షణ అనేది అన్నింటి కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే అమ్మాయిలు ఎల్లప్పుడూ అద్భుతముగా మరియు ఇతరుల కంటే బిన్నంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్, ఇతర క్రీములను ఉపయోగించి ఉంటారు. వీటితో పాటు కొన్ని ఆయుర్వేధిక్ స్కిన్ హేర్బల్స్ కు మిస్ చేయకుండా చర్మ అందాన్ని, చర్మ ఆరోగ్యంతో పాటు, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. మన ప్రక్రుతిలో లభించే కొన్ని రకాల నేచురల్ పదార్థాలను మనం నిరక్ష్యం చేస్తుంటాము. వాటి విలువల తెలియనప్పుడు అలా నిర్లక్ష్యం చేస్తే తప్పు లేదు కానీ, వాటి విలుతు తెలుసుకొన్న తర్వాత వాటి మీరు ఎప్పటికీ విడిచి పెట్టరు .

ఉదాహరణకు మన ఇంటిలోగిళ్లలో ఉండే వేప, తులసి, కలబంద వంటవి. వీటిలో మనకు తెలియని ఆరోగ్య , సౌందర్య రహస్యాలెన్నో దాగిఉన్నాయి. ఇవే కాదు చర్మ సౌందర్యం కాపాడుకోవడంలో మరెన్నో కిచెన్ హెర్బ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి . ఈ కామన్ కిచెన్ హెర్బ్స్ ను లోకల్ మార్కెట్లో మీరు సులభంగా పొందుతారు. ఈ ప్లాంట్ ప్రొడక్ట్స్ వివిధ రకాలుగా మనకు ప్రయోజనాలను అందిస్తాయి. చర్మసౌందర్యాన్ని రెట్టింపు చేసి చర్మఅందాన్ని బయటకు తీసుకొస్తాయి.

ప్రకాశించే చర్మ సౌందర్యానికి హెర్బల్ చిట్కాలు: తెలుగు సౌందర్య చిట్కాలు

చర్మ సంరక్షణలో ఇవి పూర్తిగా ఉపయోగపడుతాయి. మన ఇంటి ఆవరణలో , మరియు మన వంటగదిలో నిత్యం ఉండే తాజా హెర్బ్స్, పుదీనా, తులసి, అలోవెర, జోజోబ, రోజ్మెర్రీ మరియు ల్యావెండర్ ఉంటాయి అదే విధంగా మరికొన్ని హెర్బ్ గురించి కూడా తెలుసుకుందాం..మరి బ్యూటీని పెంచే కిచెన్ హెర్బ్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

 పుదీనా:

పుదీనా:

పుదీనా సువాసనాభరిమతైన హెర్బ్ చర్మం మీద దురద కలిగించే సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. చర్మం మీద ఏర్పడ్డ డార్క్ స్పాట్స్ మరియు మెండి ఛారలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ హెర్బ్ లో ఉండే ఔషధగుణాలు చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. చర్మరంధ్రాలను శుభ్రపరుస్తుంది.పుదీనాలో ఉండే ఔషధ గుణాలు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. దాంతో చర్మం మెరుస్తుంటుంది

 తులసి:

తులసి:

తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. అదే విధంగా చర్మంలో దాగి ఉన్న మురికి, జిడ్డును తొలగిస్తుంది. తులసి ఆకులు చర్మ ఉపరితలంపై వచ్చే మొటిమలు మరియు డార్క్ వలయాల సమస్య చికిత్సలో ఒక కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాక ప్రత్యేక రక్తస్రావ నివారిణి లక్షణాలను కలిగి ఉంటుంది.

లికోరైస్ పౌడర్:

లికోరైస్ పౌడర్:

ఇది చర్మం స్మూత్ గా మార్చుతుంది మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మరియు ఇది అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది మరియు ముఖంలో మెటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది . లికోరైస్ పౌడర్ ను పేస్ట్ గా చేసి ముఖానికి అప్లై చేయాలి.

రోజ్మెర్రీ:

రోజ్మెర్రీ:

రోజ్మెర్రీ ఆయిల్ ను చర్మానికి అప్లై చేసినప్పుడు డల్ స్కిన్ నివారిస్తుంది మరియు మొటిమలను మాయం చేస్తుంది. ఇది జుట్టుకు కూడా ఉపయోగపడుతుంది . జుట్టును బలోపేతం చేస్తుంది. నిద్రించడానికి ముందు రోజ్మెర్రీ ఆయిల్ ను ముఖానికి అప్లై చేయాలి.

