ఫేషియల్ కప్పింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు!

Subscribe to Boldsky

అందమైన, ఆరోగ్యకరమైన, మెరిసిపోయే చర్మాన్ని పొందటానికి మనం మహిళలం ఎంతవరకైనా వెళ్తాం ఏమైనా చేస్తాం. ఈ డిమాండే ప్రతిరోజూ అందాల ప్రపంచంలో కొత్త విచిత్ర ట్రెండ్స్ ను సృష్టిస్తుంది. నిమిషాల్లో మీ చర్మాన్ని మెరిసిపోయేట్టుగా, తాజాగా మార్చే కొత్త విధానాల గురించి విన్నారా?

చింతించకండి!!!మీకు అన్నిటిగురించి వివరంగా తెలపడానికి, కొత్త విషయాలను అందించటానికి మేమున్నాం కదా. మీరు సురక్షితంగా మమ్మల్ని నమ్మి మీ అడుగులు ముందుకేయవచ్చు.

cupping

మీ ముఖంపై చర్మం చాలా సున్నితమైనది, చుట్టూ వాతావరణానికి,కాలుష్యానికి వెంటనే ప్రభావితమవుతుంది. ప్రతిరోజూ చేసే సిటిఎం రొటీన్ ఒక్కటే సరిపోదు. రోజంతా పనిచేసాక మన చర్మం నిర్జీవంగా, అలసిపోతుంది.

సమయం గడిచేకొద్దీ మన ముఖంపై చర్మం వదులైపోయి, ముడతలు పడి గీతలు కన్పిస్తాయి. అందంగా,మెరుస్తూ కన్పించాలనుకున్నా, తన సంరక్షణకి సమయం ఎక్కువగా ఉండని ఒక స్త్రీకి ఇది ఒక పీడకల. అందుకే ఇలాంటప్పుడే స్త్రీలు తమ ముఖచర్మాన్ని తిరిగి ప్రేమించే విధానాలు, చికిత్సలు వెతుకుతుంటారు.

cupping

మనలో చాలామంది స్త్రీలు తరచుగా స్పాలకి వెళ్ళి శరీరం మొత్తాన్ని విశ్రాంతి థెరపీలో పునరుజ్జీవం చేసుకుంటారు. అందంగా కన్పించటం అన్ని సమయాల్లో ముఖ్యమైనా, మనకి కొత్త రకం చికిత్సలు, కాలుష్యాన్ని, వయస్సుని తగ్గించే చికిత్సలు, అందమైన చర్మాన్ని పొందే చికిత్సలు ప్రయత్నించటం అంటే చాలా ఇష్టం.

ఇటీవలి కాలంలో స్పాలలో అన్నిరకాల విచిత్రమైన అందాల పద్ధతులని అడిగే స్త్రీల కోసం అన్ని పరికరాలు సిద్ధంగా ఉంటున్నాయి. ఇవి శుభ్రపర్చటం, తేటపర్చటం మరియు చర్మానికి జీవం అప్పటికప్పుడు ఇచ్చే అన్నిరకాల చర్మ పద్ధతులు.

మనందరికీ స్పాలలో ఏ సేవలు అందుబాటులో ఉంటాయో తెలిసినా, ఇటీవల వాటిలో చేరిన కొత్త పద్ధతి ఫేషియల్ కప్పింగ్.

cupping

ఫేషియల్ కప్పింగ్ అంటే ఏమిటి?

మార్కెట్లో కొత్తగా వచ్చిన అందాల పద్ధతి ఫేషియల్ కప్పింగ్. ఇది మురికి, జిడ్డు, కలుషిత రేణువులు అన్నిటినీ మీ చర్మగ్రంథుల నుంచి నిజంగానే పీల్చేస్తుంది. శరీరానికి ఎటువంటి గాయం లేకుండా జరిగే మేటి చికిత్స ఇది. చర్మాన్ని అలసట నుంచి దూరం చేసి,చర్మాన్ని గట్టిపరిచి ముడతలను తొలగిస్తుంది.

