వృద్ధాప్య లక్షణాలను కనబడకూడదనుకుంటే, ఈ నూనెలు చర్మానికి రాసి, మర్ధన చేయండి

Posted By: Mallikarjuna d
Subscribe to Boldsky

వయస్సైయిందని ఎప్పుడు తెలుస్తుంది,?వృద్ధాప్యం వచ్చినప్పుడు. అదెలా తెలుస్తుంది అంటే శరీరంలో ముఖ్యంగా చర్మంలో మార్పులు వచ్చినప్పుడు. అయితే చిన్న వయస్సులోనే చర్మంలో మార్పులు కనిపిస్తే దాన్ని యాంటీ ఏజింగ్ సమస్యలు అనిపిస్తుంటారు. చిన్న వయస్సులోని వయస్సు అయినట్లు కనబడటానికి అనేక కారణాలున్నాయి. కారణాలు ఏవైనా, అలా కనిపంచడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అలా ఉండకూడదంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. అలాంటి ప్రయత్నాల్లో ఈ మద్య కాలంలో నూనెలు, బాడీ మసాజ్ ఆరోమా నూనెలు బాగా పాపులర్ అయ్యాయి, కొ్ంత మంది స్కిన్ కేర్ ఎక్స్ పర్ట్స్, బ్యూటీ బ్లగ్గర్స్ ఈ నూనెల్లో ప్రయోజనాలను తెలుపుతులున్నారు. .

చర్మ సంరక్షణ కోసం వివిధ రకాల నూనెలను ఉపయోగించుకోవచ్చు. వాటిలో బాగా పాపులర్ అయినవి యాంటీఏజింగ్ ఎసెన్షియల్ ఆయిల్. ఈ నూనెలు వృద్ధాప్య లక్షణాలను కనబనివ్వకుండా చేస్తాయి.

వృద్ధాప్యం ఎదుర్కొనే టాప్ 10 యాంటీ ఏజింగ్ డైట్ టిప్స్

ఈ నూనెల ప్రత్యేకత ఏంటంటే, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. వృద్ధాప్య లక్షణాలను ఎఫెక్టివ్ గా తగ్గించడంలో , వృద్ధాప్య లక్షణాలకు కారణమయ్యే చర్మంలోని ముడుతలను , చారలను మాయం చేయడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

anti ageing oils for skin care

వృద్ధాప్య ఛాయలు చర్మంలో కనబడకుండా ఉండాలంటే ఈ రోజు బోల్డ్ స్కై మీకోసం కొన్ని యాంటీ ఏజింగ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ను పరిచయం చేస్తున్నది. ఇవి చర్మానికి హాని చేసి ఫ్రీరాడికల్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ నూనెలు చర్మంలో ముడుతలను, చారలను తొలగించి, స్కిన్ ఎలాసిటిని మెరుగుపరుస్తాయి.

వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసే ఫేస్ ప్యాక్స్

మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రత్యేకమైన నూనెలు గురించి తెలుసుకుందామా...

గమనిక : ఈ నూనెలను ఉపయోగించే ముందు బాగా షేక్ చేసి, చర్మం మీద ఒక మూలన ప్యాచ్ టెస్ట్ చేసుకుని, మీ చర్మానికి నప్పేవాటిని ఎంపిక చేసుకోవాలి.

1. జోజోబ ఎన్షెషియల్ ఆయిల్

1. జోజోబ ఎన్షెషియల్ ఆయిల్

జోజోబ ఎసెన్షియల్ ఆయిల్ లో వృద్ధాప్య సంకేతాలతో పోరాడే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి చర్మంలోని ముడుతలను, చారలను పోగొడుతాయి. అంతే కాకుండ, ఇవి చర్మం యొక్క ఎలాసిటిని పెంచుతుంది. చర్మం వదులు కాకుండా నివారిస్తుంది. దీన్ని కొబ్బరి నూనెతో మిక్స్ చేసి, చర్మం మొత్తానికి అప్లై చేసిసున్నితమైన మసాజ్ చేయడం వల్ల ఏజింగ్ లక్షణాలను సులభంగా పోగొడుతుంది.

