Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
చిటికెలో మేకప్ ను తొలగించే వెరీ సింపుల్ టిప్: పాలు
ముఖానికి వేసుకునే అలంకరణను తొలగించడానికి ఖరీదైన రసాయన ఉత్పత్తులే అన్నిసార్లు వాడాలని లేదు. మనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనూ దాన్ని తొలగించుకోవచ్చు. పైగా వాటివల్ల లాభాలు కూడా ఉంటాయి తెలుసా
మగువులు ఎప్పుడూ అందంగా ఉండాలని కోరుకుంటారు. ఆ అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో చిట్కాలు, మెళుకువులు పాటిస్తుంటారు. అయితే వారు వాడే కొన్ని సౌందర్య సాధనాల గురించి వారికి సరైన అవగాహన లేకపోవటంవల్ల, కొన్ని పొరపాట్లు జరిగి కొంత నష్టపోవాల్సి వస్తుంది. ఆ పొరపాట్లేమిటో తెలుసుకోగలిగితే, వాటిని సరిదిద్దుకోగలుగుతాము. బాహ్యసౌందర్య కోసం మేకప్ ఎలా వేసుకొంటామో..ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటామో వాటిని రిమూవ్ చేసేటప్పుడు అన్నే జాగ్రత్తలు పాటించగలిగినప్పుడు చర్మాన్ని కాపాడుకోవచ్చు.

రాత్రి పడుకునే ముందు ముఖానికి వేసుకున్న మేకప్‌ను తప్పనిసరిగా తీసేయాలి. మేకప్ తీసివేయటానికి సబ్బు వాడకుండా క్లెన్జింగ్ మిల్క్ రాసుకుని, తరువాత సున్నితంగా మేకప్ తీసేసి, ముఖాన్ని వేడినీటితో కడుక్కుని, మాయిశ్చరైజర్ క్రీమ్‌గానీ, లోషన్ గానీ రాసుకోవాలి. అలా కాకుండా సబ్బు వాడటంవల్ల మేకప్ పూర్తిగా పోదుకదా, సబ్బు ప్రభావం చర్మం మీద పూర్తిగా పడుతుంది. ముఖాన్ని సబ్బుతో అదేపనిగా రుద్దటంవల్ల ముఖ చర్మం డ్రైగా మారి ర్యాషెస్ (దద్దుర్లు) రావటం, ఇంకా పిగ్మెంటేషన్ సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి, మేకప్ ను రిమూవ్ చేయడానికి కొన్ని సులభ చిట్కాలు క్రింది విధంగా ఉన్నాయి.
ముఖానికి వేసుకునే అలంకరణను తొలగించడానికి ఖరీదైన రసాయన ఉత్పత్తులే అన్నిసార్లు వాడాలని లేదు. మనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనూ దాన్ని తొలగించుకోవచ్చు. పైగా వాటివల్ల లాభాలు కూడా ఉంటాయి తెలుసా.

పెరుగు
పావుకప్పు పెరుగులో రెండు చుక్కల ఆలివ్‌నూనె కలిపి దానిలో ముంచిన దూదితో అలంకరణను తుడిచేయండి. అలంకరణ పూర్తిగా పోతుంది. పెరుగు చర్మంపై పేరుకున్న మురికినే కాదు.. మృతచర్మాన్నీ తొలగిస్తే ఆలివ్‌నూనె మృదుత్వాన్ని అందిస్తుంది.

తేనె
రెండు చెంచాల తేనెపై కొద్దిగా వంటసోడాను వేసి దాంతో ముఖాన్ని తుడుచుకుని చూడండి. ఈ రెండింటిలో ఉండే సుగుణాల వల్ల చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. తాజాగానూ కనిపిస్తుంది.

కొబ్బరినూనె
నీటిఆధారిత మేకప్‌ని తొలగించడం కాస్త పెద్దపనే. దీన్ని వేసుకున్నప్పుడు కొబ్బరినూనెను ఉపయోగించాలి. ఆ నూనెలో దూదిని ముంచి.. ముఖాన్ని తుడుచుకోవాలి. అలంకరణ పూర్తిగా పోయి.. చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది.

టొమాటోను
టొమాటోను మెత్తగా చేసుకుని దానికి కాస్త కొబ్బరినూనె లేదా పిల్లల ఒంటికి రాసే నూనెను కలిపి ముఖానికి రాసుకున్నా కూడా అలంకరణ పోతుంది. పైగా ఆ మిశ్రమం చర్మాన్ని శుభ్రం చేస్తుంది కూడా. టొమాటో అందుబాటులో లేకపోతే.. కీరదోస గుజ్జుని కూడా వాడొచ్చు.

ఆవిరి పట్టాలి
ముఖాన్ని కొబ్బరినూనెతో తుడిచేసుకుని ఆ తరవాత కాసేపు ఆవిరి పట్టాలి. చర్మగ్రంథులు తెరుచుకుని అలంకరణ పూర్తిగా పోతుంది.

ఆలివ్‌నూనెను
ఆలివ్‌నూనెను కాస్త తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక దూదితో తుడిచేసి, ఆ తరవాత కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగానే కాదు, మృదువుగానూ కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications