For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూకలిఫ్టస్ ఆయిల్ ద్వారా కలిగే బ్యూటీ బెనిఫిట్స్

|

ప్రస్తుత కాలంలో ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి మంచి డిమాండ్ లో ఉన్నాయి. వీటిని అనేకరకాలుగా వాడుతున్నారు. సరైన విధంగా ఎసెన్షియల్ ఆయిల్స్ ని వాడితే అనేక ఆరోగ్య అలాగే సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చు. చర్మానికి మంచి నిగారింపుని ప్రసాదించడంతో పాటు చర్మంపై మచ్చలని తొలగించి ముడతలను అలాగే ఫైన్ లైన్స్ ను కూడా నిర్మూలించే గుణం ఎసెన్షియల్ ఆయిల్స్ లో కలదు. కొన్ని ప్రత్యేకమైన ఎసెన్షియల్ ఆయిల్స్ ని తగిన విధంగా వాడటం వలన దెబ్బతిన్న జుట్టు బాగవుతుంది. అలాగే జుట్టు దృఢంగా కూడా మారుతుంది.

అరోమాథెరపీలో ఎసెన్షియల్ ఆయిల్స్ ని విస్తృతంగా వాడతారు. క్లీన్సింగ్ సోప్స్ లో అలాగే కొన్ని ఆర్గానిక్ షవర్ జెల్స్ తయారీలో కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ ను వాడుతున్నారు. ప్రతి ఎసెన్షియల్ ఆయిల్ లో ప్రత్యేకమైన సువాసన దాగుంది. ఈ సువాసన శరీరంతో పాటు మనసుకు సాంత్వన కలిగిస్తుంది.

కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ లో ఔషధ గుణాలు కూడా కలవు. ఉదాహరణకి, యూకలిఫ్టస్ ఆయిల్ లో అనేకమైన ఔషధ గుణాలున్నాయి. యాంటీ సెప్టిక్, యాంటీ ఇంఫ్లేమేటరీ గుణాలు యూకలిఫ్టస్ ఆయిల్ లో కలవు. అందుకే, ఈ ఆయిల్ ని మస్కిటో మరియు ఇన్సెక్ట్ రేపెలెంట్ గా కూడా వాడతారు.

యూకలిఫ్టస్ ఆయిల్ అనేది ముక్కు దిబ్బడని అలాగే సైనస్ కంజెషన్ ని సులువుగా తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఈ ఆయిల్ ద్వారా అనేకమైన సౌందర్య ప్రయోజనాలు పొందొచ్చన్న విషయం మీకు తెలుసా?

యూకలిఫ్టస్ ఆయిల్ ని యూకలిఫ్టస్ ఆకుల స్వేదనం నుంచి గ్రహిస్తారు. దీని పరిమళం తీయగా అలాగే కాస్త ఘాటుగా ఉంటుంది.

యూకలిఫ్టస్ ఆయిల్ ద్వారా కలిగే సౌందర్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. క్లీన్సింగ్ ఏజెంట్

1. క్లీన్సింగ్ ఏజెంట్

యూకలిఫ్టస్ ఆయిల్ అనేది బ్రహ్మాండమైన స్కిన్ క్లీన్సర్. ఇది మీ చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంతో పాటు చర్మంలో పేరుకుని ఉన్న దుమ్మూ ధూళిని తొలగిస్తుంది. ఈ విధమైన చర్మ సంరక్షణ కోసం యూకలిఫ్టస్ స్క్రబ్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. యూకలిఫ్టస్ స్క్రబ్ కావలిసిన పదార్థాలు ఒక టీస్పూన్ యూకలిఫ్టస్ ఆయిల్ ఒక టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ తయారుచేసే విధానం 1. పైన చెప్పబడిన పదార్థాలని చక్కగా కలిపి ఈ మిశ్రమాన్ని స్క్రబ్ లా మీ ముఖంపై అప్లై చేయండి. అయితే, సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు ఈ ఆయిల్ ను అర టీస్పూన్ మాత్రమే వాడాలి.

2. యాక్నే సమస్యను పరిష్కరిస్తుంది

2. యాక్నే సమస్యను పరిష్కరిస్తుంది

యూకలిఫ్టస్ ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్ అలాగే యాంటీ మైక్రోబయాల్ ప్రాపెర్టీలు కలవు. ఇవన్నీ, యాక్నేను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. యాక్నేని కలిగించే బాక్టీరియాను నశింపచేసి అలాగే వాటి ఎదుగుదలను అరికడతాయి. అలాగే, ఇతర రకాల చర్మసమస్యలు కూడా తలెత్తకుండా సంరక్షించడానికి ఈ ఆయిల్ తోడ్పడుతుంది.

