For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ కలిపిన మిశ్రమం చర్మానికి చేసే అద్భుతం

By Swathi
|

మేకప్ లేకపోయినా, కాస్మొటిక్ సర్జరీలు లేకపోయినా, ఫోటో షాప్ తెలియకపోయినా.. ఒకప్పుడు లేడీస్ చాలా అందంగా, న్యాచురల్ గా కనిపించేవాళ్లు. వాళ్లు చాలా న్యాచురల్ గానే.. అద్భుతంగా కనిపించేలా జాగ్రత్త పడేవాళ్లు.

ఎక్కువగా హోం రెమిడీస్ పైనే ఆధారపడి.. చర్మ, జుట్టు సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేవాళ్లు. ముఖ్యంగా వంటింట్లో, గార్డెన్ లో లభించే బ్యూటీ రెమిడీస్ నే.. ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. చర్మం ప్రకాశవంతంగా ఉండేది.

కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ని మనం ఉపయోగిస్తున్నాం. వీటివల్ల.. ప్రస్తుతం మనం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి.. హోం రెమిడీస్ ద్వారా చర్మ సమస్యలను ఎఫెక్టివ్ గా నివారించడంతో పాటు.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ చర్మ సౌందర్యాన్ని చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఈ రెండింటినీ ఉపయోగించి.. ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి ఫలితాలు పొందుతామో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..
ఆల్మండ్ ఆయిల్ 2 టీస్పూన్లు
రోజ్ వాటర్ 2 టీస్పూన్లు

ఫేస్ ప్యాక్ తయారు చేసే విధానం
పైన చెప్పిన పరిమాణంలో రెండు పదార్థాలను ఒక గిన్నెలో మిక్స్ చేయాలి.
రెండింటినీ బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి.
15 నిమిషాలు ఆరిన తర్వాత.. గోరువెచ్చని నీటితో మైల్డ్ సోప్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

ముడతలు కనిపించకుండా

ముడతలు కనిపించకుండా

ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ రిచ్ గా ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల చర్మంలో ముడతలు, వయసు పెరుగుతున్న లక్షణాలు, ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ తగ్గుతాయి.

సాఫ్ట్ స్కిన్

సాఫ్ట్ స్కిన్

రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ రెండింటిలోనూ.. స్కిన్ హైడ్రేటింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాల్లో మాయిశ్చరైజర్ ని రీస్టోర్ చేస్తాయి. దీనివల్ల చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా మారుతుంది.

నల్లటి వలయాలు

నల్లటి వలయాలు

ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తాయి. కళ్ల కింద, నోటి చుట్టూ ఏర్పడే ఈ వలయాలను తగ్గించడమే కాకుండా.. చర్మ కణాలకు పోషణ అందిస్తుంది.

యాక్నె నివారించడానికి

యాక్నె నివారించడానికి

ఆయిల్ బేస్డ్ ఫేస్ ప్యాక్ యాక్నెని మరింత పెంచుతాయని భావిస్తారు. కానీ ఈ ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ మిశ్రమం రంధ్రాల్లో ఉండే బ్యాక్టీరియా, దుమ్ముని బయటకు పంపి.. యాక్నెను నివారిస్తాయి.

ర్యాషెస్ నివారించడానికి

ర్యాషెస్ నివారించడానికి

ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ కాంబినేషన్ దురద నివారించి.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. అలాగే.. చిన్న చిన్న గాయాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి.

మేకప్ రిమూవర్

మేకప్ రిమూవర్

ఈ రెండింటి మిశ్రమాన్ని మేకప్ తొలగించడానికి ఉపయోగించవచ్చు. ఇది చర్మానికి ఎలాంటి హాని చేయకుండా..మేకప్ తొలగిస్తుంది.

పెదాలకు

పెదాలకు

ఆల్మండ్ ఆయిల్, రోజ్ వాటర్ ని.. పెదాలకు పట్టించడం వల్ల.. వాటికి అందాల్సిన పోషణ అందుతుంది. అలాగే అవి సాఫ్ట్ గా, పింక్ కలర్ లో కనిపించడానికి సహాయపడుతుంది.

English summary

What Happens To Your Skin When You Apply Almond Oil & Rose Water?

What Happens To Your Skin When You Apply Almond Oil & Rose Water? Did you know that natural ingredients like almond oil and rose water can improve your skin in many ways?
Story first published:Wednesday, July 20, 2016, 14:07 [IST]
Desktop Bottom Promotion