2. హలిచ్రిసమ్ ఎసెన్షియల్ ఆయిల్

2. హలిచ్రిసమ్ ఎసెన్షియల్ ఆయిల్

హెలిచ్రిసమ్ ఎసెన్షియల్ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి, అంతే కాదు వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. అందుకే దీన్ని యాంటీ ఏజింగ్ క్రీమ్ లలో ఉపయోగిస్తుంటారు. సింపుల్ గా దీన్ని ఆలివ్ ఆయిల్ తో కలిపి ఫేషియల్ మాస్క్ వేసుకోవడం ద్వారా యంగ్ లుక్కింగ్ స్కిన్ తో కనబడుతారు.

3. మిర్హే ఎసెన్షియల్ ఆయిల్

3. మిర్హే ఎసెన్షియల్ ఆయిల్

మరో రిమార్కబుల్ ఎసెన్షియల్ ఆయిల్ ఇది, ఇది చర్మం మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, చర్మంలోని ఫ్రీరాడికల్స్ మీద పోరాడి, ఏజింగ్ లక్షణాలను కనబడనివ్వకుండా చేస్తుంది. దీన్ని వారానికొకసారి అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

4. దానిమ్మ నూనె

4. దానిమ్మ నూనె

మరో న్యూట్రీషియన్ ఆయిల్ ఇది. వృద్ధాప్య లక్షణాలను నివారించడంలో ఈనూనె గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే కాంపౌండ్స్ చర్మంలోని ముడుతలను తొలగించి స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది., ఈ నూనెను మరో రెగ్యులర్ నూనెతో కలిపి చర్మానికి అప్లై చేస్త మంచి ఫలితం ఉంటుంది.

5. జరేనియం ఎసెన్షియల్ ఆయిల్

5. జరేనియం ఎసెన్షియల్ ఆయిల్

జరేనియం ఎసెన్షియల్ ఆయిల్లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది మరో ఏజ్ డిఫైనింగ్ ఎసెన్షియల్ ఆయిల్.దీన్నీ రెగ్యులర్ స్కిన్ కేర్ కోసం ఉపయోగించుకోవచ్చు. యంగర్ లుక్కింగ్ స్కిన్ పొందుతారు. కేవలం, ఈ నూనెను కాంబినేషన్ నూనెతో మిక్స్ చేసి, ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

6. ఫ్రాంకిన్సెస్ ఎసెన్షియల్ ఆయిల్

6. ఫ్రాంకిన్సెస్ ఎసెన్షియల్ ఆయిల్

ఈ నూనె వృద్ధాప్య లక్షణాలను న్యాచురల్ గా ఆలస్యం చేయగలదు. ఈ నూనెలో కూడా యాంటీఆక్సిడెంట్స్, ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అన్ని రకాల చర్మ తత్వాలకు సూట్ అవుతుంది, ఈ నూనెను మరో రెగ్యులర్ నూనెతో కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల యూత్ ఫుల్ స్కిన్ పొందుతారు .

7. ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

7. ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే బ్యూటీ బెనిఫిట్స్ వల్ల చాలా పాపులర్ అయింది. స్కిన్ బెనిఫిటింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ కు పవర్ హౌస్ వంటిది. వృద్ధాప్యంకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ నుండి చర్మం డ్యామేజ్ కాకుండా నివారించి వృద్ధాప్యంను ఆలస్యం చేస్తుంది. కొన్ని చుక్కలు ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను రెగ్యులర్ నూనెతో మిక్స్ చేసి ముఖానికి మాస్క్ వేసుకోవాలి.

8. రోజ్మెర్రీ ఎసెన్షియల్ ఆయిల్

8. రోజ్మెర్రీ ఎసెన్షియల్ ఆయిల్

లాస్ట్ ఎసెన్షియల్ ఆయిల్, చాలా రకాల స్కిన్ కేర్ లో ఈ నూనెను ఫేవరెంట్ నూనెగా ఉపయోగిస్తారు. ఈ నూనెను చర్మానికి అప్లై చేయడం వల్ల యంగ్ గా కనబడుతారు. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను తొలగించి, మొత్తం చర్మం రంగును, చర్మ తత్వాన్ని మెరుగుపరిచి వృద్ధాప్యం లక్షణాలు కనబడనివ్వకుండా చేస్తుంది.

English summary

Best Anti-ageing Essential Oils You Can Include In Your Skin Care Routine

There are several reasons as to why one should include the essential oils in the skin care routine. Read on to know more.