For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ హోమ్ రెమెడీస్ తో పింపుల్ బ్రేక్ అవుట్స్ ని సులభంగా పోగొట్టవచ్చు!

By Ashwini Pappireddy
|

మన యుక్తవయసులో మొటిమలు రావడం సర్వ సాధారణం. ఈ మొటిమలతో పాటు మచ్చలు రావడం, వయస్సుతో పాటు అవి కూడా పోతాయని అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ, మనలో చాలామంది ఇదే సమస్యని 20 ఏళ్ల నుండి 30 ఏళ్ళ మధ్య వయస్సు గల వారు పేస్ చేస్తున్నారు.

మీ చర్మంలోని నూనె గ్రంధులు ఎక్కువ అయి మరియు రంధ్రాలను మూసివేసేటప్పుడు ఈ వికారమైన బ్రేఅకౌట్స్ ఏర్పడుతాయి. అధిక ఆయిల్ తో పాటు,చర్మంలోని మృత కణాలు, విషపదార్ధాలు మరియు మలినాలను కూడా చర్మపు రంధ్రాలను అడ్డుకోవచ్చు, దానివల్లనే ఈ మొటిమలు ఏర్పడవచ్చు.

<strong>15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై</strong>15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై

అటువంటి బ్రేఅకౌట్స్ ని ఎదుర్కోడానికి, మీరు స్పాట్ ట్రీట్మెంట్లను తీసుకోవచ్చు లేదా అందరికి అందుబాటులో వున్న ఎంతో చవకైన మరియు సమర్థవంతమైన హోమ్ రెమెడీస్ ని వాడవచ్చు.

Beat Pimple Breakouts With These Home Remedies

హోమ్ రెమెడీస్ ని వుపయోగించి ఈ సమస్యని తొలగించవచ్చా లేదా మళ్ళీ పునరావృతం కాకుండా నివారించడం సాధ్యమేనా అని ఆలోచిస్తున్నారా? మనలో చాలామంది ఈ ఆలోచనతో వుంటారు. కాబట్టి మీకోసం ఈ హోమ్ రెమెడీస్ గురించి తెలియజేయాలనుకుంటున్నాము. ఈ రోజు మేము మొటిమలు, మొటిమలతో వచ్చిన రంద్రాలను పోగొట్టడానికి ఉపయోగపడే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి అవేంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

ఈ సాంప్రదాయ హోమ్ రెమెడీస్ రంధ్రాల విభజన మరియు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయగలవు. మొటిమల సమస్యని పోగొట్టడానికి వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి చదవడం కంటిన్యూ చేయండి.

<strong>ముఖంలో మొటిమలు పోవాలంటే సింపుల్ టిప్స్ !</strong>ముఖంలో మొటిమలు పోవాలంటే సింపుల్ టిప్స్ !

గమనిక: మొటిమల చికిత్స కోసం మీరు ఉపయోగించాలనుకుంటున్న క్రింది హోమ్ రెమెడీస్ ని వాడటానికి ముందు టెస్ట్ చేసి చేయవలసిందిగా మీకు తెలియజేస్తున్నాము.

1. ఆపిల్ సైడర్ వినెగార్

1. ఆపిల్ సైడర్ వినెగార్

యాపిల్ సైడర్ వినెగార్ లోని ఆమ్ల స్వభావం మొటిమల బ్రేక్అవుట్లకు చికిత్స చేయడానికి ఇది ఒక అద్భుతమైన పరిహారం గా చెప్పవచ్చు. ఈ చర్మ సంరక్షణ పదార్ధం ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాను చంపి, రంధ్రాల నుండి బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

1 టీస్పూన్ స్వేదనజలంతో (కాచి వడకట్టి చల్లార్చిన నీరు) 2 చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలపండి. ఇలా తయారుచేసిన మిశ్రమంలో కాటన్ ని ముంచి మొటిమల బ్రేఅకౌట్స్ వున్న ప్రాంతంలో అప్లై చేయండి. ఈ సమస్యని అధికమించడానికి దీనిని వారానికి 3-4 సార్లు ఉపయోగించండి.

2. ఐస్ క్యూబ్స్

2. ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి మరియు మృత కణాలని బయటకి పంపించడం ద్వారా గట్టిగా-శుభ్రమైన రంధ్రాలను పొందడంలో మీకు సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

శుభ్రమైన తడిగుడ్డలో కొన్నిఐస్ క్యూబ్స్ ని ఉంచి ప్రభావిత ప్రాంతం లో ఉంచండి. చల్లటి నీటితో మీ చర్మాన్ని కడుక్కోవటానికి ముందు కొద్ది నిమిషాలు గట్టిగా నొక్కండి. ఈ చర్మ సమస్యను ఎదుర్కొనేందుకు రోజంతా దీన్ని రిపీట్ చేయండి.

