తులసి ఫేస్ ప్యాక్ తో యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్

Posted By:
Subscribe to Boldsky

అందం మహిళ సొంతం.. అందంగా కనబడుటకు ఎన్నో క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే పురాతన కాలం నుండి ఒక బ్యూటీ పదార్థం బాగా ప్రసిద్ది. ఆ బ్యూటి పదార్థం మన గ్రీన్ గార్డెన్ లో ఉండేదే..అదే తులసి. తులసి ఆధ్యాత్మికపరంగా , ఆరోగ్యం పరంగా బాగా ప్రసిద్ది చెందినది. ప్రపంచ వ్యాప్తంగా తులసిని బ్యూటి మెరుగుపరుచుకోవడంలో గ్రేట్ గా ఉపయోగిస్తున్నారు. ఈ హెర్బల్ ప్లాంట్ లో ఉండే గుణాలు చర్మం సంరక్షణకు ఉపయోగించడం వల్ల చర్మంలో కొన్ని అద్భుత మార్పులు జరుగుతాయి.

రెగ్యులర్ గా తులసి తాగడం వల్ల పొందే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.!!

తులసిలో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా తులసిని చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగించడం వల్ల ఇది బ్లాక్ హెడ్స్, ముఖంలో మచ్చలు, మొటిమలు, మొటిమలకు సంబంధించిన ఛారలన్నింటిని తులసి తొలగిస్తుంది.

అందువల్ల, తులసి ఆకులను ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది అన్ని విషయంను తెలుసుకుందాం..

తులసినీళ్లు, పసుపు మిశ్రమంతో శరీరానికి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!

అయితే తులసితో పాటు మరికొన్ని నేచురల్ పదార్థాలను కూడా ఉపయోగించడం వల్ల మరింత ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు. స్కిన్ బ్యూటి కోసం తులసి ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..

తులసి , ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

తులసి , ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్

స్కిన్ లైటనింగ్ చేసుకునేందుకు తులసి గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకుని మొత్తగా పేస్ట్ చేసి అందులో ఎగ్ వైట్ ను మిక్స్ చేసి ముఖానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత తడి బట్టతో తుడిచేసుకోవాలి. దీన్ని ఫేషియల్ టోనర్ గా ఉపయోగపడుతుంది. చర్మంను బ్రైట్ గా మరియు లైట్ గా మార్చుతుంది.

తులసి మరియు పెరుగు ఫేస్ ప్యాక్

తులసి మరియు పెరుగు ఫేస్ ప్యాక్

తులసి, పెరుగు కాంబినేషన్ ఫేస్ ప్యాక్ తో ముఖంలో బ్రేక్ అవుట్స్ మరియు మచ్చలను తొలగించుకోవచ్చు. గుప్పెడు తులసి ఆకులు తీసుకుని, మిక్సీలో వేసి, రెండు టీస్పూన్ల పెరుగు చేర్చి, మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

తులసి లీఫ్ ఫేస్ వాష్

తులసి లీఫ్ ఫేస్ వాష్

10-12 తులసి ఆకులను తీసుకుని నీళ్ళల్లో వేసి బాయిల్ చేయాలి. 5 నిముషాలు ఉడికించిన తర్వాత స్టౌఆప్ చేయాలి . ఈ తులసి నీళ్లు చల్లారిన తర్వాత ఫేస్ వాష్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ నీళ్లతో రోజులో రెండు మూడు సార్లు ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల యంగ్ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.

తులసి, ముల్తాని మట్టి, కోకనట్ ఆయిల్ ఫేస్ ప్యాక్

తులసి, ముల్తాని మట్టి, కోకనట్ ఆయిల్ ఫేస్ ప్యాక్

ఒక టీస్పూన్ కొబ్బరి నూనె, ఒక టీస్పూన్ ముల్తాని మట్టి, కొన్ని తులసి ఆకులను మిక్స్ చేసి, పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం, మెడకు ప్యాక్ వేసుకుని, 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను వారానికొకసారి అప్లై చేస్తే చాలు ముఖంలో కాంతి పెరుగుతుంది. చర్మం తేమగా కనబడుతుంది.

తులసి, నిమ్మరసంతో ఫేస్ ప్యాక్

తులసి, నిమ్మరసంతో ఫేస్ ప్యాక్

ఆయిల్ స్కిన్ నివారించడంలో ఈ ఫేస్ ప్యాక్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మంలో ఎక్సెస్ సెబమ్ ను గ్రహిస్తుంది. చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. చర్మ రంద్రాలు తెరచుకునేలా చేసి, శుభ్రం చేస్తుంది. గుప్పెడు తులసి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, అందులో నిమ్మరసం మిక్స్ చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

తులసి, సాండిల్ ఉడ్ పౌడర్ ఫేస్ ప్యాక్

తులసి, సాండిల్ ఉడ్ పౌడర్ ఫేస్ ప్యాక్

15 తులసి ఆకులను తీసుకుని, నీళ్లో వేసి బాయిల్ చేయాలి. 5 బాయిల్ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, అందులో సాండిల్ ఉడ్ పౌడర్ మిక్స్ చేయాలి. ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ముఖానికి ప్యాక్ వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

తులసి, పుదీనా ఫేస్ ప్యాక్ :

తులసి, పుదీనా ఫేస్ ప్యాక్ :

గుప్పెడు, పుదీనా ఆకులు మిక్సీలో వేసి పేస్ట్ చేసి , తర్వాత అందులో రోజ్ వాటర్ ను మిక్స్ చేసిముఖానికి, మెడకు అప్లై చేసి, 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల స్కిన్లో గ్లోనెస్ పెరుగుతుంది.

English summary

7 Ways To Include Basil Leaves In Your Skin Care Routine

The positive effects of basil leaves tend to heighten when used in combination with other equally beneficial natural ingredients. Try these ways to get flawless skin that doesn't depend on make-up items to look beautiful.
Story first published: Friday, March 10, 2017, 14:47 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter