For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చిపాలతో మిల్కీ అండ్ సాప్ట్ స్కిన్ మీ సొంతం..

By Super Admin
|

ప్రతిరోజూ నిద్ర లేవగానే పాలతో తయారయ్యే టీనో, కాఫీనో, లేదంటే ఏకంగా పాలే తాగందే ఆ రోజు ఆరంభమవదు కొందరికి. పాలతో ఎముకకు బలం, వ్యాధి నిరోధక శక్తి వృద్ది చెందుతుంది. డీహైడ్రేషన్, ఊబకాయం, ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలకు పరిష్కారమూ లభిస్తుంది. వీటిలో ఇలాంటి ఔషధ గుణాలే కాదు, అందాన్ని ద్విగుణీకృతం చేసే మరెన్నో సుగుణాలు కలిసి ఉంటాయి.

పాలల్లో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. అయితే ఈ పాలు అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో కూడా అంతే శక్తివంతమైనవి అంటున్నారు సౌందర్య నిపుణులు. ఖరీదయిన సౌందర్య ఉత్పత్తులకు బదులుగా ఆవు పాలను వాడి చూడండి అద్భుతమైన మార్పు కనిపించడం ఖాయమంటున్నారు వాళ్లు. బహుశా ఈ సీక్రెట్‌ తెలిసే కాబోలు కొన్ని శతాబ్దాల క్రితమే ఈజిప్టు అందాల రాశి చర్మ సౌందర్యం కోసం పాలతో స్నానం చేసింది! పచ్చిపాలతో పొందే బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..


క్లెన్సర్‌:

క్లెన్సర్‌:

ముఖం మీది దుమ్ము, మేక్‌పలను తొలగించేందుకు క్లెన్సర్‌కి బదులుగా ఆవుపాలు వాడితే ఫలితం బాగుంటుంది. పచ్చి పాలలో దూదిని ముంచి ముఖం, మెడ మీద సున్నితంగా రుద్ది శుభ్రం చేయాలి. ఆ తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేస్తే తేడా మీకే తెలుస్తుంది.

మాయిశ్చరైజర్:

మాయిశ్చరైజర్:

పొడి చర్మం గల వాళ్లకి ఆవుపాలు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. లోషన్లు, మాయిశ్చరైజర్లు చర్మానికి పట్టించే బదులు అరటిపండు గుజ్జులో చల్లటి పచ్చి పాలను పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసుకుని అరగంట తరువాత కడుక్కోవాలి. రెండు రోజులు వరసగా ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది.

స్ర్కబ్:

స్ర్కబ్:

ఖరీదైన సౌందర్య సాధనాలను, ఆల్ఫా హైడ్రాక్సిల్‌ యాసిడ్‌ ఉన్న యాంటీ ఏజింగ్‌ క్రీమ్‌లు వాడే బదులు ఆవు పాలు వాడితే చాలు. ఎందుకంటే ఈ పాలల్లో కూడా ఆల్ఫా హైడ్రాక్సిల్‌ యాసిడ్‌ ఉంటుంది. పాలు, తేనె, సీసాల్ట్‌లను కలిపితే సహజసిద్ధమైన స్క్రబ్‌ సిద్ధం. వారానికి రెండు సార్లు ఈ స్క్రబ్‌తో మర్దనా చేస్తే మెరిసే చర్మం సొంతమవుతుంది.

యాంటీ ఏజింగ్ ఏజెంట్:

యాంటీ ఏజింగ్ ఏజెంట్:

పాలు రోజ్ వాటర్ చర్మాన్ని పాలతో శుభ్రపరచటం. ఇది చాలా సులభమైన పద్దతి. అందుకు చేయాల్సిందల్లా పాలలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కలిపి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత ముఖంను సర్కులర్ మోషన్ లో రెండు మూడు నిముషాలు మర్ధన చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి చర్మాన్ని శుభ్రం చేస్తుంది.

యాంటీ టానింగ్ ఏజెంట్ :

యాంటీ టానింగ్ ఏజెంట్ :

పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టాలి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజూ ఒక దూది పింజను తీసుకొని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు, పసుపు మిశ్రమం చర్మం నునుపుగా మార్చుతుంది.యాంటీ టానింగ్ ( నలుపు రంగును) దూరం చేస్తుంది.

ఓట్ మీల్ -మిల్క్ స్ర్కబ్:

ఓట్ మీల్ -మిల్క్ స్ర్కబ్:

ఇది స్ర్కబ్ మరియు క్లెన్సర్ రెండూ. మీకు టైం లేనప్పుడు ముఖాన్ని స్ర్కబ్ చేయాలనుకొంటే, ఈ పద్దతి చాలసులభం మరియు ఒక్క నిమిషంలో చాలు. ఓట్ మీల్ పౌడర్ తీసుకొని దానిక పాలు మిక్స్ చేసి, మెత్తని పేస్ట్ లా చేసి ముఖానకి అప్లై చేయాలి తర్వాత ముఖాని పట్టించి ఒక నిముషం పాటు బాగా మర్ధన చేస్తే చాలు, ముఖాన్ని శుభ్రం చేసి, చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

యాంటీ ఏన్స్ ఏజెంట్ :

యాంటీ ఏన్స్ ఏజెంట్ :

పాలు-తేనె క్లెన్సింగ్ : తేనెలో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల కొద్దిగా తేనె చర్మాన్ని శుభ్రం చేసి ముఖాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ఒక్క పాలను మాత్రమే అప్లే చేసేకంటే కొద్దిగా తేనె చేర్చి ముఖాన్నికి పట్టించి మసాజ్ చేయడం వల్ల ముఖంలో మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అందుకు కొద్దిగా నిమ్మరసం కూడా జోడించాలి.

పాలు పప్పాయ క్లెన్సర్:

పాలు పప్పాయ క్లెన్సర్:

పపాయలోని ఎంజైమ్స్ చర్మాన్ని ప్రకాశించేలా చేసి, డెడ్ స్కిన్ ను అతిసులభంగా తొలగిస్తుంది. మీరు, క్లెన్సింగ్ అప్లై చేయడానికి చాలా బద్దకంగా ఉన్నట్లైతే పపాయ ముక్కలను పాలలో ముంచి అలాగే ముఖానికి ఐదు నిముషాల పాటు మర్ధన చేయవచ్చు. దాంతో చర్మం ఫ్రెష్ గా మెరుస్తుంటుంది.

నేచురల్ సన్ స్క్రీన్ :

నేచురల్ సన్ స్క్రీన్ :

పచ్చిపాలను సౌందర్య సాధానంగా ఉపయోగిస్తే చర్మంలో ఫెయిర్ నెస్ పెరుగుతుంది. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది.

English summary

Wonderful Benefits Of Raw Milk On Your Skin

Boiled milk is considered safe for human consumption. But, are you aware of the fact that boiling dries many vital nutrients from milk? Boiled milk is not as rich in nutrients as the raw milk. We usually pamper our skin with natural ingredients because of the essential minerals they are composed of.
Desktop Bottom Promotion