For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి ఒక చిట్కా!

By Deepti
|

ఏదో ఒకరోజు మనందరం ముసలివాళ్ళమవుతాం. ఈ విషయం చిన్నపిల్లలకు కూడా ఎంతో కొంత తెలిసే ఉంటుంది. వృద్ధాప్యం జీవితంలో తప్పించుకోలేని ఒక విషయం! ఎవరో కొంతమంది జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు, కానీ ప్రతీప్రాణి ఏదో ఒకరోజు వయస్సు మీరి చనిపోవాల్సి వస్తుంది; అది సృష్తి ధర్మం.

కానీ, మనలో చాలామంది ఈ వృద్ధాప్య ప్రక్రియతో సంతోషంగా ఉండరు; ఇది కూడా ఒక సహజ ప్రక్రియ అయినా, దానిని ఒప్పుకోరు. యవ్వనం అనేది ఒక అందమైన వరం.

చర్మంపై సన్నని గీతలు, ముడతలు చూసి మనలో చాలామంది నిరాశ చెందుతారు కదా? జుట్టు నెరసిపోతుంటే ఎవరికి నచ్చుతుంది! యవ్వనంలో ఉన్నవారికి అధికశక్తి ఉండి, ఆకర్షణీయంగా ఉంటారు. అందుకని సహజంగానే అందరికీ వృద్ధాప్య ఛాయలంటే భయం వేసి, దాన్ని ఎలా ఐనా దూరంగా ఉంచాలనుకుంటారు.

home remedies

వైద్య సాంకేతిక రంగాల్లో పురోగతితో బొటోక్స్, ఫేస్ లిఫ్ట్, వక్షోజాలను సరిచేయుట మొదలైన పద్ధతులు కొత్తగా వచ్చి, అనేక మందికి ముసలితనాన్ని వాయిదా వేయడానికి సహాయ పడుతున్నాయి!

కానీ ఇలాంటి పద్ధతులు చాలా నొప్పిని, బాధను కలిగిస్తాయి. ఖర్చు కూడాను. అంతే కాక, అనేక సైడ్ ఎఫెక్ట్ లతో మీ అందాన్ని శాశ్వతంగా పాడుచేయగలవు!

అందుకని, మీరు యవ్వనంతో ఎక్కువసేపు జీవించాలనుకుంటే, ఈ సహజ చిట్కాలతో వృద్ధాప్యాన్ని వాయిదా వేయండి:

కావలసిన వస్తువులు:

  • పాలకూర రసం -సగం గ్లాసు
  • తాజా నేరేడు రసం- సగం గ్లాసు
home remedies

ఈ సహజ చిట్కా వల్ల వయస్సు మీరటం నెమ్మదిస్తుంది. ఇది తరచుగా వాడటం వల్ల మెరుగైన ఫలితాలు కన్పిస్తాయి. ఈ చిట్కాను పాటించడంతో పాటు, సరిగా తింటూ, వ్యాయామం కూడా చేయడం అవసరం. వ్యాయామం వల్ల కండరాలు గట్టిపడి, మీరు యవ్వనంతో ఎక్కువకాలం ఉండగలుగుతారు.

కణాల వయస్సు పెరగటంతో ఆరోగ్యకర ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎంత పోషకాహారం తీసుకుంటే, అంత మెల్లిగా మీ కణాలు ఎదిగి, మీ యవ్వనం నిలబడుతుంది.

పాలకూరలో ఐరన్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉండి ఆరోగ్యకరమైన కణాలకు శక్తినందిస్తాయి; తద్వారా అవి ఎక్కువకాలం ఉంటాయి. కణాలు నెమ్మదిగా వయస్సు మీరినప్పుడు, వృధ్ధాప్య లక్షణాలు కూడా మందగిస్తాయి.

home remedies

నేరేడు పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువుండి, అవి శరీరంలో కొత్త రక్తకణాలను రూపొందించటంలో సాయపడతాయి. కణాల సంఖ్య తగ్గకుండా జాగ్రత్త చేసి మీలో వృద్ధాప్య ఛాయలు ఎక్కువకాలం రానీయకుండా సాయపడతాయి.

తయారీ విధానం

  • ఒక గ్లాసులో పాలకూర, నేరేడు రసాలను వేయండి
  • రెండింటినీ బాగా కలపండి
  • ఈ రసాన్ని ప్రతి ఉదయం అల్పాహారం తినక ముందుగానే తీసుకోండి.
  • దీన్ని మీరు ఎంతకాలం కావాలనుకుంటే అంతకాలం తీసుకోవచ్చు.

English summary

Ancient Home Remedy That Can Slow Down The Ageing Process!

if you want to look youthful for a longer time, slow down your ageing process with this natural remedy.
Desktop Bottom Promotion