సమ్మర్ లో గ్లోయింగ్ స్కిన్ పొందడానికి సింపుల్ టిప్స్

Posted By:
Subscribe to Boldsky

వేసవికాలం ఎండలో కాసేపు తిరిగితే చాలు చర్మం కమిలిపోయి నల్లబడు తుంది. చర్మ సంరక్షణ విషయంలో కాస్తంత నిర్లక్ష్యం చేస్తే చాలు...తిరిగి నిగారింపును పొంద టానికి చాలా సమయం పడుతుంది. వేసవిలో చర్మం నల్లబడకుండా ఉండటానికి చిట్కాలు.

వేసవికాలంలో చర్మాన్ని చాలా పదిలంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో వేడి అధికంగా ఉండడం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. మండే ఎండలోనూ చాలా మందికి బయటకు వెళ్లకుండా ఉండలేరు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

రోజంతా చర్మం పై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది.

ఫేస్ వాష్

ఫేస్ వాష్

చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.

డ్రింక్ వాటర్

డ్రింక్ వాటర్

అన్నింటికంటే ముందుగా చేయాల్సింది ఎక్కువ నీటిని తాగడం. సాధారణంగా మిగతా కాలాల్లో మీరు తీసుకుంటున్న నీటి కంటే రెండింతలు అధికంగా తీసుకోవాలి.

ఎస్ పిఎఫ్ సన్ స్ర్కీన్ లోషన్

ఎస్ పిఎఫ్ సన్ స్ర్కీన్ లోషన్

ఎండలో బయటకు వెళ్లడం తప్పదనుకుంటే ఎస్‌పీఎఫ్ 15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను శరీరంపై ఎండ పడే భాగాల్లో రాసుకోండి. ఎస్ పిఎఫ్ సన్ స్ర్కీన్ లోషన్ ఎండలో బయటకు వెళ్లడం తప్పదనుకుంటే ఎస్‌పీఎఫ్ 15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను శరీరంపై ఎండ పడే భాగాల్లో రాసుకోండి.

లైట్ ఫుడ్స్

లైట్ ఫుడ్స్

తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.

పచ్చి కూరగాయలు

పచ్చి కూరగాయలు

కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను కూడా తినవచ్చు.

ఆయిల్ స్కిన్

ఆయిల్ స్కిన్

వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి. ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి.

ఐస్ మసాజ్

ఐస్ మసాజ్

ఐస్‌తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది.

స్ర్కబ్బింగ్

స్ర్కబ్బింగ్

స్క్రబ్బర్‌లను ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది.

ఫేస్ ప్యాక్

ఫేస్ ప్యాక్

టమాటా, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్ కూడా తగ్గిపోతాయి. ముఖంపై ర్యాషెస్ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు.

హెయిర్ కేర్

హెయిర్ కేర్

వేసవిలో కేశ సంరక్షణ కూడా చాలా ముఖ్యం. జుట్టును మరీ పొడవుగా ఉంచుకోకుండా వీలయినంత తక్కువగా ఉంచుకుంటే మంచిది. ఎండకు శిరోజాలు దెబ్బతినకుండా ఉండడానికి కండీషనర్ క్రీమును రాసుకోవడం తప్పనిసరి. హెన్నాచాలా చక్కని కండీషనర్‌గా ఉపయోగపడుతుంది.

సన్ టాన్

సన్ టాన్

సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది.

English summary

11 Simple Tricks To Get Glowing Skin In Summer

Summer is here in full glory and now is the perfect time to flaunt beautiful summer dresses and enjoy the delicious seasonal fruits. But summers also require you to pay special attention to the skin as heat, warmth of sun; hot winds cause severe skin damage.
Story first published: Wednesday, March 15, 2017, 9:38 [IST]
Subscribe Newsletter