పాలతో 15 రకాల ఫేస్ ప్యాక్ లు, పాలతో చర్మ సౌందర్యం రెట్టింపు!

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

కొన్ని చారిత్రక పుస్తకాలు చదివినప్పుడు, క్లియో పాట్రా అనే బ్యూటీక్వీన్ పాలతో స్నానం చేసేదని, ఈ మిల్క్ ట్రీట్మెంట్ వల్లే ఆమె అద్భుతమైన సౌందర్యం పొందిందని ఆ పుస్తకాల్లో ప్రచురించడం జరిగింది. అయితే ఈ మిల్క్ బ్యూటీ బెనిఫిట్స్ పురాతన కాలం నుండి మనకు తెలుసు అన్నమాటా. కానీ ఈ మాట మన భారతీయుల మాటల్లో వినడం కష్టమే. కొంత మంది పిల్లలకు ఒక కప్పు పాలు పౌష్టికాహారంగా దొరకడం కష్టమే.

అయితే పాలలో చర్మసౌందర్యానికి కావల్సిన అనేక ప్రయోజనాలుండటం వల్ల వీటిని తాగడానికి బదులుగా చర్మ సౌందర్యానికి వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు బ్యూటీ నిపుణులు. మీకు పాలు తాగడం ఇష్టం లేకపతే, చర్మసౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీ అందానికి ఉపయోగించే చిట్కాల్లో ఫేస్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు.

15 Milk Face Pack Recipes That You Can Make At Home Now

పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అయితే కేవలం పాల మాత్రమే కాకుండా మనం రెగ్యులర్ గా ఉపయోగించే కొన్ని పదార్థాలను పాలతో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మ అందం మెరుగుపడుతుంది.

తేనె-పాలు కాంబినేషన్ తో గొప్ప సౌందర్య ప్రయోజనాలు

పాలు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కాబట్టి, పాలను రెగ్యులర్ బ్యూటీ కోసం ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించుకోవచ్చు.

పాలతో తయారుచేసుకుని ఫేస్ ప్యాక్ లనురోజూ వేసుకోవడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి అందులో కలిపి ఇతర పదార్థాలను సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. పాలతో వేసుకునే ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మం కాంతి వంతంగా, ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది.పాలతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి. పాలతో పాటు కలపాలపాల్సిన ఇతర పదార్థాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

1. గులాబి రేఖలు, గంధం, పాలు:

1. గులాబి రేఖలు, గంధం, పాలు:

ఫేస్ మాస్క్ కోసం ఉపయోగించే ఈ ప్రాధమిక పదార్థాల్లో గులాబీ రేకులలో విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మ కాంతిని పెంచుతుంది. చర్మం ఎలాసిటిని పెంచుతుంది.అలాగే రోజ్ పెటల్స్ తోని యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి మంచి సువానస అందిస్తుంది. పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మం కాంతిని మెరుగుపరచడంలో గొప్పగా సహాయపడుతుంది. ఇక అలాగే గంధం చర్మంలోని మొటిమలను , మచ్చలను, రాషెస్ ను నివారిస్తుంది.

రిసిపి:

పాలలో గులాబీ రేకులు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం గులాబీ రేకులను పాలతో పాటు మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ప్యాక్ వేసుకోవడానికి ముందు గంధం కలపడం మర్చిపోకండి.

చర్మ సౌందర్యానికి పాలు...ఉపయోగించే విధానం

2. బాదం మరియు పాలు :

2. బాదం మరియు పాలు :

బాదం నూనె లేదా బాదంలు వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దాని వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవారు పాలతో తయారుచేసే ఫేస్ ప్యాక్ లు ఉపయోగించడం చర్మ కాంతి పెంచుకోవచ్చు. పాలతో స్ర్కబ్బర్ ను మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. దీన్ని వారంలో రెండు సార్లు ఉపయోగించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. అలాగే బాదం ఆయిల్ ను రోజూ రాత్రి నిద్రించడానికి ముందు చర్మానికి అప్లై చేయాలి.

రిసిపి

బాదంను పాలలో రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ కు మజ్జిగా లేదా మలై క్రీమ్ ను చేర్చి చర్మానికి అప్లై చేసి పది, పదిహేను నిముషాలు స్కిన్ స్ర్కబ్ చేయాలి. స్క్రబ్ చేసే సమయంలో ఈ పూత ఎండిపోయినట్లు అనిపిస్తే కొద్దిగా బట్టర్ మిక్క్ జోడించుకోవచ్చు.

3. శెనగపిండి, మలై లేదా మజ్జిగా మరియు పసుపు:

3. శెనగపిండి, మలై లేదా మజ్జిగా మరియు పసుపు:

గ్లామరస్ లుక్ పొందడానికి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. శెనగపిండిలో, మజ్జిగ, పసుపు మూడింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమంలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మం కాంతిని పెంచుతుంది, పసును మొటిమలు, వాటి మచ్చలను తొలగిస్తుంది, శెనగపిండి చర్మం మ్రుదువుగా మార్చుతుంది. ఈ ప్యాక్ ను వారంలో ఒకసారి వేసుకుంటే చాలు మంచి ఫలితం ఉంటుంది.

రిసిపి :

ఒక క్లీన్ బౌల్ తీసుకుని, అందులో ఐదు స్పూన్ల శెనగపిండి వేసి, చిటికెడు పసుపు , కొద్దిగా మజ్జిగ లేదా మలై మిక్స్ చేసి మూడు బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ఫేస్ కు ప్యాక్ లా వేసుకోవాలి.

4. తేనె మరియు పాలతో ప్యాక్:

4. తేనె మరియు పాలతో ప్యాక్:

పొడి చర్మం ఉన్నవారికి ఈ రెమెడీ బాగా సహాయపడుతుంది. చర్మంలో మొటిమలను నివారిస్తుంది. చర్మం కాంతిని పెంచుతుంది. తేనెలో ఉండే బ్యాక్టీరియాకు వ్యతిరేఖంగా పోరాడే లక్షణాలు చర్మంలో మాయిశ్చరైజింగ్ గుణాలను కలిగి ఉంటుంది. పాలతో తేనె కలిపి వాడటం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది.

రిసిపి :

పచ్చిపాలలో తేనె కలిపి బ్రెష్ తో బాగా మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వల్ల చాలా తేలికైన ప్యాక్ ను ముఖానికి మాత్రమే కాదు, శరీరానికి కూడా అప్లై చేయవచ్చు.

పచ్చిపాలతో మిల్కీ అండ్ సాప్ట్ స్కిన్ మీ సొంతం..

5. పాల పొడి, నిమ్మరసం, తేనె:

5. పాల పొడి, నిమ్మరసం, తేనె:

మీ చర్మం కాంతి పెంచడానికి పాలు, తేనె, నిమ్మరసం ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖంలో తప్పకుండా మార్పు తీసుకొస్తుంది. ఈ మిశ్రమాన్ని శరీరానికి కూడా అప్లైచేయవచ్చు. అయితే అప్లై చేసిన తర్వాత కనీసం అరగంట సేపు అలాగే ఉంచాలి. దాంతో ఈ పదార్థాలు చర్మం మీద, మొటిమలు, మచ్చల మీద బాగా పనిచేస్తాయి.

రిసిపి:

ఒక స్పూన్ మిల్క్ పౌడర్ ను ఒక బౌల్లో తీసుకోవాలి. దాంట్లో నిమ్మరసం మిక్స్ చేయాలి. దీనికి తేనె మిక్స్ చేసి, చిక్కగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది.

6. వాల్ నట్ , మిల్క్ క్రీమ్:

6. వాల్ నట్ , మిల్క్ క్రీమ్:

వాల్ నట్స్ లో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు, చర్మంలో వ్రుద్దాప్య లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే కొత్త కణాలను ఏర్పరిచి, మొత్తం చర్మంను సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్ నట్ మరియు మిల్క్ క్రీమ్ అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఇది చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. చర్మానికి అప్లై చేసిన అరగంట తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

రిసిపి:

ఈ రిసిపి తయారుచేయడానికి ఐదు వాల్ నట్స్ తీసుకుని, మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ ను డబ్బాలో నిల్వచేసుకుని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఒక స్పూన్ వాల్ నట్ పౌడర్ కి, ఒక స్పూన్ మిల్క్ క్రీమ్, మలై మిక్స్ చేసి, చిక్కటి పేస్ట్ లా చేసి, చర్మానికి అప్లై చేయాలి.

7. స్ట్రాబెర్రీ అండ్ మిల్క్ ప్యాక్:

7. స్ట్రాబెర్రీ అండ్ మిల్క్ ప్యాక్:

స్ట్రాబెర్రీ , పాలు కలపడం వల్ల బెర్రీస్ లోని ఎలాజిక్ యాసిడ్, పాలలోని ల్యాక్టిక్ యాసిడ్ చర్మం కాంతి పెంచుతుంది. స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ కొత్త చర్మ కణాల ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో కొల్లాజెన్ పెరుగుతుంది. ఇది వందశాతం న్యాచురల్ ఫేస్ ప్యాక్, ఇది చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది.

స్ట్రాబెర్రీస్ ను ముక్కలుగా కట్ చేసి, గ్రైండర్ లో వేసి మిక్స్ చేయాలి. ఈ జ్యూస్ కు పాలు కలిపి, స్కిన్ ప్యాక్ వేసుకోవాలి, ముఖం, చర్ంమ, కాళ్ళకు కూడా లేపనంలా రాసుకోవచ్చు.

9. పాలు మరియు ముల్తాని మట్టి ప్యాక్:

9. పాలు మరియు ముల్తాని మట్టి ప్యాక్:

యంగ్ గా కనబడాలంటే ముల్తాని మట్టి ప్యాక్ బాగా పనిచేస్తుంది. చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ముల్తాని మట్టి, మిల్క్ ఫేస్ ప్యాక్ వారంలో నాలుగు రోజులు ఉపయోగించుకోవచ్చు.

