మీ ఫ్రిజ్ లో ఐస్ క్యూబ్స్ ఉంటే ఈ సమ్మర్ బ్యూటీ క్వీన్ మీరే..!!

Posted By:
Subscribe to Boldsky

చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపించేందుకు బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్లడం లేదా రకరకాల పూతలు వేసుకోవడం మామూలే. అయితే ఈసారి వాటన్నింటికీ సెలవిచ్చేసి కేవలం ఐసుముక్కలతోనే చికిత్స చేసుకునేందుకు ప్రయత్నించండి. ఐస్ క్యూబ్స్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయి.

12 Beauty Benefits of using Ice cubes on Face and Skin

వేసవి వచ్చిందంటే పండ్ల రసాలూ, వివిధ అవసరాల కోసం ఫ్రిజ్‌లో ఐసుముక్కల్ని ఉంచుతారు. మరి మీ ఫ్రిజ్‌లోనూ ఈ ముక్కలు ఉంటే ఈ వేసవిలో సౌందర్యపోషణకు ఎలా ఉపయోగపడతాయో చూడండి.

మొటిమలు, మచ్చలు తొలగించే ఐస్ క్యూబ్స్ :

మొటిమలు, మచ్చలు తొలగించే ఐస్ క్యూబ్స్ :

మొటిమలు, యాక్నె ముఖం పై ఉంటే.. వేడి వాతావరణంలో చాలా మంటగా, నొప్పిగా అనిపిస్తుంది. దీన్నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే మాత్రం శుభ్రంగా ఉన్న పొడి వస్త్రంలో ఐసు ముక్కల్ని ఉంచి.. ఆ ప్రాంతంలో అద్దాలి. ఇలా ఓ పదినిమిషాలు చేయడం వల్ల హాయిగా అనిపిస్తుంది. మొటిమలూ, యాక్నె చాలా త్వరగా తగ్గిపోతాయి.

అలసిన చర్మం పునరుత్తేజం అవుతుంది:

అలసిన చర్మం పునరుత్తేజం అవుతుంది:

తరచూ ప్రయాణాలు చేసేవారి ముఖం అలసటగా ఉంటుంది. దాన్ని దూరం చేసుకుని.. తాజాదనం సొంతం చేసుకోవాలంటే ఐసుముక్కలతో ముఖంపై అద్దుకోవాలి. చల్లదనం అలసటని దూరం చేస్తుంది. చర్మానికి పునరుత్తేజాన్ని ఇస్తుంది.

ఐబ్రోస్ చేయించుకొన్నప్పుడు వచ్చే నొప్పిని తగ్గిస్తుంది :

ఐబ్రోస్ చేయించుకొన్నప్పుడు వచ్చే నొప్పిని తగ్గిస్తుంది :

చాలామంది తరచూ ఐబ్రోస్‌ చేయించుకుంటున్నా ఆప్రాంతంలో నొప్పి వస్తుంది. అలాంటి వారు ఐబ్రోస్‌ చేయించుకునే ముందు కనుబొమల వద్ద ఐసుముక్కలో రుద్ది చూడండి. నొప్పి అనిపించదు.చర్మం కందిపోదు.

కళ్లు ఉబ్బు తగ్గిస్తుంది:

కళ్లు ఉబ్బు తగ్గిస్తుంది:

కొందరు ఎక్కువ సమయం నిద్రపోయినా, లేదంటే రకరకాల కారణాల వల్ల కళ్లు ఉబ్బిపోతాయి. అలాంటి వారు ఐసుముక్కల్ని జిప్‌లాక్‌ బ్యాగుల్లో ఉంచి కళ్ల మీద పెట్టుకోవాలి. కళ్లకు హాయిగా అనిపిస్తుంది. అలర్జీలూ దూరమవుతాయి.

సన్ టాన్ నివారిస్తుంది :

సన్ టాన్ నివారిస్తుంది :

సున్నిత చర్మం ఉన్నవారికి ఈ కాలంలో చాలా సమస్యలుంటాయి. చర్మం కందిపోయినట్టు అయితే ఆ ప్రాంతంలో పొడి తువాలులో ఐసు ముక్కల్ని ఉంచి అద్దితే సమస్య దూరమవుతుంది. అలానే మిగతా ప్రాంతంలోనూ ఇలా చేయడంవల్ల రక్తప్రసరణ సక్రమంగా అంది చర్మం నిగారింపునూ సంతరించుకుంటుంది.