3.బేకింగ్ సోడా

3.బేకింగ్ సోడా

బేకింగ్ సోడా ఆంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగివుంటుంది, ఇది చర్మ సంరక్షణ పదార్ధం గా పేరుపొందింది మొటిమల బ్రేఅకౌట్స్ ని తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

½ టీస్పూన్ నీటితో బేకింగ్ సోడా ఒక చిటికెడు కలపాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో 5 నిముషాల పాటు వుంచి తరువాత, చల్లని నీటితో కడిగేయండి.

4.ఫుల్లర్స్ ఎర్త్

4.ఫుల్లర్స్ ఎర్త్

ఫుల్లర్ యొక్క మట్టి అనేది చర్మ సమస్యలకి అద్భుతమైన ఫలితాలను అందించే అనామ్లజనకాలతో నిండిన పురాతనమైన పద్దతి. ఈ పురాతన పద్ధతిని ఉపయోగించి రంద్రాలలో వున్న చెడుని బయటకు తీసి, భవిష్యత్తులో మొటిమ బ్రేక్ఔట్లను రాకుండా నివారించవచ్చు.

ఎలా ఉపయోగించాలి:

రోజ్ వాటర్ లో ఫుల్లర్ మట్టిని కలిపి, మచ్చలున్న ప్రాంతంలో పూయాలి.10 నిమిషాలపాటు దానిని ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఈ సమస్య కి చికిత్స చేయడానికి వారంలో 2-3 సార్లు దీనిని ఉపయోగించండి.

5. ఎప్సోమ్ సాల్ట్

5. ఎప్సోమ్ సాల్ట్

శోథ నిరోధక లక్షణాలతో నిండి వున్న, ఎప్సోమ్ ఉప్పు మరొక అద్భుతమైన హోమ్ రెమెడీ.ఇది మొటిమల మూలాల నుండి శుభ్రం చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

1 టీస్పూన్ గులాబీ నీటి లో చిటికెడు ఉప్పుని కలిపాలి. దీనిని మొటిమలు వున్న ప్రాంతంలో అప్లై చేసి 3-4 నిముషాలు ఆరనివ్వండి.కాసేపటి తరువాత చల్లని నీటితో శుభ్రం చేయండి. మొటిమల బ్రేక్అవుట్లను తొలగించడానికి దీనిని వారానికి ఒకసారి ఉపయోగించాలి.

6. టీ ట్రీ ఆయిల్

6. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ లో ఆంటీ బాక్ట్రయల్ మరియు ఎక్సఫోలియాటింగ్ లక్షణాల తో నిండివుండటం వలన, ఇది మీ చర్మం యొక్క ఉపరితలంలో పేరుకున్న బాక్టీరియాని సమర్థవంతంగా నాశనం చేయగలదు మరియు రంధ్రాలపై అడ్డుపడే మలినాలను నిరోధిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

2 చుక్కల టీ ట్రీ ఆయిల్ ను ½ టీస్పూన్ కొబ్బరి నూనె తో కలపాలి.మొటిమల ప్రాంతంలో అప్లై చేసి 3-4 నిమిషాల తరువాత, చల్లని నీటితో కడగాలి. మొటిమలు లేని చర్మాన్ని మీ సొంతం చేసుకోవడానికి దీనిని వారానికి ఒకసారి ఉపయోగించండి.

7. పసుపు పౌడర్

7. పసుపు పౌడర్

మరొక చర్మ సంరక్షణ పదార్థంగా కొన్ని శతాబ్దాలుగా పిలవబడుతున్న పసుపులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ కి గొప్ప మూలం, ఇది మీ చర్మం లోపలి పొరల నుండి ఆరోగ్యంగా చేస్తుంది మరియు రంధ్రాల మరియు విషాల నిర్ములించడంలో ఉపయోగపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

1 టీస్పూన్ గులాబీ నీటితో ఒక చిటికెడు పసుపు పొడిని కలపాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో దీనిని అప్ప్లైచేసి అక్కడ 5 నిముషాల పాటు ఉంచిన తరువాత, మీ చర్మం శుభ్రం చేయడానికి చల్లని నీరు ఉపయోగించండి. మీ చర్మపు సమస్యను పోగొట్టుకోవటానికి ఈ ప్రత్యేకమైన రెమెడీ ని ప్రతిరోజూ ప్రతివారం వాడవచ్చు.

8. పాలు

8. పాలు

పాలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది మీ చర్మాన్ని రక్షిస్తుంది మరియు ఇది సమర్థవంతమైన పద్ధతిలో వికారమైన మొటిమలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి:

చల్లని పాలను సమస్యాత్మక ప్రాంతాలలో అప్లై చేయాలి. చల్లటి నీటితో శుభ్రం చేయడానికి 10 నిమిషాల పాటు మీ చర్మం యొక్క ఉపరితలంపై వుండేలా చూసుకోండి. గుర్తించదగ్గ ఫలితాలను పొందడానికి ఈ రరెమెడీ ని వారానికి 3-4 సార్లు ప్రయత్నించండి.

English summary

Beat Pimple Breakouts With These Home Remedies

For combating such breakouts, you can either use commercial spot treatments or just try out inexpensive and effective home remedies that have been around for ages.
Desktop Bottom Promotion