డ్రై స్కిన్ కు చెక్ పెట్టి, ముఖం కాంతివంతంగా..సాప్ట్ గా మెరిపించుకోవడానికి వెన్నపూత..!!

Posted By:
Subscribe to Boldsky

చర్మం పొడిగా మారి, నిర్జీవంగా తయారైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మనకు ఇంటిలో అందుబాటులో ఉండే వెన్న సాయంతో పొడి చర్మ సమస్య నుండి విజయవంతంగా బయట పడవచ్చు.

చర్మాన్ని మృదువుగా మార్చే పదార్థాల్లో వెన్న కూడా ఒకటి. పొడి చర్మానికి తేమనందించి.. మృదువుగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వెన్నలో ఫ్యాటీఆమ్లాలూ, విటమిన్‌ 'ఎ' సమృద్దిగా ఉండుట వలన చర్మానికి తేమ మరియు కాంతి వస్తుంది. చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. ఇంకా మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

Beauty Benefits Of Body Butter

వెన్నను వివిధ రకాలుగా మనకు అందుబాటులో ఉంటుంది. కోక బట్టర్, మ్యాంగో బటర్, షీ బటర్, కుక్కీ బటర్ మొదలగునవి కోక బట్టర్ ను కోక సీడ్స్ తో తయారుచేస్తుంది. ఇది చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

మ్యాంగో బటర్ ను మాడివిత్తనాలతో తయారుచేస్తారు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటన్నింటిలోకి స్వచ్చమైన ఆవు పాలతో తయారుచేసి బాడీ బట్టర్ (వెన్న)ను చర్మానికి అప్లై చేస్తే పొందే ప్రయోజనాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

చర్మానికి రక్షణ కల్పిస్తుంది:

చర్మానికి రక్షణ కల్పిస్తుంది:

బాడీ బటర్ నార్మల్ క్రీములు, లోషన్స్ కంటే చిక్కగా ఉంటుంది. దాంతో చర్మంలోకి బాగా ఇంకుతుంది. చర్మానికి కావల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. కాలుష్యం వల్ల మన చర్మంలో జరిగే అనేక మార్పులకు చెక్క పెట్టడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డ్రై ఎయిర్, కోల్డ్ వెదర్, హాట్ సీజ్ ఇలా అన్ని సమయాల్లో వెన్న చర్మ సంరక్షణకు సహయపడుతుంది.

చర్మం సాప్ట్ గా చేస్తుంది:

చర్మం సాప్ట్ గా చేస్తుంది:

రోజూ చర్మానికి వెన్న రాస్తుంటే, కొద్ది రోజుల తర్వాత గమనించినట్లైతే చర్మం పాస్ట్ గా మారుతుంది. వెన్నలో ఉండే ఫ్యాటీఆమ్లాలూ, విటమిన్‌ ‘ఎ' వంటివి డ్రై స్కిన్ నివారిస్తుంది. చర్మం సాస్ట్ గా మార్చుతుంది. ఎగ్జిమాతో బాధపడే వారికి ఇది ఒక గ్రేట్ రెమెడీ అని చెప్పవచ్చు. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంలో పిహెచ్ వ్యాల్యు పెరగుతుంది. హెల్తీ గ్లోయింగ్ స్కిన్ పెంచుతుంది.

డీప్ గా హైడ్రేషన్ అందిస్తుంది:

డీప్ గా హైడ్రేషన్ అందిస్తుంది:

వెన్నను రోజూ చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంలోపలి వరకూ హైడ్రేషన్ అందిస్తుంది. చర్మంలో లోపలి వరకూ మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది. దాంతో చర్మానికి కావల్సిన తేమ అంది, చర్మం సాప్ట్ గా మారుతుంది. అన్ని సీజన్స్ లో వెన్నను చర్మానికి ఉపయోగించుకోవచ్చు. దాంతో చర్మం హైడ్రేషన్ లో ఉంటుంది. వెన్నలో ఉండే క్రీమి, న్యూరిషింగ్ స్ట్రక్చర్ వల్ల స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది.

లిప్ బామ్ లా పనిచేస్తుంది:

లిప్ బామ్ లా పనిచేస్తుంది:

వెన్నను లిప్ బామ్ గా కూడా ఉపయోగిస్తుంటారు. వెన్నను శరీరానిమొత్తానికి అప్లై చేయొచ్చు అదే విధంగా పెదాలకు కూడా అప్లై చేయొచ్చు. పెదాలకు వెన్న రాసినప్పుడు, పెదాలకు కావల్సిన మాయిశ్చరైజర్ అందుతుంది, పెదాలు సాప్ట్ గా మారుతాయి. పెదాల పగుళ్ళను నివారిస్తుంది.

స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది:

స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది:

స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడంలో వెన్న ఉత్తమమైనది. వెన్నను స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే స్కార్స్ ను తొలగిపోతాయి. చర్మానికి కావల్సిన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది స్ట్రెచ్ మార్క్స్ ను నయం చేస్తుంది. మొటిమలను, మచ్చలను తొలగిస్తుంది.

డ్రై ప్యాచ్ స్కిన్ నివారిస్తుంది:

డ్రై ప్యాచ్ స్కిన్ నివారిస్తుంది:

డ్రై ప్యాచ్ స్కిన్ నివారించడంలో వెన్న బెస్ట్ హోం రెమెడీ. మోకాళ్లు, మోచేతులు, వేళ్ళు, మడవల వద్ద ఉండే డ్రై,అండ్ డెడ్ స్కిన్ తొలగించడం కోసం రెగ్యులర్ గా బాడీ బట్టర్ ను అప్లై చేయాలి. కొద్దిగా వెన్న తీసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇది చర్మంలోకి లోతుగా ఇంకి డ్రైనెస్ ను తగ్గిస్తుంది.

చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది:

చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది:

ఇది గ్రేట్ ఫేస్ మాయిశ్చరైజర్, ఇది చర్మానికి హైడ్రేషన్ అందివ్వడం మాత్రమే కాదు, ఇది చర్మంలో కాంతిని కూడా తీసుకొస్తుంది. నార్మడ్రైస్కిన్ కు వెన్న అప్లై చేసి తర్వాత మసాజ్ చయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో కాంతి పెరుగుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Beauty Benefits Of Body Butter

    Body butter is often known as a nutrient-dense cream that helps to moisturize and hydrate your skin deeply. There are several benefits of body butters and here we list a few of them.
    Story first published: Monday, March 6, 2017, 13:17 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more