For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నుదటిపై పింపుల్స్ ను తొలగించే 9 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

ఫోర్ హెడ్ మీద కనిపించే మొటిమలను కవర్ చేయాలంటే చాలా కష్టం. ఫోర్ హెడ్ చాలా త్వరగా జిడ్డుగా మరుతుంటుంది. అంతే కాదు ఫోర్ హెడ్ తో పాటు, ముక్కు కూడా ఆయిలీగా మారుతుంది . ఫోర్ హెడ్ ఆయిల్స్ , కండీషనర్స్, డైస్,

By Lekhaka
|

చాలా మంది ఫోర్ హెడ్ (నుదిటిన) మొటిమలతో ఇబ్బందిపడుతుంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన సాధారణ సమస్య . ఈ సమస్యను ఎవరైనా ఫేస్ చేయవచ్చు. ముఖ్యంగా ఫోర్ హెడ్ ప్రాబ్లమాటిక్ ఏరియా . చాలా సులభంగా మొటిమలకు దారితీస్తుంది .

ఆయిల్ హెయిర్ మరియు చుండ్రు వంటివి ఫోర్ హెడ్ మీద మొటిమలు ఏర్పడటానికి ముఖ్యకారణం. అలాగే హార్మోనుల ప్రభావం కూడా ఫోర్ హెడ్ పింపుల్ కు కారణం అవుతుంది .

ఫోర్ హెడ్ మీద కనిపించే మొటిమలను కవర్ చేయాలంటే చాలా కష్టం. ఫోర్ హెడ్ చాలా త్వరగా జిడ్డుగా మరుతుంటుంది. అంతే కాదు ఫోర్ హెడ్ తో పాటు, ముక్కు కూడా ఆయిలీగా మారుతుంది . ఫోర్ హెడ్ ఆయిల్స్ , కండీషనర్స్, డైస్, మరియు షాంపులకు ఎక్స్ఫోజ్ అవుతుంటుంది. ఈ అన్ని రకాల కాంబినేషన్స్ ఫోర్ హెడ్ మీద మొటిమలు మరియు మచ్చలు ఏర్పడటానికి కారణం అవుతుంది.

9 Effective Home Remedies For Forehead Acne

ఫోర్ హెడ్ పింపుల్స్ నివారించడానికి హోం రెమెడీస్ చక్కగా పనిచేస్తాయి. కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు, మొటిమలను నివారించడంలో ప్రత్యేకంగా పనిచేస్తాయి. ఇవి మొటిమలను , మచ్చలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . ఫోర్ హెడ్ మీద ఏర్పడ్డ మొటిమలను నివారించడానికి సహాయపడే కొన్ని ఎఫెక్టివ్ మార్గాలు ఈ క్రింది విధంగా...
1. భాదకరమైన

1. భాదకరమైన

మొటిమలను నివారించడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసం చర్మ రంధ్రాల్లోనికి చొచ్చుకొనిపోయి మురికిని తొలగిస్తుంది. నిమ్మకాయను రెండు లేదా మూడు భాగాలుగా కట్ చేసి ముఖం మీద రుద్దాలి. రుద్దిన తర్వాత కొన్ని గంటలు అలాగే ఉంచాలి. తర్వాత కోల్డ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల పెయిన్ ఫుల్ పింపుల్స్ ను నివారించి, చికిత్సనందిస్తుంది.

2. యాపిల్ సైడర్ వెనిగర్

2. యాపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఆల్కలైన్ గుణాలు అధికంగా ఉన్నాయి, ఇది ఫోర్ హెడ్ మీద ఉన్న మొటిమలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. దీన్ని వాటర్ తో మిక్స్ చేసి నుదిటి మీద అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

3. టమోటో

3. టమోటో

టమోటోను రెండు గా కట్ చేసి మొటిమలున్న ప్రదేశంలో నేరుగా అప్లై చేసి మర్ధన చేయాలి . ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ఫోర్ హెడ్ మీద వచ్చిన మొటిమలు మచ్చలు తొలగిపోతాయి . ఫోర్ హెడ్ పింపుల్స్ తొలగించడంలో మరియు స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపరచడంలో టమోటో గ్రేట్ గా సహాయపడుతుంది.

4. ఎగ్ వైట్

4. ఎగ్ వైట్

గుడ్లు మొటిమలను మచ్చలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎగ్ వైట్ చర్మ రంద్రాలను టైట్ చేస్తుంది మరియు ఫోర్ హెడ్ పింపుల్స్ నివారిస్తుంది. ఫోర్ హెడ్ పింపుల్ మీద నేరుగా ఎగ్ వైట్ ను అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

5. పాలు

5. పాలు

పాలు చర్మానికి అప్లై చేసినప్పుడు స్మూతింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఒక కాటన్ ప్యాడ్ ను పాలలో డిప్ చేసి ఫోర్ హెడ్ మీద అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే, మంచి మొటిమలు మాయం అవుతాయి.

6. టీట్రీ ఆయిల్

6. టీట్రీ ఆయిల్

ఇది ఒక పురాతనపద్దతి, కొద్దిగా టీ ట్రీ ఆయిల్ ను నుదిటి పై అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ నేచురల్ ట్రీట్మెంట్ వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. బేకింగ్ సోడ

7. బేకింగ్ సోడ

బేకింగ్ సోడాలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దాంతో ఫోర్ హెడ్ లో మొటిమలు నివారించబడుతాయి. బేకింగ్ సోడాకు కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి ఫోర్ హెడ్ మీద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

8. ఐస్ క్యూబ్స్

8. ఐస్ క్యూబ్స్

నుదిటి మీద మొటిమలను నివారించుకోవడానికి ఐస్ క్యూబ్స్ ఒక ఐడియల్ రెమెడీ. చిన్న ఐస్ క్యూబ్స్ ను కవర్లో చుట్టి నుదిటి మీద అప్లై చేస్తే మొటిమలు మాయం అవుతాయి. ఇది ఒక బెస్ట్ నేచురల్ రెమెడీ.

9. కీరదోసజ్యూస్

9. కీరదోసజ్యూస్

కీరదోసకాయ రసాన్ని మొటిమల మీద అప్లై చేస్తే చాలా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి. ఈ కుకుంబర్ రసాన్ని రోజులో రెండు మూడు సార్లు అప్లై చేస్తే మంచిది.

English summary

9 Effective Home Remedies For Forehead Acne

Treat your forehead acne with the help of these effective home remedies. We have suggested the 9 best ones for you.
Story first published: Sunday, April 2, 2017, 9:15 [IST]
Desktop Bottom Promotion