For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షా కాలంలో పొడి చర్మం పోగొట్టుకోవడానికి 5 సింపుల్ చిట్కాలు

By Mallikarjuna
|

ప్రస్తుతం వర్షాకాలం, ఈ వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. ఈ వాతావరణంలో ఆరోగ్యసమస్యలు, అందానికి సంబంధించిన సమస్యలు ఎక్కవ. ఈ సమయంలో ఇన్ఫెక్షన్స్ అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో చర్మం ,జుట్టు కూడా ప్రభావితం అవుతుంది.

వాతావరణంలో అకస్మాత్ గా వచ్చే ఉష్ణోగ్రతల మార్పుల వల్ల చర్మం త్వరగా రియాక్ట్ అవుతుంది. వర్షాకాలంలో డ్రై స్కిన్ సమస్య. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో చర్మం పొడిబారడం, చర్మం దురదగా అనిపించడం జరుగుతుంది. అందువల్ల ఈ రోజుల్లో చర్మం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వర్షకాలంలో చర్మ సంరక్షణకు సింపుల్ హోం రెమెడీస్వర్షకాలంలో చర్మ సంరక్షణకు సింపుల్ హోం రెమెడీస్

వర్షాకాలంలో సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ, చర్మానికి మాయిశ్చరైజర్, చాలా అవసరం అవుతుంది. వర్షాకాలంలో డ్రై స్కిన్ నివారించుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలను సూచించడం జరిగింది .

ఇంట్లో తయారుచేసుకునే హోం మేడ్ ప్యాక్ లతో డ్రై స్కిన్ నివారించి, హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

1. బట్టర్ మాస్క్:

1. బట్టర్ మాస్క్:

డ్రైస్కిన్ ను ఈ ఫేషియల్ మాస్క్ త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

కావాల్సినవి:

  • 1 టీస్పూన్ సాప్ట్ బట్టర్
  • 1 టీస్పూన్ వాటర్
  • కావల్సినవి:

    1. వెన్నకు కొద్దిగా నీళ్లు కలిపి మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పొడి చర్మానికి అప్లై చేయాలి,

    2. 15-20 నిముషాలు ఈ ప్యాక్ ను అలాగే ఉంచాలి.

    3. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

    2) అవొకాడో మాస్క్ :

    2) అవొకాడో మాస్క్ :

    పండ్లలో ఇది ఒక ఆరోగ్యకరమైన పండు, ఇది ముఖానికి మాయిశ్చరైజర్ గా గ్రేట్ గా పనిచేస్తుంది. దీనికి తేనె మిక్స్ చేయడం వల్ల, ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల సూపర్ ఎఫెక్టివ్ మాస్క్ గా పనిచేస్తుంది.

    కావల్సిన పదార్థాలు: -

    1 బాగా పండిని అవొకాడో

    - 1 ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ హనీ

    తయారుచేయువిధానం:

    1) అవొకాడో తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి.

    2) ఈ పేస్ట్ కు ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి.

    3) ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి.

    4) అప్లై చేసిన 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

    సీజనల్ స్కిన్ కేర్ : మాన్ సూన్ స్కిన్ కేర్ టిప్స్ సీజనల్ స్కిన్ కేర్ : మాన్ సూన్ స్కిన్ కేర్ టిప్స్

    3) ఆలివ్ ఆయిల్

    3) ఆలివ్ ఆయిల్

    మరియు షుగర్ స్ర్కబ్ ఆలివ్ ఆయిల్లో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల ఇది అందాన్ని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బ్రౌన్ షుగర్ లో తేమ స్వభావం అధికంగా ఉండటం వల్ల చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. వర్షాకాలంలో ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

    కావల్సిన పదార్థాలు :

    - 4 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్

    - 1 టేబుల్ స్పూన్ తేనె

    - 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్

    తయారుచేయు విధానం:

    1) పైన సూచించిన విధంగా పదార్థాలన్నింటిని మిక్స్ చేయాలి.

    2) ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయాలి. తర్వాత దీన్ని సర్క్యులర్ మోషన్ లో మర్దన చేయాలి. వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే హెల్తీ ఫుడ్స్

    4) పెరుగు మరియు బొప్పాయి చికిత్స:

    4) పెరుగు మరియు బొప్పాయి చికిత్స:

    పెరుగు అద్భుతమైన స్కిన్ హైడ్రేటింగ్ ఏజెంట్. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. బొప్పాయి చర్మానికి మంచి గ్లో ఇస్తుంది.

    కావల్సిన పదార్థాలు: -

    అరకప్పు పెరుగు

    - 3 టేబుల్ స్పూన్ల బొప్పాయి పేస్ట్

    - 2 చుక్కల తేనె

    - 5-6 చుక్కల నిమ్మరసం

    తయారుచేయువిధానం:

    1) ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం, పెరుగు వేసి మిక్స్ చేయాలి.

    2) తర్వాత ఇందులో తేనె మరియు బొప్పాయి వేసి మిక్స్ చేయాలి.

    3) ఈ మిశ్రమాన్ని చర్మానికి ప్యాక్ లా వేసుకోవాలి.

    4) 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారానికొకసారి అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

    వర్షాకాలంలో పాటించాల్సిన టాప్ 10 చర్మసంరక్షణ చిట్కాలువర్షాకాలంలో పాటించాల్సిన టాప్ 10 చర్మసంరక్షణ చిట్కాలు

    5) గుడ్డులోని పచ్చసొన, మరియు ఆరెంజ్ జ్యూస్ ట్రీట్మెంట్ :

    5) గుడ్డులోని పచ్చసొన, మరియు ఆరెంజ్ జ్యూస్ ట్రీట్మెంట్ :

    గుడ్డులోని పచ్చసొన గ్రేట్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఈ ఫేస్ ట్రీట్మెంట్ వల్ల చర్మంలో అద్భుత మార్పులు వస్తాయి.

    కావల్సిన పదార్థాలు:

    - 1 గుడ్డు పచ్చసొన

    - 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్

    - 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్

    - కొద్దిగా రోజ్ వాటర్

    తయారుచేయువిధానం:

    1) పైన సూచించిన పదార్థాలన్నింటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి.

    2) ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.

    3) 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం సాప్ట్ గా మరియు సపెల్ గా మరియు స్మూత్ గా తయారవుతుంది. పొడి చర్మంను నివారించడంలో ఈ న్యాచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. వీటితో పాటు మీ చర్మతత్వాన్ని బట్టి ఫేస్ వాష్ ఎంపిక చేసుకుని ఉపయోగించాలి. వీటితో పాటు రెగ్యులర్ డైట్ ఫ్రూట్స్ చేర్చుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి మానేయాలి. ఎక్కువ సమయం ఎండలో తిరగకపోవడం మంచిది.

English summary

5 Beauty Hacks To Tackle Dry Skin This Monsoon

Here are a few DIY hacks to make your dry skin healthy and glowing even when everything around you is gloomy. Take a look.
Desktop Bottom Promotion