రిసిపి:

ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టిలో, నాలుగు స్పూన్ల పాలు కలిపి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత పూర్తిగా డ్రైగా మారే వరకూ ఉండి, తర్వాత చల్లనీటితో శుభ్రం చేసుకోవాలి.

10. బంగాలదుంప, పాలతో ప్యాక్:

10. బంగాలదుంప, పాలతో ప్యాక్:

బంగాలదుంపను నురుగా చర్మానికి రుద్దడం వల్ల చర్మం కాంతి పెరుగుతుంది, చర్మం గట్టిపడుతుంది. అయితే బంగాళదుంపతో పాలు కూడా చేర్చి ప్యాక్ వేసుకుంటే చర్మం శుభ్రపడటంతో పాటు, మంచి కాంతి పెరుగుతంది

రిసిపి:

బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేసి, అందులో పాలు కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఎండిన తర్వాత మంచి నీటితో కడిగేసుకోవాలి.

11. కుంకుమపువ్వు, పాలు:

11. కుంకుమపువ్వు, పాలు:

కుంకుమపువ్వు బహువిధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే దీన్ని చర్మం సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

రిసిపి:

5 కుంకుమపువ్వురేకులను ఒక టేబుల్ స్పూన్ పాలలో కలిపి నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టి, ఉదయం మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇది చర్మం కాంతిని పెంచడంతో పాటు, చర్మంలో మంచి సువాసన తీసుకొస్తుంది.

12. బంతిపూలతో ఫేస్ ప్యాక్:

12. బంతిపూలతో ఫేస్ ప్యాక్:

క్రిములు కుట్టిన, కాలిన గాయలు, చర్మం మీద దద్దుర్లు వంటి ఉంటే బంతి పూల ప్యాక్ గొప్పగా సహాయపడుతుంది. దీన్ని నురుగా అప్లై చేయడం కంటే పాలతో కలిపి వేసుకోవడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. పాలలో బంతి పూల రేకులు నానబెట్టి మెత్తగా పేస్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. రోజూ వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

13. అల్ ఇన్ ఫేస్ ప్యాక్ :

13. అల్ ఇన్ ఫేస్ ప్యాక్ :

ఒత్తిడి తగ్గించే ఫేస్ ప్యాక్ రోజ్ ఆయిల్ ను తయారుచేసి, అందులో సాండిల్ ఉడ్ పేస్ట్ , బట్టర్ మిల్క్, శెనగిపండి కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. ఇందులో ఉండే కొన్ని పదార్థాలు అయితే క్వాలిటీ ఉన్నవాటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

రిసిపి:

ఒక టీస్పూన్ రోజ్ ఆయిల్, గంధం పేస్ట్ మరియు శెనగపిండి మూడూ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పచ్చిపాలు ఫేస్ ప్యాక్ కు బాగా సహాయపడుతుంది. కాబట్టి, ఈ మూడింటి మిశ్రమంతో చర్మానికి లేపనం వేసుకుంటే మంచి ఫలితం పొందుతారు.

14 .మిల్క్ ఐస్ క్యూబ్స్ :

14 .మిల్క్ ఐస్ క్యూబ్స్ :

నీళ్లతో చర్మానికి ఏవిధంగా అయితే మేలు జరగుతుందో, అదే విధంగా పాలతో కూడా మేలు జరగుతుంది. పాలతో ప్యాక్ చర్మ కాంతిని పెంచుతుంది. నల్ల మచ్చలు తొలగిస్తుంది. సన్ ట్యాన్ లేదా సన్ బర్న్ నివారిస్తుంది. మిల్క్ బేస్డ్ ఐస్ క్యూబ్స్ పెద్ద చర్మ రంద్రాలను నివారిస్తుంది.

రిసిపి:

ఐస్ ట్రేలో పాలను పోసి ఫ్రీజర్ లో పెట్టాలి. పాలతో ఐస్ క్యూబ్స్ తయారైన తర్వాత ముఖానికి అప్లై చేసి మర్ధన చేయాలి. పాలు ఫ్రెష్ గా ఉన్నవి వాడిత ఫలితం ఎటపెక్టివ్ గా ఉంటుందిజ

15. అవొకాడో , పాలు ప్యాక్:

15. అవొకాడో , పాలు ప్యాక్:

మరో న్యాచురల్ ఫేస్ ప్యాక్ ఇది. అవొకాడో పేస్ట్ , పాలు. అవొకాడోలో ఉండే విటమిన్ ఇ, చర్మానికి శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. న్యాచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

రిసిపి:

ఒక చిన్న అవొకాడో తీసుకుని మిక్సీలో వేసి మెత్తగాపేస్ట్ చేయాలి.అందులో అరకప్పు పాలు మిక్స్ చేసి, బ్లెండ్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితోశుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    15 Milk Face Pack Recipes That You Can Make At Home Now

    In case you are a milk lover, you can try these milk based face packs from the residue milk you have in the glass or pot. All these milk based face packs can be made at home if combined with some other ingredients. For each pack, not more than two-three extra ingredients are required other than the milk.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more