స్కిన్ పిగ్మెంటేషన్ నివారించే 10 న్యాచురల్ రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

స్కిన్ పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారడం. కొందరికి ఎండలో తిరిగితే వెంటనే చర్మం నల్లబడటం జరుగుతుంటుంది. అంతే కాదు, వాతావరణంలో మార్పుల వల్ల, కాలుష్యం వల్ల కూడా స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది. చర్మం రంగు అంటే స్వతహాగా చర్మం రంగు మారి దీని వలన అసమానమైన చర్మపు రంగుకు దారి తీయడం. ఈ చర్మపు రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి ఇతర కారణాలై ఉండవచ్చు.

చాలామందిని వేధించే చర్మ సమస్యల్లో.. పిగ్మెంటేషన్‌ ఒకటి. చర్మం రంగు ముదురు చాయలోకి మారినా.. లేదా మెరుపు పూర్తిగా తగ్గి మచ్చలు పడినా తేలిగ్గా తీసుకోకూడదు. దాన్ని పిగ్మెంటేషన్‌గా పరిగణించాలి. ఈ సమస్య ప్రధానంగా మూడు రకాలుగా వేధిస్తుంది.

స్కిన్ పిగ్మెంటేషన్

* చర్మం ముదురు రంగులోకి మారడాన్ని హైపర్‌ పిగ్మెంటేషన్‌ అంటారు.

* అక్కడక్కడా తెల్ల మచ్చలు పడితే.. హైపో పిగ్మెంటేషన్‌గా పరిగణిస్తారు.

* పూర్తిగా రంగు తగ్గిపోతే.. అది డీ పిగ్మెంటేషన్‌గా గుర్తించాలి.

స్కిన్ పిగ్మెంటేషన్ నివారించుకోవడానికి అనేక మెడికేషన్స్ , క్రీములు , వివిధ రకాల ఖరీదైన ట్రీట్మెంట్స్ మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను నివారించుకోవాలంటే న్యాచురల్ హోం రెమెడీస్ ఉత్తమం . న్యాచురల్ రెమెడీస్ ఏజ్ ఓల్డ్ ట్రెడిసినల్ రెమెడీస్. అంతే కాదు,చౌకైనవి కూడా. చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా సురక్షితంగా స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా స్కిన్ పిగ్మెంటేషన్ నివారించే న్యాచురల్ రెమెడీస్ గురించి వెంటనే తెలుసుకుందాం..

బంగాళదుంప :

బంగాళదుంప :

బంగాళదుంపలో స్ట్రార్చ్ మరియు చర్మాన్ని ఉత్తేజపరిచే విటమిన్స్ ఇందులో అధికంగా ఉన్నాయి. స్కిన్ పిగ్మెంట్ ఏరియాస్ లో దీన్ని అప్లై చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించుకోవచ్చు. కేవల్ అప్లై చేయడం మాత్రమే కాదు, బంగాళదుంప రసంతో చర్మం శుభ్రం చేసుకోవడం వల్ల కూడా స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవచ్చు.

నిమ్మరసం :

నిమ్మరసం :

నిమ్మరసంలో ఆస్ట్రిజెంట్ గుణాలతో పాటు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల, ఇది స్కిన్ పిహెచ్ లెవల్స్ ను పెంచుతుంది. స్కిన్ పిగ్మెంటేషన్ ను న్యాచురల్ గా తగ్గిస్తుంది. నిమ్మరసంను నేరుగా అప్లై చేయవచ్చు లేదా అందులో ఇతర న్యాచురల్ పదార్థలు మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు.

గంధం:

గంధం:

స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మానికి గంధం అప్లై చేయడం వల్ల చర్మంలో మెలనిన్ ప్రొడక్షన్ ను బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి, గందంలో కొద్దిగా నీళ్ళు పోసి, పేస్ట్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇలా వారంలో 3,4 సార్లు చేస్తే స్కిన్ పింగ్మెటేషన్ సమస్య తగ్గుతుంది.

