ముఖంలో ఎలాంటి నల్లమచ్చలనైనా మాయం చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

By Sindhu
Subscribe to Boldsky

చర్మం మీద మచ్చలు, చారలతో బాధపడుతున్నారా?మీ చర్మ మీద మచ్చలు లేదా చారలకు వివిధ కారణాలు ఉండవచ్చు. వంటచేసేప్పుడు, వేడి వేడి పాన్స్, కుక్కర్లు వంటివి చేతికి తగడం వల్ల బర్న్ స్కార్స్ లేదా బర్నింగ్ మచ్చలు అలాగే చర్మం మీద కనబడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో కాలిన గాయాలు లేదా దెబ్బతగిలిన గాయాలు కూడా మచ్చలుగా, చారలుగా మారుతాయి. ఇలా చర్మం మీద పడ్డ వివిధ రకాలా మచ్చలు, చారలు మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది. అంతే కాదు, మొటిమలతో వచ్చే మచ్చలు కూడా మచ్చలకు ఏర్పడుటకు ప్రధాన కారణం అవుతుంది.

మొటిమలతో ఏర్పరడే మచ్చలు చారలుగా ఏర్పడకపోయినా, ఆ మచ్చలు కొంత వరకూ బాధ కలిగిస్తుంది. ఇటువంటి మచ్చలు, చారలను నివారించడానికి మార్కెట్లో అందుబాటులో ఉండే ఖరీదైన క్రీములను ఉపయోగిస్తే మచ్చలు కొంత వరకూ తొలగిపోయినా, వాటి గుర్తులు చారలుగా చర్మం మీద అలాగే నిల్చి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఉత్తమ హోం రెమడీస్ అప్లై చేయడం ద్వారా మచ్చలను మరియు ఛారలను లైట్ చేస్తుంది. లేదా పూర్తిగా మాయం చేస్తాయి. మరి ఆ ప్రభావంతమైన హోం రెమడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

తేనె:

తేనె:

తేనే ఇంట్లో సహజంగా మచ్చలు తగ్గించటం కోసం ఉపయోగకరంగా ఉంటుంది.తేనే చర్మ కణజాలం పునరుత్పత్తిలో సహాయపడి ఒక మాయిశ్చరైజర్ గా ఉంటుంది. చనిపోయిన చర్మం కణాలు మరియు కణజాలాలలో మచ్చలు ఉంటాయి. తేనే కొత్త చర్మం కణజాలంను పెంచి,తద్వారా మచ్చలను తగ్గించటానికి సహాయం చేస్తుంది. కొన్ని చుక్కల తేనె తీసుకోని నేరుగా మచ్చల ప్రాంతంలో రాయండి. క్రమం తప్పకుండా ఇలా చెయ్యడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని స్మూత్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని స్కార్స్ మరియు మొటిమలను, మచ్చలను నివారిస్తుంది. మరియు ఇందులో ఉండే విటమిన్ సి కొత్త చర్మాన్ని పునరుత్పత్తి చేస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

అత్యంత ప్రభావవంతమైన సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా నిమ్మ ఉన్నది. నిమ్మకాయను అనేక మంది సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. ఇది మచ్చల గుర్తులు తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది. నిమ్మను ఉపయోగించి మచ్చల గుర్తులను తగ్గించటం అనేది ఒక సహజమైన మరియు సమర్థవంతమైన మార్గం. నిమ్మ కూడా చనిపోయిన చర్మం కణాలను తొలగించి కొత్త చర్మం యొక్క పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. మచ్చలను తగ్గించటానికి ఒక కాటన్ తీసుకోని నిమ్మరసంలో ముంచి మచ్చల యొక్క ప్రాంతం చుట్టూ రుద్దాలి. దీనిని ప్రతిరోజూ కొన్ని వారాల పాటు పునరావృతం చేయాలి. మీరు మచ్చలలో గణనీయమైన తేడాను చూస్తారు. బంగాళాదుంప మరియు టమోటా కూడా మచ్చలు తగ్గించగల మంచి సహజ బ్లీచింగ్ కారకాలుగా ఉన్నాయి.

సాండిల్ ఉడ్ (గంధం):

సాండిల్ ఉడ్ (గంధం):

కొద్దిగా సాండిల్ వుడ్ మరియు రోజ్ వాటర్ ను తీసుకొని పేస్ట్ చేయాలి. దీన్ని వీపు బాగానికి అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం స్నానం చేస్తే, మంచి గ్లోయింగ్ స్కిన్ మీరు పొందవచ్చు.

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళదుంప చర్మానికి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కళ్ళ క్రింది డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది. స్కార్స్ ను నివారించడంలో అత్యంత ఎపెక్టివ్ అయినటువంటి హోం రెమెడీ. పచ్చిపొటాటోను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

టమోటో:

టమోటో:

టమోటో గుజ్జు అద్భుతమైన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. టమోటోలో ఉండే ఎఫెక్టివ్ పదార్థాలు, స్కార్స్ ను తొలగిస్తుంది. టమోటో గుజ్జును మెత్తగా చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో స్కార్స్ తొలగిపోతాయి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, ఓల్డర్ స్కార్స్ ను తొలగిస్తుంది. అలాగే స్కార్స్ ను త్వరగా మాయం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే లూరిక్, కాప్రిలిక్ మరియు కార్పిక్ యాసిడ్స్ కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో చర్మంలో చారలు త్వరగా నయం అవుతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    7 Ways To Fade Scars Using Home Remedies

    Have you ever dreamt of heading to your office on a busy morning without any makeup on and with a clean and glowing face? This will be possible only if you have a scar-free gorgeous skin. But, not all women are lucky enough to have this. And that's why we're bringing you some home remedies for scars that are worth giving a shot at.
    Story first published: Monday, January 23, 2017, 18:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more