యూకలిఫ్టస్ ఆయిల్ ను నీమ్ ఫేస్ ప్యాక్ తో కలిపి వాడి బ్రేకౌట్స్ ని తగ్గించుకోండి

కావలసిన పదార్థాలు

గుప్పెడు ఎండిన వేపాకులు

ఒక టీస్పూన్ యూకలిఫ్టస్ ఆయిల్

తయారుచేసే విధానం

1. ఎండిన వేపాకులను చక్కటి పొడిలా తయారుచేసుకోవాలి.

2.ఈ పౌడర్ ని యూకలిఫ్టస్ ఆయిల్ తో కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.

3. అవసరమైతే కాస్త నీరు కూడా జోడించండి. ఈ ప్యాక్ ను బ్రేక్ అవుట్స్ వద్ద అప్లై చేస్తే సమస్య మటుమాయమవుతుంది.

4. దాదాపు 20 నిమిషాల తరువాత ప్రభావిత ప్రదేశాన్ని శుభ్రం చేయండి.

3. మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్:

3. మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్:

యూకలిఫ్టస్ లో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీలు అధికంగా ఉన్నాయి. ఈ ఆయిల్ ను చర్మంపై అప్లై చేయడం ద్వారా చర్మానికి తగినంత తేమని అందించవచ్చు. ఈ ఆయిల్ ను బాడీ లోషన్ గా వాడి అద్భుత ఫలితాలు పొందవచ్చు. ఈ ఆయిల్ నుంచి వచ్చే పరిమళం అమోఘంగా ఉంటుంది. అనేకరకమైన ఇన్ఫెక్షన్స్ నుంచి మీ చర్మాన్ని సంరక్షించడానికి ఈ ఆయిల్ ఎంతగానో తోడ్పడుతుంది.

అవొకాడో తో పాటు మిళితం చేయబడిన యూకలిఫ్టస్ ఆయిల్ ప్యాక్ అనేది పొడిబారిన చర్మానికి అద్భుతమైన పరిష్కారం.

కావలసిన పదార్థాలు

ఒక టేబుల్ స్పూన్ అవొకాడో పల్ప్

ఒక టేబుల్ స్పూన్ యూకలిఫ్టస్ ఆయిల్

తయారుచేసే విధానం:

1. ఒక బౌల్ లో ఈ పదార్థాలన్నిటినీ బాగా కలపండి.

2. తయారైన మిశ్రమాన్ని పొడిబారిన చర్మంపై అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి.

3. ఆ తరువాత శుభ్రమైన నీటితో ప్రభావిత ప్రదేశాన్ని కడగండి.

4. చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది

4. చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది

యూకలిఫ్టస్ ఆయిల్ లో చర్మాన్ని ప్రశాంతపరిచే లక్షణాలు కలవు. అందుచేత సన్ బర్న్ సమస్య తీవ్రతను తగ్గించి చర్మాన్ని చల్లబరుస్తుంది. తీవ్రమైన ఎండ ఉన్న రోజు ఈ ఆయిల్ ను కూలింగ్ స్ప్రే లా వాడవచ్చు. అలాగే, మేకప్ సెట్టింగ్ స్ప్రే గా కూడా వాడవచ్చు.

ఎండాకాలంలో, ఈ యూకలిఫ్టస్ ఆయిల్ స్ప్రే ను అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం.

కావలసిన పదార్థాలు

ఒక టీస్పూన్ యూకలిఫ్టస్ ఆయిల్

స్వచ్ఛమైన నీటితో నింపబడ్డ ఖాళీ స్ప్రే బాటిల్

తయారుచేసే విధానం

1. నీటితో నింపబడ్డ స్ప్రే బాటిల్ లో యూకలిఫ్టస్ ఆయిల్ ను జోడించండి.

2. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ స్ప్రే బాటిల్ ను మీతో తీసుకెళ్లండి. ఇది మీ చర్మాన్ని చల్లబరచి ఎర్రగా కందిపోయిన మీ చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.

యూకలిఫ్టస్ ఆయిల్ ని సిఫార్సు చేసిన మోతాదులోనే వాడితే అనవసర సైడ్ ఎఫెక్ట్స్ వలన ఇబ్బందులు కలగవు. ఎక్కువగా వాడితే మీ చర్మం ఇరిటేషన్ కి గురికావచ్చు. అలాగే, ఘాటైన యూకలిఫ్టస్ ఆయిల్ వాసన వలన వికారంతో అనారోగ్యం కలగవచ్చు. నమ్మకమైన చోటు నుంచే స్వచ్ఛమైన యూకలిఫ్టస్ ఆయిల్ ని తెచ్చుకుని వాడండి. కల్తీ నూనెలు వాడితే అనారోగ్యం కలగవచ్చు.


English summary

యూకలిఫ్టస్ ఆయిల్ ద్వారా కలిగే బ్యూటీ బెనిఫిట్స్

It is most commonly used to provide relief from blocked nose and sinus congestions. But did you know that it has many beauty benefits too? Eucalyptus oil is extracted by distillation of the leaves of its plant. Its smell is sweet and camphorous.
Story first published:Monday, December 25, 2017, 7:07 [IST]
Desktop Bottom Promotion