For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్ కి బొప్పాయి చేసే అద్భుతం

By Swathi
|

బొప్పాయి ఒక అద్భుతమైన పండుగా చెప్పవచ్చు. ఈ పండు తినడం వల్ల పొందే లాభాలు అద్భుతమైతే.. దీన్ని చర్మ సంరక్షణకు వాడితే.. పొందే లాభాలు మరింత అమోఘం. చర్మ సౌందర్యాన్ని, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి బొప్పాయి చాలా మంచి పరిష్కారమని అధ్యయనాలు చెబుతున్నాయి. చర్మానికి న్యాచురల్ లుక్ తీసుకువచ్చే సత్తా బొప్పాయిలో ఉంది.

బొప్పాయి ఆకులో మనకు తెలియని ఆరోగ్య రహస్యాలెన్నో..ఎన్నెన్నో...

బొప్పాయిలో ఉండే విటమిన్స్, పోషకాలు చర్మంపై మిరాకిల్ చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఉండటం వల్ల ఇవి చర్మానికి పోషణను అందిస్తాయి. అలాగే బొప్పాయి యాంటీ ఏజింగ్ ఏజెంట్ లా కూడా పనిచేస్తుంది. అంతేకాదు.. చర్మంపై ముడతలు, వయసు ఛాయలు రాకుండా నివారిస్తుంది.

బొప్పాయి సీడ్స్ మంచివే.. కానీ ? ఎక్కువైతే అనర్థమే

బొప్పాయిని ఒక వారంపాటు ఉపయోగిస్తే.. అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. ఇందులోకి పసుపు, తేనె, నిమ్మరసం వంటి పదార్థాలు మిక్స్ చేసి రాసుకోవడం వల్ల చర్మం సోయగం రెట్టింపు చేసుకోవచ్చు. బొప్పాయిని చర్మ సౌందర్యానికి ఉపయోగించే పద్ధతులను ఇప్పుడు చూద్దాం...

బొప్పాయి, నిమ్మ

బొప్పాయి, నిమ్మ

బొప్పాయిని గుజ్జులా తయారు చేసుకుని కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి అప్లై చేయాలి. కొంచెం ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే.. ముఖానికి న్యాచురల్ గ్లో వచ్చేస్తుంది.

బొప్పాయి, టమోటా

బొప్పాయి, టమోటా

పపాయ గుజ్జుకి, కొద్దిగా టమోటా రసం జతచేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మాస్క్ ని ముఖానికి అప్లై చేసి.. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మ కాంతి పెరగడమే కాదు, ముఖంపై డార్క్ స్పాట్స్ కూడా మాయమవుతాయి.

బొప్పాయి, అవకాడో

బొప్పాయి, అవకాడో

బొప్పాయిని అవకాడోతో కూడా ఉపయోగించవచ్చు. పపాయ గుజ్జుకి, కొంచెం అవకాడో పేస్ట్ కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ చర్మానికి పోషణను అందించి.. కొత్త నిగారింపు తీసుకొస్తుంది.

బొప్పాయి, బనానా

బొప్పాయి, బనానా

బొప్పాయి, అరటిపండు రెండింటిని బాగా మెత్తగా గుజ్జులా చేసి కొంచెం తేనె కలపాలి. ఈ మూడింటినీ బాగా మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేయాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే.. నిర్జీవమైన చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

బొప్పాయి, గంధం

బొప్పాయి, గంధం

బొప్పాయి గుజ్జుకి, గంధం పొడి కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే.. చర్మంపై ఉండే ట్యాన్ తొలగిపోయి స్కిన్ గ్లోయింగ్ గా మారుతుంది.

బొప్పాయి, తేనె

బొప్పాయి, తేనె

ఈ రెండింటి మిశ్రమం.. చర్మానికి మంచి పోషణణు ఇస్తుంది. అలాగే న్యాచురల్ గ్లో వస్తుంది. కొంచెం పపాయ గుజ్జుకి, టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మానికి సరైన మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

Story first published:Thursday, February 18, 2016, 10:21 [IST]
Desktop Bottom Promotion