For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన సౌత్ ఇండియన్స్ కోకనట్ ఆయిల్ ను స్కిన్ కు ఎందుకు అప్లై చేస్తారు..!!

కొబ్బరిని కేవలం వంటలకు మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ఉపయోగిస్తారంటే ఆశ్చర్యం కలగక తప్పదు. కొబ్బరేంటి, చర్మ అందాన్ని పెంచడం ఏంటి అనేగా మీ సందేహం...? అదేంటో తెలుసుకుందాం...!

|

మన ఇండియాలో కొబ్బరి, కొబ్బరి నూనె తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే పురాతన కాలం నుండి ఈ రెండూ వాడుకలో ఉన్నాయి. వంటలకు విరివిగా ఉపయోగిస్తుంటారు. ఫ్రెష్ గా ఉండే కొబ్బరి తురుము, కొబ్బరి పాలను వంటల్లో ఉపయోగించడం వల్ల మంచి రుచి ఉంటుంది.

కొబ్బరిని కేవలం వంటలకు మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా ఉపయోగిస్తారంటే ఆశ్చర్యం కలగక తప్పదు. కొబ్బరేంటి, చర్మ అందాన్ని పెంచడం ఏంటి అనేగా మీ సందేహం...? అదేంటో తెలుసుకుందాం...!

స్కిన్ ఎక్స్ పర్ట్స్, నేచురల్ బ్యూటీ ఎక్స పర్ట్స్ కొబ్బరి మీద అనేక పరిశోధనల జరిపిన తర్వాత ఇందులో దాగున్నమిరాకిల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు.

మొదటిది, కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి, ఇవి చర్మానికి మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తాయి. దాంతో చర్మం తేమగా, కాంతివంతంగా మకెరుస్తూ కనబడుతుంది.

Why South Indians Rub Coconut Oil On Their Skin?

రెండవది: కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్స్, క్యాప్రిక్ యాసిడ్స్ మరియు క్యాప్రిలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడు గుణాలు చర్మంలో దాగున్న డెడ్ స్కిన్ లేయర్స్ ను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. కొత్తగా చర్మ కణాల ఏర్పాటకు సహాయపడుతుంది. మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పించడానికి సహాయపడే స్కిన్ లేయర్ ను ఏర్పరుస్తుంది.

కొబ్బరి నూనెలో ఇంకా ఏమున్నాయి..? యాంటీఆక్సిడెంట్స్ కు పవర్ హౌస్ వంటిది, స్కిన్ లవింగ్ మినిరల్స్ కూడా ఎక్కువే, ఇవి చర్మంలోకి త్వరగా శోషింపబడి, బెటర్ స్కిన్ స్ట్రక్చర్ కు సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో అనేక బెనిఫిట్స్ దాగున్నాయి. అందుకే సౌంత్ ఇండియన్ ను బ్యూటీ సీక్రెట్స్ లో ఒక బాగంగా కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనెలో దాగున్న ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...!

బాడీ మసాజ్ :

బాడీ మసాజ్ :

రాత్రి నిద్రించడానికి ముందు, చేతిలోకి కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని, చేతులకు మర్దన చేసి, ముఖం, కాళ్ళు, చేతులుకు అప్లై చేసి మసాజ్ చేసుకుని పడుకోవాలి. ఉదయం నిద్రలేచి చూడండి మార్పు మీకు తెలుస్తుంది. స్కిన్ స్మూత్ గా , సపెల్ గా కనబడుతుంది. కోకనట్ ఆయిల్ ను రెగ్యులర్ గా చర్మానికి అప్లై చేస్తుంటే స్కిన్ పిగ్మెంటేషన్ సమస్య ఉండదు .

మొటిమలు మాయమవుతాయి:

మొటిమలు మాయమవుతాయి:

కొబ్బరి నూనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను డ్రై అవుట్ చేస్తుంది. ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో 5 చుక్కల ట్రీట్రీ ఆయిల్ మిక్స్ చేసి బాడీ మొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి. దీన్ని నిధానంగా మసాజ్ చేసి వదిలేయాలి, ఉదయం స్నానం చేస్తే సరిపోతుంది.

క్యూటికల్స్ నయం చేస్తుంది:

క్యూటికల్స్ నయం చేస్తుంది:

చిట్లిన, పీలింగ్ అయిన క్యూటికల్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తక్కువ మంట మీద వేడి చేసి గోరువెచ్చగా మారిన తర్వాత గోళ్ళకు అప్లై చేయాలి.చేతిలుకు గ్లౌజ్ వేసుకుని రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. తర్వాత ఉదయం చేతులు శుభ్రం చేసుకుంటే, నెయిల్స్ సూపర్ గ్లాసీగా కనబడుతాయి.

ఐ క్రీమ్ :

ఐ క్రీమ్ :

కొబ్బరి నూనె, బాదం ఆయిల్ రెండూ సమంగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల క్రింద నల్లటి వలయాలున్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది చాలా త్వరగా అబ్సార్బ్ అవుతుంది. కళ్ల ఉబ్బును తగ్గిస్తుంది. నల్లటి వలయాలు, ఫైన్ లైన్స్ ను నివారిస్తుంది. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ ను ప్రతి రోజూ నైట్ ఉపయోగించాలి.

బాడీ స్ర్కబ్ :

బాడీ స్ర్కబ్ :

ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకుని అందులో సీసాల్ట్ ఒక టేబుల్ స్పూన్ మిక్స్ చేయాలి. దీన్ని బాడీ మొత్తానికి అప్లై చేసి, స్క్రబ్ చేయాలి. 10 నిముషాల తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనెతో స్మూత్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు.

బాడీ బట్టర్ :

బాడీ బట్టర్ :

అరకప్పు షీబట్టర్ తీసుకుని,అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 10 డ్రాప్స్ జోజోబా ఆయిల్, 5 డ్రాప్స్ ల్యావెండర్ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిన తర్వాత గాలి చొరవడని డబ్బాలో స్టోర్ చేసి, అవసరమైనప్పుడు ఉపయోగించడం వల్ల చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుంది.

 డిటాక్స్ బాత్:

డిటాక్స్ బాత్:

అలసిన కండరాలు స్మూత్ గా, గాయాలను మాన్పడంలో, కండారలను రిలాక్స్ చేయడంలో డిటాక్స్ బాత్ సహాయపడుతుంది. అరకప్పు ఎప్సమ్ సాల్ట్ ను ఒక టీస్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేసి, సాన్నానికి దీన్ని ఉపయోగించాలి.

హెయిర్ట్ స్ట్రెగ్త్ మాస్క్:

హెయిర్ట్ స్ట్రెగ్త్ మాస్క్:

ఒక టేబుల్ స్పూన్ మెంతులను నీటిలో వేసి రాత్రంత నానబెట్టాలి, తర్వాత ఉదయం పేస్ట్ చేసి, అరకప్పు కొబ్బరి నూనె , 10 డ్రాప్స్ బాదం ఆయిల్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని తలకు అప్లై చేస్తే జుట్టును స్ట్రాంగ్ గా మారుతుంది. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

English summary

Why South Indians Rub Coconut Oil On Their Skin?

Southern parts of India have been well known for their love and preference for coconut. Not only is their curry generously sprinkled with coconut in all its variation, but also their skin regimen in one way or the other related to coconut.
Desktop Bottom Promotion