For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో బ్లాక్ గా మారిన చర్మాన్ని, తిరిగి ఓరిజినల్ స్కిన్ టోన్ గా మార్చే హోం రెమెడీస్ ..!!

వింటర్లో ఫెయిర్ స్కిన్ పొందడానికి కొన్ని వంటగదిలోని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

|

ప్రస్తుతం వింటర్ సీజన్. వింటర్ సీజన్లో చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. డ్రై స్కిన్, స్కిన్ టానింగ్, డార్క్ స్కిన్ ప్యాచెస్, సెడన్ గా స్కిన్ టోన్ లో మార్పులు వస్తుంటాయి. నేచురల్ గా ఉండే స్కిన్ టోన్ కంటే రెండు డిఫరెంట్ కలర్స్ ఏర్పడుతాయి. ఇటువంటి స్కిన్ టోన్ ను తిరిగి నేచురల్ స్కిన్ టోన్ గా పొందాలంటే కొన్ని వంటింటి చిట్కాలున్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం ఫెయిర్ గా మారుతుంది. వీటిని రెగ్యులర్ బ్యూటీకోసం ఉపయోగించుకోవడం వల్ల మీ సహజ చర్మ సౌందర్యాన్ని తిరిగి పొందుతారు .

15 Kitchen Ingredients To Get Fair Skin This Winter

సన్ డ్యామేజ్, పొల్యుషన్, వింటర్ వాతావరణం వల్ల చర్మంలో వచ్చిన మార్పులు తిరిగి ఓరిజినల్ గా మారడానికి ఈ హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. మామూలుగా ఉన్న స్కిన్ కలర్ కంటే, డార్క్ కలర్ కనబడటం ఎవ్వరూ ఇష్టపడరు. ఇది నిజంగా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. స్కిన్ కలర్ ను మార్చుకోవడం కోసమని స్కిన్ టోన్ కు సూట్ అవ్వని మేకప్ షేడ్స్ వేసుకోవడం మంచిది కాదు. కాబట్టి, ఈ క్రింద సూచించిన కొన్ని హోం రెమెడీస్ ను ఫాలో అవ్వడం వల్ల ఫెయిన్ స్కిన్ టోన్ పొందుతారు.

వింటర్లో ఫెయిర్ స్కిన్ పొందడానికి కొన్ని వంటగదిలోని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

 పసుపు :

పసుపు :

పసుపును, పాలతో మిక్స్ చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత, సున్నితంగా మర్ధన చేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే, రేడియంట్ స్కిన్ పొందుతారు. ఈ కాంబినేషన్ ప్యాక్ లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంలోని మలినాలను తొలగిస్తాయి.

శెనగపిండి :

శెనగపిండి :

శెనగపిండిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను మిక్స్ చేసి,పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మెడకు అప్లై చేసి, సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. ఫెయిర్ స్కిన్ అందిస్తుంది.

తేనె :

తేనె :

తేనె నేచురల్ పదార్థం. ఇది చర్మానికి ఎక్స్ఫోలయేటర్ గా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను గ్రేట్ గా నివారిస్తుంది. చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

గుడ్లు:

గుడ్లు:

గుడ్డు పీల్ మాస్క్ గా ఉపయోగపడుతుంది. ఎగ్ వైట్ ను తీసుకుని, ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల, చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. మలినాలి తొలగిపోయి, చర్మం ఫ్రెష్ గా బ్రైట్ గా..రేడియంట్ గా మారుతుంది. చర్మానికి పూర్తిగా మాయిశ్చరైజర్ అందుతుంది.

పాలు :

పాలు :

పాలలో ల్యాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది చర్మంను లైట్ గా మార్చుతుంది. నార్మల్ స్కిన్ ఉన్న వారు కూడా, పాలను ఫేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు. వింటర్లో ఫెయిన్ స్కిన్ పొందాలంటే పాలను ఫేస్ ప్యాక్స్ లో ఉపయోగించుకోవచ్చు.

మిల్క్ క్రీమ్:

మిల్క్ క్రీమ్:

డ్రై స్కిన్ తో బాధపడే వారు, మిల్క్ క్రీమ్ ను మాయిశ్చరైజర్ గా ఉపయోగించుకోవచ్చు. మిల్క్ క్రీమ్(వెన్న , లేదా పాల మీగడ )తీసుకుని ముఖానికి అప్లై చేసి మర్ధన చేసుకోవాలి.

కాఫీ:

కాఫీ:

కాఫీ పౌడర్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఈ స్ర్కబ్బింగ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఏజింగ్ సెల్స్ నివారించబడుతాయి. ముఖం మరింత ఫ్రెష్ గా తయారువుతుంది.

సాల్ట్ :

సాల్ట్ :

సాల్ట్ స్క్రబ్బింగ్ తో చర్మంలో మలినాలు తొలగిపోతాయి. అయితే చర్మానికి సాల్ట్ ను ఉపయోగించే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాల్ట్ రఫ్ గా ఉండటం వల్ల స్కిన్ స్క్రాచెస్ ఏర్పడుతాయి. బాడీ వాష్ లేదా ఆయిల్ తో మిక్స్ చేయాలి.

పెరుగు :

పెరుగు :

పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది.చర్మం ఫెయిర్ గా మారడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. పెరుగులో ఉండే కూలింగ్ ఎఫెక్ట్ సన్ బర్న్ నివారిస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ స్కిన్ టాన్ ను మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మంలో అద్భుతమైన మార్పులు తీసుకురావాలంటే, ఆపిల్ సైడర్ వెనిగర్ ను కొద్దిగా నీటితో మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో స్ట్రాంగ్ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ స్కిన్ టోన్ ను లైట్ గా మార్చుతుంది. నిమ్మరసంను నేరుగా చర్మానికి అప్లై చేసి, 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. మంటగా అనిపిస్తే అది ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు భావించాలి.

ఓట్ మీల్ :

ఓట్ మీల్ :

ఓట్ మీల్ ఒక మంచి ఫెయిర్ నెస్ రెమెడీ. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ కు ఓట్స్ పౌడర్ గ్రేట్ స్ర్కబ్బర్ గా పనిచేస్తుంది. డ్రై స్కిన్ ఉన్నవారు, వాటర్ కు బదులుగా పాలను మిక్స్ చేసుకుంటే మంచిది.

 మేతి :

మేతి :

మెంతులను నీళ్ళలో వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వీటిని నీటిలో వేసి మెత్తగా పేస్ట్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే ఫెయిర్ స్కిన్ పొందుతారు.

షుగర్ :

షుగర్ :

షుగర్ పౌడర్ లో కొద్దిగా బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, స్ర్కబ్ చేయాలి. ఇది చర్మం మరియు పెదాలను లైట్ గా మార్చుతుంది, తేమను అందిస్తుంది. సాప్ట్ గా మార్చుతుంది. ఫెయిన్ స్కిన్ పొందడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ.

బంగాళదుంపలు:

బంగాళదుంపలు:

బంగాళదుంపల్లో బ్లీచింగ్ అలక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది సున్నితమైన బ్లీచింగ్ ఏజెంట్, అన్ని రకాల చర్మ తత్వాలకు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కళ్ళక్రింద డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది. పొటాటోను తొక్క తీసి, స్లైస్ గా కట్ చేయాలి. తర్వాత ముఖానికి అప్లై చేసి మర్ధన చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

English summary

15 Kitchen Ingredients To Get Fair Skin This Winter

These kitchen ingredients will get you back to your original skin tone in no time at all.
Story first published:Saturday, January 7, 2017, 15:04 [IST]
Desktop Bottom Promotion