For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్లోయింగ్ స్కిన్ కి.. హెల్తీ అండ్ టేస్టీ వెజిటబుల్ జ్యూస్

By Swathi
|

మనమందరం గ్లోయింగ్ స్కిన్ కావాలని కోరుకుంటాం. కానీ.. కొంతమంది స్కిన్ టోన్ కారణంగా కొంతమందికి నిర్జీవమైన చర్మం ఇబ్బందిపెడుతూ ఉంటుంది. అయితే కొంతమందికి ఎలాంటి కేర్ తీసుకోకపోయినా.. గ్లోయింగ్ స్కిన్ ఎట్రాక్టివ్ గా ఉంటుంది.

కొన్ని రకాల ప్రొడక్ట్స్, పదార్థాలు మంచి ఫలితాలనిస్తాయి. మరికొన్ని కొంత సమయానికే ఉపయోగపడతాయి. అయితే మరికొన్ని క్రీమ్స్, ఫేస్ మాస్క్ లు సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తాయి. కాబట్టి ప్రొడక్ట్స్ కంటే.. హెల్తీగా, హోమ్లీగా ఉండే.. హోం రెమిడీస్ ఫాలో అవడం మంచిది.

పురుషుల్లో బట్టతలను నివారించే సర్ ప్రైజింగ్ రెమెడీస్ ... పురుషుల్లో బట్టతలను నివారించే సర్ ప్రైజింగ్ రెమెడీస్ ...

బ్యాలెన్స్డ్ డైట్, ఫ్లూయిడ్ ఇంటేక్ సరైన మోతాదులో ఉంటే.. మీ చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఆహారాలు, మంచి పోషకవిలువలు, విటమిన్స్, ఎసెన్షియల్ మినరల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. చర్మం ఆరోగ్యంగా, నిగారిస్తూ ఉంటుంది.

చాలా రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉన్నాయి. వాటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అలాగే ఇవి జుట్టుకి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు.. ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం సహజంగానే ఆరోగ్యంగా, గ్లోయింగ్ గా మారుతుంది.

కాబట్టి డైలీ డైట్ లో టేస్టీ వెజిటబుల్ జ్యూస్ యాడ్ చేసుకోండి.. మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే.. హెల్తీ అండ్ టేస్టీ వెజిటబుల్ జ్యూస్ ట్రై చేయండి..

క్యారట్ జ్యూస్

క్యారట్ జ్యూస్

క్యారట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చర్మాన్ని నిగారింపు సంతరించుకునేలా చేస్తుంది. విటమిన్ ఏ, ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. అలాగే చర్మం రంగు మార్చడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఏజింగ్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది.

టమోటా జ్యూస్

టమోటా జ్యూస్

టొమాటో జ్యూస్ కేవలం గ్లోయింగ్ స్కిన్ ని మాత్రమే కాదు.. ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా దాగున్నాయి. ఇందులో లైకోపిన్ ఉంటుంది. కాబట్టి.. ఇది అన్ని రకాల క్యాన్సర్లతో పోరాడుతుంది. విటమిన్ సి చర్మ సౌందర్యానికి గ్రేట్ గా పనిచేస్తుంది.

బేబీ కార్న్ జ్యూస్

బేబీ కార్న్ జ్యూస్

గ్లోయింగ్ స్కిన్ పొందడానికి బేబీ కార్న్ జ్యూస్ అద్భుతమైనది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. గ్లోయింగ్ స్కిన్ పొందడం చాలా తేలికవుతుంది.

గ్రీన్ పీస్ జ్యూస్

గ్రీన్ పీస్ జ్యూస్

పచ్చి బఠాణీల్లో విటమిన్ బి6, విటమిన్ కే పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రోజూ వీటిని తీసుకోవడం వల్ల నిర్జీవమైన చర్మం కొత్త నిగారింపు సంతరించుకుంటుంది.

స్పినాచ్ జ్యూస్

స్పినాచ్ జ్యూస్

స్పినాచ్ లో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి అవడానికి ఐరన్ చాలా అవసరం. అలాగే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి.. గ్లోయింగ్ చర్మం పొందడానికి సహాయపడతాయి.

బ్రొకోలి జ్యూస్

బ్రొకోలి జ్యూస్

బ్రొకోలిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ కి సహాయపడుతుంది. అలాగే ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి.. మీరు నమ్మలేని అందమైన చర్మాన్ని పొందడానికి బ్రొకోలి జ్యూస్ తప్పకుండా తీసుకోండి.

English summary

Vegetable Juices For A Healthy And Glowing Skin

Vegetable Juices For A Healthy And Glowing Skin. All of us desire for a flawless and glowing skin. But, sadly, not all of us are blessed with a flawless skin tone, while some of them are naturally blessed with a glowing skin.
Story first published: Tuesday, March 8, 2016, 14:03 [IST]
Desktop Bottom Promotion