ఐక్రీమ్ ను ఇలా కూడా వివిధ రకాలుగా ఉపయోగించుకోచ్చు..

Posted By:
Subscribe to Boldsky

కంటి చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే అక్కడ ఉపయోగించే సౌందర్య లేపనాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. లేదంటే.. కంటి చుట్టూ ఉన్న చరమం పాడైపోతుంది. ఇలా జరగకుండా ఉండటానికి అక్కడి చర్మ తత్వానికి తగిన విధంగా తయారుచేసిన ఐక్రీమ్ను ఉపయోగిస్తారు.

Beauty Benefits of Eye Cream..!!

అయితే ఇది కేవలం కళ్ల చుట్టూ ఏర్పడిన నల్లని వలయాలను తగ్గించి అక్కడి చర్మాన్ని అందంగా మార్చడమే కాదు, ఇతర సౌందర్య అవసరాల కోసం కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

పెదవులు అందంగా

పెదవులు అందంగా

పెదవులు అందంగా, సాప్ట్ గా కనిపించడానికి లిప్ బామ్ ని ఉపయోగిస్తుంటాం. ఒక వేళ లిప్ బామ్ అయిపోతే..? దానికి బదులుగా ఐక్రీమ్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఐక్రీమ్ తీసుకుని, పెదవులను మర్ధన చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల పెదవులు సాప్ట్ గా తయారవడంతో పాటు వాటి చుట్టూ ఉన్న చర్మం ముడుతలను పడకుండా ఉంటుంది.

మేకప్ వేసుకొన్నప్పుడు

మేకప్ వేసుకొన్నప్పుడు

మేకప్ వేసుకొన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడక్కడా ఖాళీగా లేదా పొడిబారినట్లు ప్యాచెస్ లా కనిపిస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఐక్రీమ్ మనకు బాగా ఉపయోగపడుతుంది. దీని సాయంతో ప్యాచెస్ ను కవర్ చేయవచ్చు.

చేతి చర్మ సంరక్షణ

చేతి చర్మ సంరక్షణ

చాలా మంది చేతి చర్మ సంరక్షణ విషయంలో ఆలసత్వం ప్రదర్శిస్తుంటారు. దీనికి కారణంగా చేతులు పొడి బారిపోయి..ముడతలు పడినట్లుగా నల్లగా, కళావిహీనంగా కనిపిస్తాయి. దీనికి ఐక్రీమ్ చక్కటి పరిష్కరాన్నిస్తుంది. ఇందుకోసం ఐక్రీమ్ ను చేతులకు రాసుకుని కాసేపు మర్దన చేసుకుంటే కోల్పోయన తేమను తిరిగి పొందొచ్చు. అలాగే గోళ్ల చుట్టూ ఉన్న చర్మానికి మసాజ్ చేయడం ద్వారా గోళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.

మేకప్ కోసం ఉపయోగించే కన్సీలర్

మేకప్ కోసం ఉపయోగించే కన్సీలర్

మేకప్ కోసం ఉపయోగించే కన్సీలర్ కొన్ని సందర్భాల్లో పొడిబారిపోయినట్లుగా తయారవుతుంది. దీంతో అది పనికిరాకుండా పోయిందని పడేస్తుంటాం. అయితే ఐక్రీమ్ ఉపయోగించడం ద్వారా దాన్ని మళ్లీ ఉపయోగంచుకోవడానికి వీలుగా తయారుచేసుకోవచ్చు. దీనికి కోసం కన్సీలర్ ను ఐక్రీమ్ లో కలిపి పేస్ట్ లా తయారుచేసి దాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే చక్కని చర్మ రంగు మీ సొంతమవుతుంది.

చర్మంపై నల్లటి మచ్చలున్నప్పుడు

చర్మంపై నల్లటి మచ్చలున్నప్పుడు

చర్మంపై నల్లటి మచ్చలున్నప్పుడు వాటిని కప్పి ఉంచడానికి స్పాట్ కరెక్టర్ లేదా కన్సీలర్ ఉపయోగింస్తుంటాం. అయితే దీనికోసం ఐక్రీమ్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే నల్లటి మచ్చలున్న చోట దీన్ని తరచూ రాసుకొంటూ ఉంటే తక్కువ సమయంలోనే అవి చర్మంలో కలిసిపోతాయి.

ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఐక్రీమ్ ను రాసుకోవాలి.

ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఐక్రీమ్ ను రాసుకోవాలి.

కొన్ని సందర్భాల్లో మనం ఉపయోగించే ఫౌండేషన్ వల్ల మనకు అంత అందం రాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఐక్రీమ్ ఉపయోగించడం ద్వారా మీ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. దీనికోసం ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఐక్రీమ్ ను రాసుకోవాలి. ఇలా ఆ తర్వాత కన్సీలర్, పౌడర్ రాసుకుంటే మీ మేకప్ బాగా కనిపిస్తుంది. అయితే ఐక్రీమ్ రాసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కాకుండా చాలా తక్కువ మొత్తంలో ఉపయోగించుకోవడం మంచిది.

కనుబొమ్మల షేప్ అందంగా

కనుబొమ్మల షేప్ అందంగా

కనుబొమ్మల షేప్ అందంగా ఉండేందుకు వాటిని తరచూ షేప్ చేసుకోవాల్సి వస్తుంది. దీని వల్ల అక్కడ చర్మం గీతలు పడటం లేదా సన్ని ముడతల్లా కనిపిస్తుంటుంది. అయితే ఇవి తగ్గుముఖం పట్టి చర్మం అందంగా తయారు కావాలంటే మాత్రం ఆ ప్రాంతంలో క్రమం తప్పకుండా ఐక్రీమ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

English summary

Beauty Benefits of Eye Cream..!!

Beauty Benefits of Eye Cream .Under-eye creams manufactured by brands have a lot of benefits. Yes, for example some of them have retinol, which is known to be one of the best ingredients for getting rid of lines and wrinkles, which actually works.
Story first published: Wednesday, April 19, 2017, 16:00 [IST]
Subscribe Newsletter