For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అశ్వగంధ వల్ల చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు

By :lalitha Lasya Peddada
|

అశ్వగంధ - ఈ ఔషధీయ వనమూలిక వైద్య ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ఇండియన్ జిన్సెంగ్ లేదా అశ్వగంధ అనే ఈ ఔషధ మొక్క ప్రత్యేకంగా కనిపించకపోయినా చిన్నగా కేవలం 35 నుండి 75 సెంటీమీటర్ల పొడవు మాత్రమేనున్నా తనలోనున్న ఔషధ విలువలతో మానవజాతికి ఎంతో సహాయపడుతోంది. చక్కటి ఔషధ విలువలు కలిగిన అశ్వగంధ యొక్క బెర్రీలు అలాగే వేర్లు ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగపడతాయి.

యాంటీఆక్సిడాంట్ పుష్కలంగా కలిగిన అశ్వగంధలో రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణం కలదు. ఆంతే కాదు, నిద్రలేమి సమస్యను తొలగించడంతో పాటు ఒత్తిడిని తొలగించడానికి కూడా అశ్వగంధ సహాయపడుతుంది. ఇంకా అశ్వగంధలో యాంటీకాంవాల్సన్ట్ తో పాటు యాంటీబాక్టీరియల్ ప్రాపర్టీస్ కలవు. అన్ని రకాల వ్యాధులకు ఈ ఔషధ మూలిక అద్భుతంగా పనిచేస్తుంది.

అశ్వగంధ అంటే ఏంటి?

'వితానియా సోమ్నిఫెరా' అనేది అశ్వగంధ యొక్క శాస్త్రీయ నామం. అయితే, సర్వసాధారణంగా ఈ మూలికను 'ఇండియన్ జింసెంగ్' లేదా 'ఇండియన్ వింటర్ చెర్రీ' అనంటారు.

అశ్వగంధ ప్రధానంగా ఇండియాలోని మధ్యప్రదేశ్ లోని మండాసర్ డిస్ట్రిక్ట్, సింధ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ మరియు కేరళ వంటి పొడి ప్రాంతాల్లో పండించబడుతుంది. ఇండియాతో పాటు నేపాల్, చైనా, యెమెన్ వంటి ప్రదేశాలలో కూడా అశ్వగంధ సాగు చేయబడుతుంది.

Beauty Benefits of Ashwagandha


ఇప్పుడు ఈ మూలికతో ఆయుర్వేదానికి ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం.

ఆయుర్వేదంలో అశ్వగంధ
అశ్వగంధ యొక్క ఆకులూ, పళ్ళు,విత్తనాలు అలాగే వేర్లు వివిధ ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఆయుర్వేదా(భారతదేశం యొక్క సంప్రదాయ ఔషధ వ్యవస్థ)లో అశ్వగంధ అనేది అతి ముఖ్యమైన మూలిక. ఈ ఔషధ మూలికను దాదాపు వేయేళ్ల క్రితం నుంచి ఆయుర్వేద వైద్య ప్రపంచంలో వాడుతున్నారు.

శారీరక అలాగే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ అదే సమయంలో మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఏదైనా మూలికను రసాయనంగా పేర్కొనవచ్చు. ఇండియాలో లభించే రసాయన మూలికలతో అశ్వగంధ ప్రధానమైనది. దీనిని సాత్విక కఫ రసాయనంగా పేర్కొంటారు.

అశ్వగంధని ఎందుకు వాడతాము?

అశ్వగంధ వల్ల కలిగే ఉపయోగాలు అనేకం. మేధాశక్తిని పెంపొందించడంలో పాటు ఈ ఔషధ మూలికలో నాడీవ్యవస్థను మెరుగుపరిచే లక్షణం కూడా కలదు. అలాగే జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో అశ్వగంధ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో ఈ మూలికకు పునరుత్పత్తి అలాగే ఆరోగ్యకరమైన లైంగిక సమతుల్యం కలించే సామర్థ్యం కలదు.

శరీరానికి ఒత్తిడి తట్టుకునే శక్తిని అందించే సామర్ధ్యం కలదు. అదే విధంగా తెల్ల రక్త కణాలను బాలన్స్ చేయడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం అశ్వగంధలో కలదు.

అంతే కాదు, అశ్వగంధలో లభించే ముఖ్యమైన యాంటీఆక్సిడాంట్ మిమ్మల్ని సూర్యరశ్మి వలన కలిగే విషపూరిత ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి రక్షించి తద్వారా వేగంగా వృద్ధాప్యం చెందడం నుంచి రక్షిస్తుంది.

ఈ మూలిక ద్వారా కలిగే అద్భుతమైన బ్ప్రయూటీ ప్యోరయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అశ్వగంధ వలన చర్మానికి కలిగే లాభాలు:

అశ్వగంధ వలన చర్మానికి కలిగే లాభాలు:

మృదువైన, మెత్తటి, కాంతివంతమైన చర్మాన్ని కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే, అశ్వగంధ మీకు ఎంతగానో సహకరిస్తుంది. ప్రస్తుతం మీకున్న చర్మ సమస్యల గురించి మీరు బాధపడడం పక్కనుని అశ్వగంధ అందించే అద్భుతమైన చర్మ సంరక్షణ విషయాల గురించి తెలుసుకోండి. మీ చర్మ సంబంధమైన సమస్యలన్నిటికీ అశ్వగంధ చక్కటి పరిష్కారం.

నల్లటి మచ్చలు, ముడతల నుంచి మీకు విముక్తి లభిస్తుంది.

నల్లటి మచ్చలు, ముడతల నుంచి మీకు విముక్తి లభిస్తుంది.