 సాసేజ్ లీవ్స్:

సాసేజ్ లీవ్స్:

సాసేజ్ లీవ్స్ ను పేస్ట్ లా చేసి, దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇది బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . ఇది మీ చర్మంను యంగ్ , క్లియర్ మరియు గ్లోయింగ్ స్కిన్ తో మార్చుతుంది . ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్లకంగా ఉండటం వల్ల ఏజింగ్ స్కిన్ నివారిస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్ :

యూకలిప్టస్ ఆయిల్ :

ఈ నూనె చర్మం యంగ్ గా కనబడేలా చేస్తుంది . చర్మం మీద దోమలు వాలకుండా రక్షణ కల్పిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు మొటిమలను నివారించి రేడియంట్ స్కిన్ అందిస్తుంది.

లెమన్ గ్రాస్ పౌడర్:

లెమన్ గ్రాస్ పౌడర్:

లెమన్ గ్రాస్ పౌడర్ నేచురల్ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగినది. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది . ఇది బెస్ట్ స్కిన్ టోనర్ గా మరియు సెన్సిటివ్ స్కిన్ కు క్లెన్సర్ గా పనిచేస్తుంది. దీనితో పాటు టెన్షన్ మరియు యాక్సైటిని తగ్గిస్తుంది.

జోజోబ

జోజోబ

జోజోబ లీవ్స్ ను పౌడర్ చేసి , ఈ పౌడర్లో అర చెంచా జోజోబా ఆయిల్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి , ఇన్ఫ్లమేషన్ మొటిమల మీద అప్లై చేయాలి . ఈ పేస్ట్ ను నేరుగా మొటిమల మీద అప్లై చేయాలి . డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకొని, తిరిగి ఇదే పద్దతిని అనుసరించండి. చర్మానికి మేలు చేసే ఒక మంచి మూలిక ఇది

అలోవెర

అలోవెర

చర్మ ఆరోగ్యానికి కలబంద ఒక బెస్ట్ హెర్బ్. అలోవరాను కట్ చేసి స్పూన్ తో జెల్ తీసి రాషెస్ మీద నేరుగా అప్లై చేయాలి . రాషెష్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి డ్రై ఆయిత్ తర్వాత శుభ్రం చేసుకోవాలి . దీన్ని ప్రతి రోజూ రెండు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మెంతి:

మెంతి:

చర్మ సౌందర్యానికి, కురుల పోషణకు మెంతి ఆకులను వాడతారు. వీటి ఆకులను మెత్తగా రుబ్బి, కురులకు పట్టిస్తే చుండ్రు సమస్య తీరుతుంది. జట్టు రాలడం తగ్గుతుంది.. మెంతి ఆకుల రసంలో కొంది పసుపు, నిమ్మరసం కలిపి ముఖానికి , మెడకు అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్ర పరచుకుంటే ముఖం కాంతి వంతంగా తయారవుతుంది.

వేప:

వేప:

కాంతి తగ్గిన చర్మానికి, మొటిమలు తేలిన ముఖానికి ఈ ఆకుల ముద్దను రాస్తే మంచి ఫలితం ఉంటుంది. వేప ముద్దను జుట్టు కుదుళ్లకు, కేశాలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. కురులు తళతళలాడతాయి.

 కొత్తమిర-

కొత్తమిర-

ఆహార పదార్థాల మీద అలంకరించుకోవడానికని భావిస్తే పొరబాటే. మనం తీసుకునే అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరల వంటకాల్లో విరివిగా వేసి తీసుకోవచ్చు. కొత్తిమీర నిండా విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. అంతేకాదు సమృద్ధిగా ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం, అలాగే కిమోథెరపీ(రసాయనాలతో చికిత్స చేయడం) వల్ల కలిగిన నష్టం తగ్గించడానికి ఇది పోరాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్త నాళాల్లో ఆటంకాలను తొలగించడంలోనూ కొత్తిమీర ఉపయోగపడుతుంది.

English summary

Use These Kitchen Herbs For Glowing And Radiant Skin In 15 days

You must not miss out the power of herbs in making your skin fair and glowing. These are the nature's bleeding for our skin which we normally ignore.
Story first published: Thursday, February 4, 2016, 11:45 [IST]
Desktop Bottom Promotion