వేసవిలో హెల్తీ స్కిన్ కోసం చేయాల్సినవి.. చేయకూడనివి...

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాకిడి నుండి తప్పించుకోవడం ఎలా, శరీరాన్ని కాపాడుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. ఎండలో తిరక్కుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా, సెగలు కక్కుతున్న సూర్యుని తాపం మనమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడుతూనే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల రీత్యా కొందరికి బయట తిరగక తప్పదు. వీరి సంగతి చెప్పనవసరం లేదు. మరీ దుర్భరంగా ఉంటుంది.

ఒక్కో సీజన్లో ఒక్కో సమస్య ఉండనే ఉంటుంది. చలికాలంలో చర్మం పొడివారుతుంది. వాజిలిన్లు, కోల్డ్ క్రీములూ, మాయిశ్చరైజర్లు రాస్తున్నా చర్మం పగులుతూనే ఉంటుంది. ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు వేసవిలో నీటి శాతం తగ్గిపోయి, శరీరంలో కాంతి నశిస్తుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. నీటి శాతం తగ్గడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. ముఖంలో రింకిల్స్ అందవిహీనంగా ఉంటాయి. ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు కనిపిస్తుంది.

ఈ ఎండల నుండి బయట పడే మార్గం లేదా, మనల్ని మనం రక్షించుకునే అవకాశం లేదా అంటే, తప్పకుండా ఉంది. ఈ వేసవి కాలంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. సమ్మర్ బ్యూటీ కేర్ టిప్స్ తో ముఖ సౌందర్యం ఏమాత్రం పాడవకుండా చూసుకుందాం.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

రోజంతా చర్మం పై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది.

నీరు ఎక్కువగా త్రాగాలి:

నీరు ఎక్కువగా త్రాగాలి:

శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంటే అవసరం. నీళ్ళు ఎక్కువ పరిమాణంలో తాగేవారికి సర్వసాధారణంగా ఏ జబ్బులూ రావు. ఇది అతిశయోక్తి కాదు. వాటర్ థెరపీని మించినది మరొకటి లేదు. రోజుకు 16 గ్లాసుల నీళ్ళు తాగమని డాక్టర్లు పదేపదే చెప్తున్నారు. పుష్కలంగా నీరు తాగితే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. ఇక వేసవిలో అయితే, శరీరంలో ఉన్న నీరు ఇంకిపోతుంది కనుక, మరింత పరిమాణంలో నీరు సేవించాలి. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడంవల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. డీ-హైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు.

 ఎక్స్ఫ్లోయేట్ చేస్తుంది

ఎక్స్ఫ్లోయేట్ చేస్తుంది

వేసవిలో స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ముఖంలో ఎక్సెస్ ఆయిల్ తగ్గిస్తుంది. ముఖానికి స్ర్కబ్బర్ ను రోజూ ఉపయోగిస్తే స్కిన్ సెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది . కొత్త కణాలు ఏర్పడకుండా చేస్తుంది. వారంలో రెండు సార్లు ఎక్స్ ఫ్లోయేట్ చేస్తే కొత్త కణాలు ఏర్పడటకు తగిన సమయం ఉంటుంది.

హోం మేడ్ స్ర్కబ్ :

హోం మేడ్ స్ర్కబ్ :

హోం మేడ్ స్ర్కబ్ చౌకైనది 100శాతం ఆర్గానిక్. ఉప్పు, పంచదార రెండూ సమంగా మిక్స్ చేసి, అందులో ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి ముఖానికిఅ ప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కాళ్ళకు చేతులకు కూడా అప్ల్రై చేసి మర్ధన చేయాలి. స్నానానికి ముందు అప్లై చేయాలి.

సన్ స్క్రీన్

సన్ స్క్రీన్

ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్ర్కీన్ అప్లై చేయాలి. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు సన్ స్ర్కీన్ తప్పకుండా అప్లై చేయాలి. అలా చేయడం వల్ల ట్యాన్ లేకుండా ఉంటుంది.

చేయకూడనివి: ఒక రోజులో ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు:

చేయకూడనివి: ఒక రోజులో ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు:

వేసవిలో చెమటలని ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల స్కిన్ డ్రైగా మారడం మాత్రమే కాదు, చర్మానికి హాని కలిగిస్తుంది. ఎక్కువ వాటర్ తాగాలి.

చేయకూడనివి: సన్ స్క్రీన్ కానీ లేదా మాయిశ్చరైజర్ కానీ ఎక్కువగా ఉపయోగించకూడదు

చేయకూడనివి: సన్ స్క్రీన్ కానీ లేదా మాయిశ్చరైజర్ కానీ ఎక్కువగా ఉపయోగించకూడదు

వేసవిలో ఎక్కువ సన్ స్క్రీన్ కానీ, మాయిశ్చరైజర్ కానీ ఎక్కువగా అప్లై చేయకూడదు ..ఇలా చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లవు. ఇది బాడీ టెంపరేచర్ ను పెంచుతుంది. అసౌకర్యంగా అనిపిస్తుంది.

చేయకూడనివి: వేసవిలో ఫేస్ మసాజ్ చేయకూడదు:

చేయకూడనివి: వేసవిలో ఫేస్ మసాజ్ చేయకూడదు:

ఫేషియల్ మసాజ్ నెలకొకసారి చాలు, ఫేస్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి మరియు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. అయితే 10, 15 రోజులకొకసారి చేయడం వల్ల స్కిన్ ఇరిటేషన్ , ఎగ్జిమా , మొటిమలు పెరుగుతాయి.

చేయకూడనివి: డ్రింక్స్ వల్ల చర్మానికి పోషణ అందదు

చేయకూడనివి: డ్రింక్స్ వల్ల చర్మానికి పోషణ అందదు

బ్యూటీ డ్రింక్స్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండవు. వీటిని తాగడం వల్ల చర్మానికి పోషణ అందదు. అదే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం వల్ల అందులో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తాయి

చేయకూడనివి: లిప్ బామ్స్ ఉపయోగించకూడదు

చేయకూడనివి: లిప్ బామ్స్ ఉపయోగించకూడదు

వేసవిలో లిప్ బామ్స్ ను ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇంట్లోనే తయారుచేసుకోవాలి. తేనెను ఫ్రిజ్ లో పెట్టి., దీన్ని రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేస్తే మంచింది.

English summary

10 Dos & Don’ts For Healthy Summer Skin

10 Dos & Don’ts For Healthy Summer Skin,Have a healthy and gorgeous skin all through summer with these easy tips, check out to know more.
Story first published: Friday, May 19, 2017, 18:30 [IST]