ఇంతకు ముందు చెప్పినట్లుగా, అశ్వగంధలో యాంటీఆక్సిడాంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల, సూర్యుని నుండి వెలువడే హానికర యూవీ రేడియేషన్ వలన కలిగే ఫ్రీ రాడికల్ డేమేజ్ ను ఎదుర్కొనడానికి అశ్వగంధ తోడ్పడుతుంది. అందువలన, ఇబ్బందికరమైన నల్లటి మచ్చలు, ముడతల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. అదనంగా, స్కిన్ కాన్సర్ నుంచి కూడా మిమ్మల్ని ఈ అద్భుతమైన మూలిక రక్షిస్తుంది. అశ్వగంధ పేస్ ప్యాక్ ద్వారా మీరు యాంటీ-యాజింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక టీస్పూన్ అశ్వగంధ పొడిని తీసుకుని దానిలో కొంత రోజ్ వాటర్ ను కలిపి పేస్ట్ లా చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ఫేస్ మాస్క్ లా అప్లై చేసుకుని పదిహేను నిమిషాల వరకు ఉంచండి. ఆ తరువాత చల్లటి నీటితో ఫేస్ మాస్క్ ని తీసేయండి.

గాయం మానుటకు తోడ్పడుతుంది:

గాయం మానుటకు తోడ్పడుతుంది:

గాయాలను మ్రాన్పడంలో అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి అప్లై చేసిన తరువాత, అశ్వగంధ మూలికలో నున్న ఔషధ విలువలు గాయాన్నితగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందుకు మీరు చేయవలసిందల్లా, అశ్వగంధ వేర్లని తరిగి మెత్తగా రుబ్బి ఉంచాలి. ఇప్పుడు పరిశుద్ధమైన నీటితో అశ్వగంధ పొడిని కలిపి మృదువైన పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. అశ్వగంధ పొడికి బదులుగా అశ్వగంధ నూనెను కూడా మీరు వాడుకోవచ్చు.

కెరాటాసిస్ ను తగ్గిస్తుంది:

కెరాటాసిస్ ను తగ్గిస్తుంది:

ఆయుర్వేద ఔషధ వ్యవస్థలో అశ్వగంధను కెరాటిస్ ను తగ్గించేందుకు వాడతారు. కెరోటిస్ సమస్య కలిగిన రోగి యొక్క చర్మంలో కేరాటిన్ వృద్ధి ఉండడం వల్ల వారి చర్మం పొడిగా గరుకుగా ఉంటుంది. ఇది కాన్సర్ కరకం కాకపోయినా ఈ సమస్యతో చర్మం సహజసిద్ధమైన కాంతిని కోల్పోతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే దాదాపు మూడు గ్రాముల అశ్వగంధపొడిని నీళ్లతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది:

కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది:

అధిక ఒత్తిడికి గురయితే రక్తంలోని కార్టిసాల్ స్థాయి అధికమవుతుంది. తద్వారా చర్మ సౌందర్యానికి నష్టం కలుగుతుంది. కార్టిసాల్ అధిక ఉత్పత్తి వల్ల చర్మ సంరక్షణకు అవసరమయ్యే ప్రోటీన్ల వృద్ధి తిరిగిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం, కార్టిసాల్ అధిక ఉత్పత్తిని అరికట్టడంలో అశ్వగంధ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది:

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది:

అశ్వగంధలో లభించే కొన్ని స్టెరాయిడల్ కాంపౌండ్స్ శరీరంలోని ఈస్ట్రోజన్ స్థాయిలను పెంపొందిస్తాయి. తద్వారా చర్మ కాంతిని పెంపొందించడం అలాగే యవ్వనంగా కనిపించడానికి కొలాజెన్ ఉత్పత్తిని పెంపొందించడం జరుగుతుంది. వీటితో పాటు చర్మంలోని సహజ సిద్ధమైన నూనె ఉత్పత్తి సమతుల్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

స్కిన్ టోనర్ గా అశ్వగంధ:

స్కిన్ టోనర్ గా అశ్వగంధ:

టోనర్ అనేది మహిళల స్కిన్ కేర్ రొటీన్ లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అన్నిటికంటే ముందు, చర్మంపై రంధ్రాలను కుదించి, శుభ్రపరచడానికి కూడా అశ్వగంధ ఉపయోగపడుతుంది. అశ్వగంధ అద్భుతమైన స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. మీరు చేయవలసిందల్లా ఎండిన రెండు స్పూన్ల అశ్వగంధ వేర్ల పొడిని అలాగే 1 టీస్పూన్ స్పూన్ ఎండిన నిమ్మతొక్కల పొడిని 200 ఎంఎల్ నీటితో కలిపి ఉడకపెట్టండి. ఆ తరువాత ఫిల్టర్ చేసి ఆ నీటిని శుభ్రమైన సీసాలో భద్రపరచి స్కిన్ టోనర్ గా వాడుకోవాలి.

చర్మ వాపులను తగ్గిస్తుంది:

చర్మ వాపులను తగ్గిస్తుంది:

అశ్వగంధలో యాంటీఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికం. వితనోలైడ్స్ అనే కాంపౌండ్స్ అశ్వగంధాలో అధికంగా ఉన్నాయి. ఈ కాంపౌండ్స్ వల్ల ఇంఫ్లమేషన్ ను కలిగించే హానికర బాక్టీరియా యొక్క పెరుగుదలను అడ్డుకోవచ్చు.

English summary

Beauty Benefits of Ashwagandha

Beauty Benefits of Ashwagandha. Read to konw more about.....
Story first published:Sunday, December 3, 2017, 17:56 [IST]
Desktop Bottom Promotion