చర్మగ్రంథుల రూపాన్ని కూడా మార్చి, ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇది కొత్త విధానం కాకపోయినా, దాని ఫలితాల కారణంగా ఇటీవల ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది.

ఫేషియల్ కప్పింగ్ గూర్చి మొత్తం ముఖ్య సమాచారం

cupping

ఎలా పనిచేస్తుంది?

ఫేషియల్ కప్పింగ్ లో ముఖ చర్మంపై సక్షన్ కప్స్ పెడతారు. ఈ పద్దతిలో వ్యాక్యూమ్ ప్రభావవంతంగా తన పనిని పూర్తిచేస్తుంది. అది చర్మగ్రంథుల నుంచి మురికి, జిడ్డు అంతా లాగేస్తుంది. అది కండరాలను వదులు చేసి, రక్తప్రసరణ పెంచి, సక్షన్ వదిలినప్పుడు చర్మాన్ని గట్టిపరుస్తుంది.

గ్రంథుల నుంచి మురికి, దుమ్ము లాగేసాక, చర్మం తాజాగా, మెరుస్తుంది. రక్త ప్రసరణ పెరిగాక చర్మం ఛాయ,నునుపుదనం కూడా పెరుగుతుంది. ఈ పద్ధతి సరిగ్గా పాటిస్తే చాలా ప్రభావం చూపించి ఏ గుర్తులు కూడా ఉండవు. అన్ని చర్మరకాలపై ఇది సురక్షితమైనదే.

cupping

ఫేషియల్ కప్పింగ్ థెరపీ లాభాలు

ఎటువంటి గాయం చేయకుండా జరిగే విధానం అవటమే పెద్ద లాభం. ఈ అద్భుతమైన థెరపీ మరిన్ని ఆశ్చర్యకరమైన లాభాలను కింద చదవండి.

1) రక్తప్రసరణను పెంచుతుంది ; చర్మానికి రక్తప్రసరణ పెంచి నునుపుదనం పెంచి, ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది.

2) గ్రంథులను శుభ్రం చేస్తుంది ; ఫేషియల్ కప్పింగ్ చర్మగ్రంథులను శుభ్రపరచటం వలన, వివిధ క్రీములను, సిరంను లోపలి పొరల దాకా గాఢంగా వెళ్ళేట్లు చేసి ప్రభావవంతంగా పనిచేసేలా చేస్తుంది.

3) ముడతలను తగ్గిస్తుంది ; చర్మాన్ని నిండుగా మార్చి గీతలు, ముడతలను కన్పించనీయకుండా చేస్తుంది.

4) విషపదార్థాలను తొలగిస్తుంది ; చర్మం పైపొరకి పోషకాలను అందించి విషపదార్థాలను తొలగిస్తుంది.

అనేక ప్రసిద్ధ హాలీవుడ్ తారలు తమ అందమైన చర్మానికి కారణం ఫేషియల్ కప్పింగ్ అని చెప్పారు. ఈ చికిత్సకి డిమాండ్ పెరుగుతుండటం వలన విదేశాలలో దాదాపు అన్ని స్పాలు కూడా తమ వినియోగదారులకి ఈ సేవలు అందించటం మొదలుపెట్టారు.

మన దేశంలో కూడా,ఈ ట్రెండ్ మొదలైంది. మీ దగ్గర్లో ఉన్న స్పా ఈ సేవ అందించకపోతే, ఇంటివద్దనే చేసుకునే కిట్ లు ఆన్లైన్ లో దొరుకుతాయి. వాటిల్లో ఇంటివద్దనే స్టెప్ బై స్టెప్ ఎలా ఫేషియల్ కప్పింగ్ సౌకర్యంగా చేసుకోవచ్చో ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    All You Need To Know About Facial Cupping

    The skin on our face is very sensitive and most prone to environmental damage and pollution. Though all of us are aware of the various treatments available in spas, the latest in the market is facial cupping. Find out more on what this treatment is.
    Story first published: Thursday, December 14, 2017, 14:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more