For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలను పర్మనెంట్ గా నివారించే బేసిక్ అండ్ ఎఫెక్టివ్ ఆయుర్వేద చిట్కాలు..!!

రు రెగ్యులర్ బ్యూటీని మెరుగుపరుచుకోవడంలో సరైన హోం రెమెడీని ఎంపిక చేసుకోవడం మంచిది. దాంతో ఫలితం అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. మొటిమలు నివారించడంలో ఆ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

|

ప్రస్తుతం ఈ మోడ్రన్ యుగంలో ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు . ఇటువంటి సందర్భంలో చర్మంలో ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చర్మ సమస్యలను ఎఫెక్టివ్ గా నివారించే వాటిలో ఆయుర్వేదం ఒకటి.

పురాతన కాలం నుండీనే ఆయుర్వేదం బాగా పాపులర్ అయ్యింది. అనేక రకాల చర్మ సమస్యలను నివారించడంలో ఆయుర్వేదం గ్రేట్ గా సహాయపడుతుంది. అనేక రకాల చర్మ మరియు జుట్టు సమస్యలల్లో ఆయుర్వేద చిట్కాలను కూడా ఉపయోగించే వారు . చర్మ సమస్యలో బాగా చీకాకు కలిగించే సమస్య మొటిమలు. ప్రతి ఒక్క అమ్మాయికి వరెస్ట్ ఎనీమీ అంటే మొటమలే...

10 Ayurvedic Beauty Tips for Pimples

ఇది మొటిమలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఆయుర్వేదంలో కొన్ని బేసిక్ రెమెడీస్ ఉపయోగిస్తే చాలు ముఖం, శరీరంలో మొటిమలను నివారించ మంచి ఫలితాన్ని పొందుతారు . సెన్సిటివ్ చర్మం ఉన్నవారు ఈ ఎఫెక్టివ్ రెమెడీస్ ను వాడకపోవడమే మంచిది. మీరు రెగ్యులర్ బ్యూటీని మెరుగుపరుచుకోవడంలో సరైన హోం రెమెడీని ఎంపిక చేసుకోవడం మంచిది. దాంతో ఫలితం అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. మొటిమలు నివారించడంలో ఆ ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...మొటిమల సమస్యను పూర్తిగా నివారించుకుందాం..

తులసి పేస్ట్ :

తులసి పేస్ట్ :

మొటిమలను నివారించడంలో తులసి పేస్ట్ గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మొటిమలు పూర్తిగా నివారించబడుతాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని గోరువెచ్చని నీటిని మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మొటిమల మీద అప్లై చేసి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

తేనె మరియు నిమ్మరసం :

తేనె మరియు నిమ్మరసం :

మొటిమలను నివారించడంలో ఎఫెక్టివ్ హోం మేడ్ బ్యూటీ టిప్ తేనె మరియు నిమ్మరసం. ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. దీన్ని మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఎక్కువగా అప్లై చేయకపోవడం మంచిది. సెన్సిటివ్ చర్మం ఉన్న వారికి బర్నింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, 10 నిముషాలు అప్లై చేస్తే చాలు ఎఫెక్టివ్ రిజల్ట్ అందిస్తుంది.

దాల్చిన చెక్కపొడి, తేనె:

దాల్చిన చెక్కపొడి, తేనె:

దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె మిక్స్ చేసి పేస్ట్ చేసి మొటమిల మీద అప్లై చేయాలి. 15 నిముషా లరత్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

వేప ఆకులు :

వేప ఆకులు :

మొటిమలను నివారించడంలో వేపఆకు గ్రేట్ అని చెప్పవచ్చు. వేప ఆకులను తీసుకుని మొత్తగా పేస్ట్ చేసి, మొటిమల మీద అప్లై చేయాలి. తర్వాత పూర్గిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

నువ్వులు:

నువ్వులు:

నువ్వులను మెత్తగా పేస్ట్ చేసి, మొటిమల మీద అప్లై చేయాలి. దీన్ని మొటిమల మీద అప్లై చేసి, పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళదుంపను పేస్ట్ చేసి జ్యూస్ తీసుకోవచ్చు. లేదా స్లైస్ గా కట్ చేసి మొటిమల మీద అప్లై చేసి మర్ధన చేయాలి. ఈపొటాటో జ్యూస్ ను మొటిమల మీద పది నిముసాలు ఉంచితే చాలు ఇది నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.

పుదీనా:

పుదీనా:

ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులను మొత్తగా పేస్ట్ చేసి, మొటిమల మీద అప్లై చేయాలి. ఇందులో ఉండే కూలింగ్ లక్షణాలు చర్మం మీద ఉండే మొటిమల మీద ఆస్ట్రిజెంట్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది. మొండిగా మారిన మొటిమలను నివారిస్తుంది. మొటిమలను ష్రింక్ చేస్తుంది. వీటిని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ లా ఉపయోగపడుతుంది. మొటిమలను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది.

నట్ మగ్ :

నట్ మగ్ :

నట్ మగ్ గ్రేట్ స్పైసీగా ఉంటుంది. మొటిమల సమస్యలను నివారిస్తుంది. దీన్ని మెత్తగా పౌడర్ చేసి, అందులో నీళ్ళు జోడించాలి. మెత్తగా పేస్ట్ చేసి మొటిమల మీద అప్లై చేసి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

లవంగాలు :

లవంగాలు :

లంగాలను మెత్తగా పౌడర్ చేసి ఉపయోగించవచ్చు. దీని ప్లేస్ లో లవంగం నూనె కూడా ఉపయోగించవచ్చు. అయితే లవంగం నూనె చర్మానికి మంట కలిగిస్తుంది. కాబట్టి లవంగం పౌడర్ లో కొద్దిగా పాలు లేదా నీళ్ళు మిక్స్ చేసి, పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. మొటిమలు తొలగిపోతాయి,

పచ్చిబొప్పాయి:

పచ్చిబొప్పాయి:

మొటిమలను నివారించడంలో మరో గ్రేట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ బొప్పాయి. పచ్చిబొప్పాయిన కట్ చేసినప్పుడు బొప్పాయి తొక్క నుండి వచ్చే వైట్ మిల్క్ ను మొటిమల మీద అప్లై చేస్తే ఎఫెక్టివ్ గా తొలగిపోతుంది,

English summary

10 Ayurvedic Beauty Tips for Pimples

Here we are providing you with some of the most recommended basic ayurvedic home remedies for pimples:
Desktop Bottom Promotion