కళ్ల చుట్టూ నల్ల వలయాలను నివారిస్తుంది :

కళ్ల చుట్టూ నల్ల వలయాలను నివారిస్తుంది :

కళ్ళచుట్టూ నల్లని వలయాలుంటే ఐస్ క్యూబ్స్ తో సత్వర ఫలితాన్ని పొందవచ్చు. ముందుగా రెండుచెంచాల పుదీనా పేస్టు, నాలుగుచెంచాల పాలను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ట్రేల్లో పోసి డీప్ ఫ్రీజర్ లో పెట్టాలి. ఐస్ క్యూబ్స్ తయారైన తర్వాత దానిని తీసి ప్రతిరోజూ కళ్ళచుట్టూ మెల్లగా రాసుకోవాలి. ఇలా కనీసం ఓ వారం చేస్తే నల్లని వలయాలు మాయమైపోతాయి.

 రోజ్ వాటర్ తో ..

రోజ్ వాటర్ తో ..

. పరిశుభ్రమైన నీటిలో తాజారోజ్ వాటర్ కలిపి ఐస్ క్యూబ్ లను తయారు చేసుకోవాలి. ఈ రోజ్ వాటర్ ఐస్ క్యూబ్ లకు పోడిచేనసిన కర్పూరాన్ని కలిపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు ఇట్టే పోతాయి.

సమ్మర్ స్కిన్ టోనర్స్ :

సమ్మర్ స్కిన్ టోనర్స్ :

డీప్ ప్రీజర్ లో ఉంచిన తాజా పళ్లరసం, పుల్లని పెరుగు, లేదా ఏదైనా వెజిటబుల్ నూనెను ముఖం అంతా రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి స్కిన్ టోనర్లుగా పనిచేస్తాయి.

 ఐస్‌క్యూబ్స్‌తో–చ‌ర్మం బిగుతుగా..

ఐస్‌క్యూబ్స్‌తో–చ‌ర్మం బిగుతుగా..

చర్మగ్రంథులు పెద్దగా కావడం, చర్మం సాగడం ఉండటం లాంటి సమస్యలు కొంతమందిని ఇబ్బంది పెడతాయి. ఇలాంటివారు ఐసుముక్కలను ముఖంపై రుద్దుకుని చూడండి. ఇలా తరచూ చేస్తోంటే ఆ గ్రంథులు చిన్నగా కావడమే కాదు, చర్మం కూడా బిగుతుగా మారుతుంది.

ముడుతలను నివారించుకోవడానికి :

ముడుతలను నివారించుకోవడానికి :

వయసు పెరిగేకొద్దీ ముఖంలో ముడతలు మొదలవుతాయి. అవి పెరగకుండా ఉండాలంటే ఖరీదైన క్రీంలే కొనాలని లేదు. అప్పుడప్పుడు ఐసు ముక్కల్ని ముడతలున్న చోట మర్దన చేసుకుంటే చాలు. అవి అదుపులో ఉండటమే కాదు చర్మం కూడా మృదువుగా మారుతుంది.

ఐస్ ముక్క‌ల‌తో మురికి మాయం..

ఐస్ ముక్క‌ల‌తో మురికి మాయం..

మురికీ, కాలుష్యం కారణంగా ముఖం జిడ్డుగా కనిపిస్తోందా. ఐసుముకల్ని మర్దన చేస్తున్నట్లుగా ముఖమంతా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పరిశుభ్రంగా మారడమే కాదు, మృదువుగానూ కనిపిస్తుంది

సూచనలు:

సూచనలు:

ఐసుముక్కల్ని నేరుగా చర్మంపై రుద్దుకోకూడదు. రుమాలులో వేసుకుని మూటలా చుట్టి మాత్రమే ఉపయోగించాలి.

అలాగే ముందుగా నుదురూ, కళ్ల అడుగునా, చెంపలూ, చుబుకం, మెడ.. ఇలా ఓ పద్ధతి ప్రకారం మర్దన చేసుకుంటూ రావాలి.

ముఖాన్ని ముందు శుభ్రం చేసుకున్నాకే ఐసుముక్కలతో మర్దన చేసుకోవాలి. దీన్ని రాత్రిళ్లు ఉపయోగిస్తే మర్నాటికి చర్మం తాజాగా కనిపిస్తుంది. చూశారుగా ఐస్‌క్యూబ్స్‌తో ఎంత ఉప‌యోగం ఉందో మ‌రి మీరూ కూడా ట్రై చేయండి.

English summary

12 Beauty Benefits of using Ice cubes on Face and Skin

There are several skin benefits of going in for an ice cube facial. It cools your face and body, relaxes your senses and you feel rejuvenated after the whole process.
Subscribe Newsletter