బాదం పాలు :

బాదం పాలు :

బాదం పాలలో చర్మ కాంతిని మెరుగుపరిచే గుణాలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల స్కిన్ పిగ్మెంట్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఒక టీస్పూన్ బాదం పౌడర్ లో ఒక టీస్పూన్ బాదం మిల్క్ మిక్స్ చేసి పేస్ట్ చేసి, నల్లగా ఉండే చర్మం మీద అప్లై చేయాలి. ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

అలోవెర జెల్లో స్కిన్ రిజ్యువేటింగ్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది అన్ని రకాల స్కిన్ పింగ్మెంటేషన్ ను నివారిస్తాయి. ఫ్రెష్ గా ఉన్న అలోవెర జెల్ ను నల్లని చర్మం మీద అప్లై చేస్తే స్కిన్ పిగ్మెంట్ తగ్గుతుంది.

అవొకాడో :

అవొకాడో :

మరో ఏజ్ ఓల్డ్ హోం రెమెడీ అవొకాడో . ఇది న్యాచురల్ హోం రెమెడీ. స్కిన్ పిగ్మెంట్ ను తగ్గించడానికి అసవరమయ్యే విటమిన్స్ ఈ పండులో అధికంగా ఉన్నాయి. ఈ పండును వారంలో రెండు మూడు సార్లు ఉపయోగించుకోవచ్చు. బాగా పండిన అవొకాడోను పేస్ట్ లా చేసి నేరుగా చర్మం మీద అప్లై చేసుకోవచ్చు.

ఆరెంజ్ పీల్ పౌడర్ :

ఆరెంజ్ పీల్ పౌడర్ :

మరో మిరాకిల్ న్యాచురల్ రెమెడీ. ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి, పొడి చేయాలి. ఈ పొడిలో సిట్రిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇందులో మెలనిన్ ఉత్పత్తిని బ్యాలెన్స్ చేసే లక్షణాలు అధికంగా ఉన్నాయి. స్కిన్ పిగ్మెంటేషన్ నివారించుకోవడానికి ఆరెంజ్ పీల్ పౌడర్ కు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేయాలి. దాంతో స్కిన్ పిగ్మెంటేషన్ నివారించబడుతుంది.

బొప్పాయి గుజ్జు:

బొప్పాయి గుజ్జు:

మరో ఎఫెక్టివ్ పదార్థం బొప్పాయి. స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మెలనిన్ ప్రొడక్షన్ ను మెయింటైన్ చేస్తుంది. ఫ్రెష్ గా ఉండే బొప్పాయి గుజ్జును వారంలో రెండు సార్లు చర్మానికి అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు :

పసుపు :

ట్రెడిసినల్ న్యాచురల్ రెమెడీ పసుపు. ఇది మెలనిన్ ప్రొడక్షన్ ను మెయింటైన్ చేస్తుంది. అలాగే చర్మంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. చిటికెడు పసుపుకు కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పేస్ట్ చేసి చర్మం మీద నేరుగా అప్లై చేయాలి.

విటమిన్ ఇ ఆయిల్ :

విటమిన్ ఇ ఆయిల్ :

విటమిన్ ఇ ఆయిల్లో స్కిన్ పిగ్మెంట్ నివారించే గుణాలు అధికంగా ఉన్నాయి. దీన్ని చర్మానికి రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల స్కిన్ ప్యాచెస్ తొలగించి, స్కిన్ పిగ్మెంట్ నివారిస్తుంది.

English summary

10 Must-Try Natural Remedies For Skin Pigmentation

Pigmentation is an exceedingly common skin condition that can pop up at any age. It is a kind of disorder that affects your skin's natural color. Take a look at these must-try natural remedies of skin pigmentation here.
Story first published: Monday, June 12, 2017, 19:00 [IST]
Subscribe Newsletter