చర్మంపై మొండిగా మారిన నల్లమచ్చలను తొలగించే 7 రకాల నూనెలు

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

మనందరం బైక్ మీద నుండి పడే ఉంటాము లేదా వంటగదిలో మన చేతులు కోసుకునే ఉంటాము లేదా ఆడుకునేటపుడు దెబ్బలు తగిలే ఉంటాయి. బాగా దెబ్బలు తగిలిన చోట చాలారోజుల పాటు మచ్చ ఉంటుంది, కొన్నిసార్లు జీవితాంతం ఆ మచ్చ ఉంటుంది. మచ్చల కోసం ఇక్కడ చాలా తక్కువ తెలిసిన ఉపశమనాలు, ఔషధాలు ఇవ్వబడ్డాయి.

మందులు చాలావరకు సహజంగానే మత్తుగా ఉంటాయి, కాబట్టి ఎక్కువ కాలం వాటిని వాడకూడదు. కాబట్టి, సహజ ఉపశమనాలు, ఎప్పటి నుండో ఉన్న మచ్చలు తగ్గడానికి నూనెలను వాడడం మంచిది. కొన్ని వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న ఉత్పత్తులు మచ్చలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. అయితే, చర్మపు కనజాలంపై ఉన్న పొరలు పాడవడం వల్ల మచ్చలు ఏర్పడతాయి, ఈ పరిష్కారం ఒకరికి పనిచేయవచ్చు మరొకరికి పనిచేయక పోవచ్చు. మచ్చలను తొలగించడానికి దేబ్బలపై పనిచేసే కొన్ని నూనెలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

1.లావెండర్ ఆయిల్

1.లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ చాలా మృదువుగా చేయడమే కాక మచ్చలను ప్రభావవంతంగా నయం చేస్తుంది కూడా. ఇది కణాల పునరుత్పత్తి ప్రక్రియను వేగం చేస్తుంది. అప్పుడే తగిలిన దెబ్బలకు, నీటిలో లవేండర్ నూనె చుక్కలను వేసి దెబ్బమీద రాస్తే అది వేగంగా పనిచేసి, మచ్చలను తగ్గిస్తుంది. ఇంతకూ ముందే ఉన్న మచ్చలపై, మంచి ఫలితాల కోసం డైల్యూట్ చేసిన ఆయిల్ ని మచ్చలపై ఎక్కువ రోజులు రాయండి.

2.కొబ్బరి నూనె

2.కొబ్బరి నూనె

ఈ వినయపూర్వకమైన, తేలికగా దొరికే నూనె ఇప్పుడు ప్రేవుల నుండి ప్రతిదీ, జుట్టుకు, శరీరానికి రోగనిరోధక శక్తిని నయం చేయడానికి గుర్తింపు పొందుతుంది. నయమయిన గాయాలు మచ్చలు పడినపుడు, వాటిని తగ్గించడానికి నిమ్మకాయ రసం, కొబ్బరి నూనెను కలిపి ప్రతిరోజూ అప్లై చేయాలి. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ E మచ్చలు త్వరగా నయమవడానికి సహాయపడుతుంది. అప్పుడే తగిలిన దెబ్బలకు ఇంట్లోనే చికిత్స చేయవచ్చు, కోకోనేట్ ఆయిల్ రాస్తే ఇన్ఫెక్షన్ నుండి రక్షించి, మచ్చలను తగ్గిస్తుంది.

3.హేలిక్రిసమ్ నూనె

3.హేలిక్రిసమ్ నూనె

హేలిక్రిసమ్ ఇటాలికమ్ చెట్టు నుండి వచ్చే ఈ అద్భుతమైన నూనె అన్నిరకాల మచ్చలపై బాగా పనిచేస్తుంది. అవి దేబ్బలైనా లేదా సర్జెరీ అయినా, పాత లేదా కొత్త అయినా హేలిక్రిసమ్ నూనె మచ్చాలకు చికిత్స చేస్తుంది. మంచి ఫలితాల కోసం క్యారిఎర్ బేస్ లో కేవలం 1% డైల్యూషన్ సరిపోతుంది.

4.క్యారెట్ విత్తనం నూనె

4.క్యారెట్ విత్తనం నూనె

మీరు ఎప్పుడైనా క్యారెట్ విత్తనాలు చూసారా? అవి చాలా చిన్నవిగా ఉంటాయి. అయితే, అవి మచ్చలు, వాటి చికిత్స కోసం అద్భుతమైన శక్తివంతమైన నూనెను కలిగి ఉంటాయి. ఇది చర్మ మాయిశ్చరైజింగ్ కి చాలా మంచిది. ఇది ఫైన్ లైన్స్, స్ట్రెచ్ మార్క్స్, ఇతర స్కిన్ డామేజ్ లపై అద్భుతంగా పనిచేస్తుంది. క్యారెట్ సీడ్ ఆయిల్ ఉపయోగించే ముందు కేరిఎర్ ఆయిల్ తో డైల్యూట్ చేయాలి.

5.ఆలివ్ ఆయిల్

5.ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ అద్భుతమైన తేమను కలిగి ఉంటుందని మనందరికీ తెలుసు. ఇది మచ్చగా ఏర్పడే ప్రధాన భాగం నుండి డెడ్ స్కిన్ సేల్స్ ని తొలగించి, కాలక్రమేణా చర్మం నయంచేయడానికి సహాయపడుతుంది. సాధారణమైనంతవరకు, ఎక్సట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నే ఉపయోగించండి.

6.ఆవ నూనె

6.ఆవ నూనె

ఆవనూనె వాసన అందరికీ పడదు, ఇది మచ్చలకి అద్భుతమైన చికిత్స అనే వాస్తవాన్ని తిరస్కరించడానికి లేదు. మొండి మచ్చాలకు 10% ఆవనూనె కలిగిన ఆయింట్మెంట్ ని అనేక వారాల పాటు వాడడం గొప్ప మార్గం.

7.రోజ్ హిప్ ఆయిల్

7.రోజ్ హిప్ ఆయిల్

మీరు అద్భుతమైన చికిత్సతో పాటు ఎల్లప్పుడూ మంచి సువాసన కూడా ఉండాలి అంటే ఈ రోజ్ హిప్ ఆయిల్ ని ప్రయత్నించండి. బాతింగ్ ఆయిల్ ఉపయోగించేటపుడు, కనిపించే మచ్చల మొత్తాన్నీ, వాటి తీవ్రతను తగ్గిస్తుంది.

ఈ గృహ వైద్యాలతోపాటు, మొండి మచ్చలకు లేజర్ స్కార్ ని కూడా ప్రయత్నించవచ్చు. మచ్చలపై చికిత్సకు మార్కెట్లో అనేక రకాల క్రీములు అందుబాటులో ఉన్నాయి. ఈ చికిత్స ఎంపికల కోసం మీ డాక్టర్ ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

English summary

7 Oils For Scars: Heal Those Stubborn Scars Naturally

Some commercially available products are gaining popularity for being excellent at scar removal. However, a scar is formed due to the destruction of several layers of skin tissue and a solution that works for one person may not work for another. Here are a few oils that work wonders for scar removal.
Story first published: Thursday, December 7, 2017, 9:00 [IST]
Subscribe Newsletter